Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజంతా అజంతా శిల్పము సంప్రదాయగతమైన సాంకేతిక చిహ్నములకును, బుద్ధుని మానవాకారములో చిత్రించగూడదను నిషేధమునకును అతీతమైన దగుచు పలు వి ధ ము ల గు రీతులలో కాన్పించును. బుద్దుని వి యొకయు, బోధిసత్వుల యొకయు, ఇంకను ఇతర మైన బొమ్మలయొక్కయు పూర్ణ చిత్రణము చేయుటయందు అప్పటికి సాధింపబడిన శిల్పప్రాశస్త్యమును ఇవి ప్రదర్శిం చును. ప్రాచీనమగు అమరావతి, నాగార్జునకొండ అందు వలెనే ఇచ్చటను ఉబ్బెత్తుబొమ్మల శిల్పము (Bas - relief) తన విశిష్ట జీవచైతన్యమును నిలుపుకొన్నది. వర్ణ చిత్ర లేఖన మభివృద్ధిగాంచిన పిదప కథనాత్మకమగు దృశ్య ముల చిత్రణమునందు ఉబ్బెత్తు చిత్ర శిల్పము ప్రాచీన కాలమందువలె ప్రత్యేకతను ఎక్కువకాలము నిలుపుకొన లేక పోయెను. అయినను వర్ణ చిత్రలేఖనముగాని కేవల వాస్తువివరణముగాని ప్రత్యామ్నాయముగా వినియోగ వడని పరిస్థితులలో అలంకరణ ప్రభావము కొరకై ఉబ్బెత్తు చిత్రముల శిల్పమే యింకను ప్రత్యేకమైన విలువను కలిగి యుండెడిది. నిజమునకు వర్ణ చిత్రలేఖనము అత్యున్నత రళనందిన యీ కాలములో ఉబ్బెత్తు చిత్రముల శిల్పము వాస్తువుతో సమైక్యత పొందినది. విగ్రహనిర్మాణ సమ స్యలు శిల్పవిద్యకు వదలిపెట్టబడెను. ఈనాటి విగ్రహ శిల్పులు భక్తులను, కళాభిజ్ఞులనుకూడ సంతోష పెట్టగల అపురూపమైన శిల్పపరాకాష్ఠను సాధించిరి. " వార స్తంభఫలక చిత్రణశిల్పము (Pillar Medallion) అమ రావతియందు అసమానమగు పరిపూర్ణతను పొందెను. అజంతాశిల్పి ఈ అమరావతీ కళా కౌశలమును సత్వముగా గైకొనుచు ఉబ్బెత్తు చిత్రముల అలంకరణ మందు తన అసమాన ప్రజ్ఞను వెలిబుచ్చెను. పత్రసంపద, పుష్పసమృద్ధి, వీటి నిర్మాణములోని నాణ్యము, కమల సౌందర్యమును, తు, చ, తప్పకుండ శిల్పించుట - " స్తంభ ఫలకముల మధ్యభాగమున చిత్రితములై, విచ్ఛిన్నమై తీగెచుట్టలుగా పరిణమించు జలముల చిన్న సుడులలో తేలియాడు శతపత్రముల శిల్పము వేయేల, ఆకృతి రచన - యందలి నిరతిశయానందము, దాని సజీవచై తన్యశక్తియు అజంతాశిల్పమునందు నిస్సందేహముగా పొడగట్టుచున్నవి. అజంతా పనితనము అమరావతీ శిల్పమునుండి ఆవిర్భ 98 వించి పరిణామము నొందిన శిల్పమని యిది నిదర్శించు చున్నది. . . శిల్పము వాస్తువు యొక్క సమన్వితాంశ ముగా అజంతాలో స్పష్టముగా కనిపించును. ఇచట కొన్ని దృష్టాంతములు చెప్పవచ్చును; మొదటి గుహలోపలను, వసారాలోను, స్తంభముల ఆమలకములు (capitals) శిల్పము - వాస్తువు వీని సౌందర్య సమ్మేళనమును చక్కగా నిరూపించుచున్నవి. నాలుగుమూలలందు ఉన్న మరుగుజ్జు బొమ్మలు, ఆధార - ఆమలక ముల (bracket- capitals) సవిస్తరాలంకరణము, రెండు మధ్యస్తంభముల నడిమి నిడుపాటి దూలముల మీది మిక్కిలి సున్నితమై అద్భుత సౌందర్యము వెలార్చు శిలాలంకార రీతులును, ఆమలకముల మధ్య కూర్చొనియున్న మరుగుజ్జుబొమ్మలు, కప్పుచూరువంటి భాగము మీద పూలమాలలు పట్టుకొని యెగురుచున్నట్లు చిత్రింపబడిన బొమ్మ జంటలును, సున్నీ తమగు మకరముల చెక్కడములు కలిగి, మరుగుజ్జులచే `పహింపబడుచున్న ఆమలకముల క్రింది చదరపు ఫలకము లును, కాండముల మధ్య సంపీడితమైన మెత్తవంటి ఆమ లకమును, వసారాలోని గోడలో కలిసిన రెండు స్తంభ ములమీద చెక్కబడిన అర్ధకమలములు, పూర్ణకమలములు గల ఫలకములును, ముత్యపు సరులను వెడలగ్రక్కుచుం డిన కీర్తిముఖమును, మరియు దాని చివర భాగములను పట్టుకొని యెగురుచున్నట్లు బయటి స్తంభముల మీది ఆమలకముల క్రింది చతురస్ర ఫలకముల మీద చెక్కబడిన రెండు బొమ్మలును, కొన్ని పెద్ద స్తంభములమధ్య ఫలక ముల మీద చెక్కబడిన ఉపదేశ బుద్ధుని ప్రతిమలును, కుడి వైపున పూర్తిగా బయటనున్న స్తంభము యొక్క మధ్య ఫలకము మీద చిత్రింపబడిన మన్మథ జైత్రయాత్ర. బుద్ధుని ప్రలోభసము- ఇవి అన్నియు శిల్పమునకు వాస్తువునకు గల సమైక్యత యొక్క పరిపూర్ణతను నిస్సందేహముగా వెల్లడించు దృష్టాంతములు. 18 వ, 17 వ గుహలు శిల్పదృష్టిలో నెట్లు ముఖ్య మైనవో అట్లే వర్ణచిత్ర లేఖనమందును, వాస్తు సంపద యందును అంతముఖ్యములై యున్నవి. 16 వ గుహలోని ఆధార ప్రతిమలు, ముఖ్యముగా ఎగురుచున్న జంటలు, ప్రశంసనీయమగు సౌందర్యమందును, ఆకృతులయందును