Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దివ్యసుందరముగ శిల్పించిన స్తంభములును, స్తంభోపరి శిల్పపు విన్నాణము మొత్తమయి విహారము యొక్క అద్భుత రామణీయకతను, గాంభీర్యమును పెంపొందించు చున్నవి. చాలా 2 వ సంఖ్య గుహ, 1 వ సంఖ్య గుహకు వ వ వరకు ఆమ్రేడితమని చెప్పవచ్చును. దాని చావడి మొదటి గుహకన్న చిన్నదిగా నున్నది. స్తంభములును వాటి కొల తలలో కొంత భేదించుచున్నవి. కాని ఈ గుహ యొక్క ఆకృతిరచన యందలి క్రమసంపదయు, సమైక్యతయు కలిసి ఒకటవ సంఖ్య గుహకన్న యిది భావనాసీమ యందు విశిష్టతరమైనదిగా భాసించుచున్నది. ఈ కాలమున వాస్తుశాస్త్రము మహోన్నతస్థితి నం దె ననియు, ఉత్తమ వాస్తు సంప్రదాయములు క్రమ పరి ణామ దశయం దుండెననియు నిరూపించుటకు మరి యొకటి రెండు గుహలను గూర్చి ప్రసంగింపవచ్చును. దీని తరువాత ఏ కారణముననో కాని అజంతాయందు సృజ నాత్మకమైన చైతన్యము ఒక్క మారుగా అంతర్ధాన మొందెను. ఉదాహరణమునకు 24 వ సంఖ్య గుహను చెప్పవచ్చును. దీనియందలి చావడి 7 5 అడుగుల చదరమై 20 స్తంథములు కలదిగా కల్పింపబడినది. కాని యిది అసంపూర్ణముగ విడువబడినది. వసారాయు, వీథి నదరు స్తంభములు మాత్రము శిల్ప సమగ్రతను పొందినవి. ఇచ్చటి స్తంభములన్నియు ఒక్కటిమాత్రము వెల్తిగా విధ్వంసక మగుట దురదృష్టము. కాని గుహ - ఆకృతి రచనా సౌందర్యమును, పైకప్పునందలి ముఖ్య దూల మునకు సంబంధించిన స్తంభోపరిభాగములను మలచుట యందు ప్రదర్శింపబడిన శిల్పాచార్యకమును బట్టి ఇచ్చటి విహారము లన్నిటిలోని కిది తలమానికముగాను, అద్భుత నిర్మాణముగల గుహగాను సిద్ధముచేయుట కుద్దేశించిరని తోచును. 21 సంఖ్య గుహ యందు అజంతా గుహా స్తంభముల సామాన్య లక్షణమగు 'తెర' రూపమయిన స్తంభ శిరస్సు అదృశ్యమగుట గణింపదగిన విషయము. ఇప్పటినుండియు 'కలశము - పర్ణావళి' రూపమైన స్తంభ శీర్షము శిల్పరంగమున ప్రవేశించినది. భారతదేశపు అనం తర వాస్తువునం దిది సర్వజనాదరణము పొందినది. 24వ గుహలో ఈ వస్తువే కొలదిగా అభివృద్ధినొందిన పథక 13 . 97 ఆజండా ములో కాన్పించుచున్నది. ఈ గుహ మూడవ సంఖ్య గుహకన్న అనంతర కాలమునకు చెందినది కావచ్చును. 3. శిల్పము అజంతాశిల్ప మంతయు చాలామట్టుకు మహాయాన సంప్రదాయమునకు చెందినదై యున్నది. క్రీస్తుపూర్వపు నాటి ప్రాచీన గుహలలో శిల్పమేమియు లేదనవచ్చును. వాటిలో గోడలమీద వర్ణ చిత్రలేఖనము, కళాద్యోతకము లగు అలంకరణములు మాత్రము కలవు. నిజమునకు 'భాజ' మొదలుకొని చాలవర కన్ని గుహాలయములలో నిదియేస్థితి కలదు. శిల్పము క్రీస్తుతరువాత రెండవశతాబ్ది నుండి మాత్రమే కాగనగును. శిల్పప్రారంభమునకు చెప్పబడిన ఈ కాలమును బట్టి భారతీయ శిల్పకళకూడ కొయ్య చెక్కడపు పనులనుండి ఉత్పన్నమైనదని వాదింపబడుచున్నది. కాని భారతశిల్ప కారుడు ఇంతకుపూర్వము కొన్ని శతాబ్దులనుండియు రాతిచెక్కడమునందును తొలుచుటయందును అఖ్యానము కలిగియుండెనని స్పష్టముగా తెలియ వచ్చుచున్నది. మౌర్యుల రాజధానులును, భార్హూత్ శిల్పములును గొప్పనేర్పుతో కూడిన హస్తలాఘవముతో రాతిచెక్కడ మందు శిక్షితులైన శిల్పకారులచే నిర్మింపబడెను. శిల్పమందలి సాంకేతికత: భారత శిల్ప కారుని చే అనుసరింపబడిన సాంకేతిక విధానము మిక్కిలి కౌశల ముతోకూడినదై వంశపరంపరాగతమును, సాంప్రదాయ కమును అగు శిల్పవిజ్ఞానము యొక్క అనేక శతాబ్దముల అనుభవమును నిరూపించు చున్నది. స్థూలా కారమును తయారుచేయుటకు వెడల్పగు ఉలియు, సున్నితమైన వివరములను చెక్కుటకు సన్నని ఉలియు వాడబడెడివి. బొమ్మలపై ఉలిచెక్కడముల చిహ్నములేమియు కను పించకుండ నుండునట్లు చెక్కబడెడివి. ముఖములు, చేతులు నునుపుగా రుద్దబడెడివి. ఈపని అన్ని యెడలను అత్యంత నిర్దుష్టముగ చేయబడినది. ఈ ప్రాచీన శిల్పము లలో చాలాభాగము సవ్యహస్త శిల్పులచే చెక్కబడెను. శిల్పముల వామభాగములను చెక్కుటయందు ఆకృతి రచనలోను, నునుపుదనమునందును స్వల్పలోపములు కనబడుచున్నవి.