Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొదటిదశ : విహారములు :- క్రీస్తుపూర్వపువిహారములు నిరలంకృతములై, ఆకృతినిష్ఠురములై కాన్పించును. వీనిలో మధ్య గది యొకటి యుండును. దీని చుట్టును మూడు ప్రక్కలను అరలు (cells) ఉండును. ఈ యరలు చిన్న పరిమాణములలో నుండును. ప్రధాన మందిరముతో కలుపుటకు వీటికి ఇరుకుద్వారములు కలవు. అరలలో నిడుపు బల్ల లరీతిగ చెక్కి, ఒక భాగము తలగడవలె నుండు టకై కొంచెము ఎత్తుగ ఏర్పరుపబడి యున్నది. ఇది బౌద్ధ సన్యాసుల శయన సౌకర్యములు. 12 వ గుహ మిక్కిలి ప్రాచీనమైన విహారముల విభాగమునకు చెందును. కాని 13 సంఖ్య గుహ ప్రాచీన విహారములకు చక్కని యుదాహరణము కాగ లదు. దీని నడిమిగది 184 అడుగుల వెడల్పు, 164 అడు గులలోతు, 7 అడుగుల ఎత్తు కలిగియున్నది. మధ్య మందిరమునుండి వెలువడు అరలు సప్తసంఖ్యలో నున్నవి. ఇందు మూడు అరలు ఎడమభాగమునను, కుడిభాగము నను వెనుక వైపునను రెండేసి యరలును గలవు. బౌద్ధ భిక్షువులందుకూడ అలంకరణ ప్రీతినిసర్గమగుటచే, వారు తొలికాలమునుండియు ఈ యరల మీద బుద్ధ పవిత్ర చిహ్న ములను, దగోబా, పవిత్రమైన కటకటాలు, రాతితెరలు మున్నగువాటిని చెక్కుచుండిరి. ఈయంళమున అజంతా విహారములు, సమకాలికములైన భాజా, బేడా, జున్నారు, నాసికు మొదలగు ప్రదేశములందలి గుహా విహారములను బోలియున్నవి. ఇవియన్నియు క్రీ. పూ. రెండవ లేక ఒకటవ శతాబ్దమునకు చెందినవి. అర్వాచీన విహారములు:- క్రనుముగ బౌద్ధమతము జనాదరణమునందు బలీయమగుచు వచ్చిన కొలదియు, భితుకుల సంఖ్య హెచ్చదొడ గెను. విహారముల విస్తీర్ణతా పరిమాణములు పెద్దవయ్యెను. మహాయాన మత విజృంథ ణముతో విహారములు దేవాలయములుగ మారజొచ్చెను. పూజావిధానమునకై బుద్ధుని మనుష్యాకార విగ్రహ ములను నిర్మించుటకు మహాయానము అనుమతించెను. ఈ కాలపు విహారములందు విహారమునకు వెనుక భాగ మున విగ్రహస్థానమైన మందిర ముండుట ఆచార ముయ్యెను. 4 వ సంఖ్య గుహలో మొట్టమొదటిసారిగా పూజావిగ్రహమును, పూర్వమందిరమును ప్రవేశ పెట్టుట 95 అజంతా చూడనగును. ఇది అత్యంత ప్రాచీనమైన మహాయాన విహారము, దీనిలో 87 చదరపు టడుగుల విస్తీ ర్ణముగల చావడికలదు. వెనుక భాగమున పూర్వ మందిరమును, పూజావిగ్రహమును ఉన్నవి. బౌద్ధ జీవితము యొక్క ఉత్తమలక్షణములు దీనియందు ప్రతిబింబించు చున్నవి. గుహ మిక్కిలి వి స్తీర్ణము కలిగియున్నది. దీని వాస్తులక్షణ ములు బృహదాకార సంపన్నములై యున్నవి. అలంకార చిత్రము మితిమీరి లేక పొదుపరిలక్షణము కలిగియున్నది. ఈలక్షణములు బౌద్ధ మతము యొక్క సంయమనశీల మును, ఆధ్యాత్మిక జీవితము యొక్క నిరతిశయ వైపు ల్యమును సూచించుచున్నవి. ఈ విహారము క్రీ. శ. మూడవ శతాబ్దిలో కాని అంతకు పూర్వము కాని తొలువ బడియుండునని తోచును. ద్వారబంధముమీదను, వాతా యనముల మీదను కనబడు చెక్కడపుపని అనంతర కాల ములో జరిగియుండును. 11 వ సంఖ్య గల గుహ నిర్వివాదముగ మహాయాన గుహలలో పూర్వపూర్వతర కాలమునకు చెందినదని చెప్పవచ్చును. నాసికు నందలి శ్రీయజ్ఞ గుహతో దీనిని పోల్చుట వలన ఇది క్రీ. శ. నాల్గవ శతాబ్ది నిర్మాణముగా భావింపబడుచున్నది. ఈ గుహయందలి హాలు (చావడి) మధ్యమమున నాలుగు స్తంభములున్నవి. 7 వ సంఖ్య గుహలో ఈ స్తంభములు ఒక దాని సరసన మరొకటిగా రెండు వరుసలలో నున్నవి. 8 వసంఖ్య గుహలో మధ్య స్తంభములు చతు స్సంఖ్యలో నున్నను అన్ని వైపుల చుట్టువారుగ మరొక వరుస స్తంభములు కలవు. అజంతా యందు రెండు అంతస్తుల గుహానిర్మాణమునకు 6వ గుహయే ప్రథమోదాహరణము ఈరీతి స్తంభ కల్పన సంతృప్తినీయజాలకపోయెననుట తెల్లము. చావడి చతుర ప్రాకారముతో వలయాకార స్తంభములకు పొత్తు కుదురు కున్నది. మరొక లోపమేమన, రెండువరుసల స్తంభము లుండుటచేత చావడి క్రిక్కిరిసినట్లగుచున్నది. దీని పర్యవ సానమే చావడిచుట్టును సుసంగతములై, సమైక్యమైన ఆకృతిగల స్తంభయుగళ నిర్మాణము (colonnade). ఇట్టి రచన 1, 2, 18, 17 సంఖ్యల గుహలలోను, 6వ గుహ పై యంతస్తులోను కాన్పించును. సమతా లక్షణముగల స్తంభయుగళ నిర్మాణమును, సుసమృద్ధమైన అలంకరణ