Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- పరాసు విప్లవని నాదములు స్వాతంత్ర్యము, సమానత్వము, సౌభ్రాతృత్వము - అను మంత్రత్రయ - అను మంత్రత్రయ మీ గ్రంథము మూలముననే ఉర్ధోషింపబడెనని తజ్జ్ఞులు చెప్పుదురు. విజ్ఞాన సర్వస్వ ప్రయోజనమును గూర్చి ఫ్రెంచి విజ్ఞాన సర్వస్వ సంపాదకులలో ప్రముఖుడైన డెనిస్ డిడిరో మహాశయు డిట్లు వ్రాసెను : "ప్రపంచ వీథులలో వికీర్ణమై పడియున్న విజ్ఞానమును రాశిచేసి సమకాలికులకు పరిచయము చేయుటయే విజ్ఞానసర్వస్వపు టాదర్శము. అనంతర తరముల వారికి ఈ జ్ఞానభాండారము నందిచ్చుటయు దీని లక్ష్యమే. ఇట్లు చేయుటవలన పూర్వ పూర్వ తరముల విజ్ఞానము ఉత్తరోత్తరతరములవారికి అందుబాటులోనికి వచ్చుచున్నది. లేకున్నచో అది నష్టమగు ప్రమా దముగలదు. మనసంతతివారు ఈ విజ్ఞానావలోడనముచే జ్ఞానవంతులు, సుఖవంతులు కాగలుగుట మన లక్ష్యము. ఇక మనమును నిరర్థకముగ జీవించి మరణించినవారము కాకుందుము గాక యనియు, లోకము మనలను కృతజ్ఞతతో స్మరించవలెననియు ఆశించి విజ్ఞాన సర్వస్వరచన సాగింతము.” అయినచో రూసో, వాల్టేరు, డిడిరోవంటి మహా రచయితలు సంగ్రహాంధ్ర విజ్ఞానకోశమును తమ రచనలచే ప్రకాశింపచేసిరాయని మీరడుగవచ్చును. ఉన్నారు కాని యొక పరమ భేదమును గుర్తించవలెను. శ్రీమామిడిపూడి వేంకటరంగయ్య, పద్మభూషణ, డాక్టరు పి. టి. రాజు, ఉప్పులూరి గణపతిశాస్త్రి, బులుసు అప్పన్న శాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, డాక్టరు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, కురుగంటి సీతారామయ్య. దూపాటి వేంకటరమణాచార్యులు, ఆదిరాజు వీరభద్రరావు మున్నగు పలువురు పలిత కేశులు, ఏకదంతులు, గళిత దంతులు వారివారి అభిమాన విషయములలో దుర్దాంతులు అయినవా రెందరో సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోళములో వ్యాస చంద్రికలను వెదజల్లినారు. "పాశ్చాత్య విజ్ఞాన మదదంతావళములైన రూసో, వాక్టేరు మున్నగువా రెక్కడ? దేవుడని, సత్యమని, శాంతియని, అహింసయని ప్రసన్నా రావములు చేయుచు హరిణశాబక సదృశులైన వేంకట రంగయ్య, గణపతి శాస్త్రివంటి వారెక్కడ? ఔ పమ్యభంగమైనది" అని అట్టహాసము చేయు దురు నేటి యువకులు. మేమందుము గదా, తొందరపడవలదు. వారికిని వీరికిని భేదము గుర్తించుడు. పాశ్చాత్య చింతకులు కృశాను సదృశులు. భారతీయ చింతకులు వరుణసదృశులు. సప్తజిహ్వుని చూచి శిశువులు కూడ దూరదూరముగ ప్రాకిపోవుదురు. శీతల జల పూర్ణ కుంభమును చూచి ఆ శిశువులే అల్లరిచేయుచు ఆలింగనము చేసి కొందురు. భారతీయులది పూర్ణకుంభ సంస్కృతి. పాశ్చాత్యులది విద్యుదట నాగరకత. ఏది లేకున్నను లోకము తావన్మాత్ర దరిద్రమగును. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశమునందు పూర్ణకుంభ - విద్యుదట విద్యుదట - సమ్మేళనమును సాధింప యత్నించుచున్నాము. లక్ష్యసాధనమున మావి దుర్బల హస్తములు కావచ్చును. లక్ష్యమునే అభినందింపుడు. ఈ విచిత్ర సమ్మేళనమును తాటిపండ్లు ఆవగింజలు కలబోసినట్లు - మీరెట్లు సాధింప బూనుకొన్నారని మీరడుగుదురు. 1. ప్రతి శాస్త్రమునందును ప్రాచీన భారతీయులు సాధించిన విజయములు సమీక్షించుటకు తగి నట్లు శీర్షికలను ఏర్పాటు చేయుట. 2. ప్రాచీన భారతీయ మహావ్యక్తుల చరిత్రములను యథా సంభవముగ వ్రాయించుట. ఉదా : ఆపస్తంబుడు, అన్నంభట్టు, 3. ఇంతటితో తృప్తిపడక "భారతదేశపు ప్రాచీన విద్యలు - కళలు" అను క్రొత్త విభాగమునే ఈ కోశమునందు చేర్చితిమి. 4. అట్లే ఆయుర్వేదము అను ప్రత్యేక శాఖను గూడ ప్రవేశ పెట్టితిమి. పాశ్చాత్య వైద్యపద్ధతినే కాక ఆయుర్వేద మహత్త్వమును గూడ దీని ముఖమున లోకమునకు ప్రకటింప యత్నించితిమి. వీటిలో మూడవదగు "భారతదేశపు ప్రాచీన విద్యలు - కళలు" అను విభాగము మాకు మిక్కిలి ఆప్యాయమైనది. అయినను ఇందలి శీర్షికలపై వ్యాసములు వ్రాయువారు మిక్కిలి అరుదుగా లభించినారు. ప్రాచీన విద్య లెరిగిన పండితవరేణ్యులు ఈ శాఖను విజయవంతముగా నిర్వహించుటకు తోడ్పడ ప్రార్థితులు. లేనిచో ప్రాచీన భారత విజ్ఞానము ఆర్భాటము కలదేకాని సత్తాలేనిది యని విమర్శకులు మమ్ముల దుయ్యబట్టగలరు. ఈ సంపుటమునందు 'అభ్యవహారము - ఆర్ష పద్ధతి' 'ఆర్షగణితము' 'ఆర్షభూగోళము మొదలగు విద్వత్తాపూర్ణములైన వ్యాసములు వ్రాసిన పండితులు మా కృతజ్ఞతలకు పాత్రులు. ఈ విధముగ ప్రాచీన విజ్ఞానమునకును, ఆధునిక విజ్ఞానమునకును ఈ విజ్ఞానకోశము సేతువుగా నుండగలదని మా ఆశయము.