Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మరియు భారతీయులు శాంతిప్రియులు. అహింసావాదులైనను వీరు నిరస్త్రులు, నిరాయుధులు, నిస్తేజస్కులు కారు, కారాదు, అని చాటుట మా ఆశయము. శ్రీరామచంద్రుని గూర్చి వాల్మీకి చెప్పినట్లు "కస్య బిభ్యతి దేవాళ్ళ, జాతరోషస్య సంయుగే" అనునదియే భారతీయులకు సమీచీనమైన ఆదర్శము. దీనిని మనసునం దుంచుకొని సంగ్రామ శాస్త్రమను విభాగము నొకదాని నిందు చేర్చితిమి. కాని దీని నిర్వహణము మాకొక సమస్య యైనది. చిరకాలము పారతంత్ర్యమునందు పడియుండుటచే భారతీయులకు - తత్రాపి ఆంధ్రులకు యుద్ధ విజ్ఞానమే కొరవడినది. ఆంగ్ల విజ్ఞాన సర్వస్వమువంటి ఉద్గ్రంథములలో సంగ్రామ శాస్త్రము దక్షతతో చర్చింపబడినది. వాటి ననుకరించుట సాధ్యమే యైనను కేవల గ్రంథ జ్ఞానము అనుభవ జ్ఞానమునకు సాటిరాదు కదా యని సంకోచించుచున్నాము. సంగ్రహ విజ్ఞానకోశ నిర్మాణమునందు మాకు గల్గిన మరియొక సౌభాగ్యము స్మరింపదగియున్నది. దీని సంపాదకులలో పలువురు, ఉస్మానియా విశ్వవిద్యాలయపు ఆచార్యులుగనో, దాని అనుబంధ సంస్థలతో సంబంధము కలవారుగనో ఉండుట ఏర్పడినది. నిజమునకు ఉస్మానియా విశ్వవిద్యాలయమునకు ఈ యుద్యమ ముతో ప్రత్యక్ష సంబంధ మేమియును లేదు. కాని సమర్థులైన సారథుల నెందరినో అయాచితముగ ప్రసాదించిన ఉస్మానియా విశ్వవిద్యాలయము పరోక్షమిత్రమనుటలో సందేహములేదు. నిర్వహింపబడునది విజ్ఞానకోశము. నిర్వాహకులు చాలవరకు విశ్వవిజ్ఞాన ప్రతిబింబమైన విశ్వవిద్యాలయమునందలి అధ్యాపకులు. వారి బాధ్యతలను గూర్చి వేరే మనవిచేయనేల? ప్రశంసింపనేల? మరియొక అంశము పేర్కొనదగియున్నది. హైదరాబాదు నగ రము పెక్కు భాషలకును సంస్కృతులకును కూడలిగ నుండినది. ఈ భాషాసంస్కృతుల ప్రతినిధుల యొక్క ఆదరసహాయములు సంగ్రహ విజ్ఞానకోశమునకు లభించుట ముదావహము. అందును మన ముసల్మాను సోదరు విజ్ఞులు విద్యాధికులు అయిన పలువురు విజ్ఞానకోశముతో సన్నిహిత సంబంధము కలిగి మాకు చేదోడు సన్నిహితసంబంధము వాదోడుగానుండుట సంతోషదాయకము, వీరిలో డాక్టరు వహీదుద్దీను, ప్రొఫెసరు హరూన్ ఖాన్ షేర్వానీ, డాక్టరు యూసుఫ్ హుస్సేన్ ఖాన్, జనాబ్ అబ్దుల్ మజీద్ సిద్ధికి, డాక్టరు అబ్దుల్ మెయిడ్ ఖాన్, డాక్టరు సయీదుద్దీన్ మున్నగు ప్రముఖు లెందరో ఉన్నారనుట మాకు గర్వకారణముగనున్నది. సోదర భాషా భాషీయు లలో కన్నడ శాఖాధ్యక్షులు ఆచార్య డి. కె. భీమసేనరావు, కవిలె భాండార శాఖాధిపతి శ్రీ ఆర్. యం. జోషీ మున్నగువారు పెక్కు మందిగలరు. విజ్ఞాన బాంధవ్యమునకు దగ్గర ఏమి ? దూరమేమి ? కటక్ విశ్వవిద్యాలయా చార్యులు శ్రీ గోపాలచంద్ర మిశ్రా, గౌహతీ విశ్వవిద్యాలయాచార్యులు డాక్టరు మహేశ్వర నియోగ్ అను శ్రీ వారు చక్కని వ్యాసములను వెలయించినారు. ఇట్లెందరిని పేర్కొనగలము? మాది తామరకొలనువంటి సంస్థ. నీటి కొలది తామర సుమ్మీ'! లలో సంగ్రహ విజ్ఞానకోశ నిర్మాణయత్న మెట్లు పొటమరించినది ? ఎందుకు తలయెత్తినది? “కారణంబులు ఉద్బోధకములు" ఏవి అని తెలిసికొనుటకు మీకు కుతూహలము ఉండవచ్చును. లేకున్నను మేము వినిపింతు ము లెండు. .ప్రోద్యమానుడగు కవికుమారుడు తన కావ్యములు వినుమని నిర్బంధించినట్లు. విజ్ఞానకోశము ఊర్థ్వ మూలము, అధశ్శాఖము అయిన వింత అశ్వత్థ వృక్షమా ! లేక నేలనుండి వేళ్లు తన్నుకొనివచ్చిన వృక్షమా ? ఇది భూజమే గాని ఆ కాళజము కాదని మనవి చేయుచున్నాము. ఎట్లన ప్రభుత్వము ఒక ఉద్యమము అవసర మని భావించి, స్థాపించి, నిరంతర ధనజల సేచనముచే పెంపొందించిన వృక్షము ఊర్ధ్వమూలము. ఒక ఉద్యమము అవసరమని భావించిన ప్రజలచే ఏర్పాటు కావింపబడి, నిర్ధన తాగ్రీష్మమున మలమల మాడుచు. ఏ పుణ్యవంతులో పోసిన ఉద్ధరణి నీళ్లతో తలయెత్తుచు, ఎన్నటికైన వర్షాగమము కాకుండునా యని నీరసపు బలముతో లేచిన వృక్షమే అధోమూలమైన వృక్షము. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశమట్టి అధోమూలమైన వృక్షమని సవినయముగ నే చాటుచున్నాము. “ఏవీ-దీని వేళ్లెచ్చట నున్నవి ?" అందురా - ఓపికతో, ఉపాయముతో త్రవ్వి చూడుడు. లేదా మా గ్రంథమందు ప్రకటింపబడిన వ్యాసము 'ఆంధ్రోద్యమము - (తెలంగాణములో)' అను దానిని చిత్తగింపుడు. ܦܗ