Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జంతా చిత్ర సంపదయు ఈ గుహల కొక యద్భుత సౌందర్యము నాపాదించుచున్నవి. ఈ సౌందర్యము కొన్ని గుహలలో విస్తారమైన వర్ణచిత్ర కల్పనముచే ద్విగుణీకృతమైనది. శేషించిన అజంతా విహారములలో 16, 17, 1, 2 సంఖ్యల గుహలు మిక్కిలి ప్రాముఖ్యము వహించినవి. మొదటి రెండును రెండును క్రీ.శ. 5వ శతాబ్ది చరమపాద నిర్మాణములని నిశ్చయించుటకు వీలగు శాసనలేఖనములు కలిగియున్నవి. 16 వ గుహలో 65 అడుగుల చదరము చావడియున్నది. చుట్టును 20 స్తంభయుగళము లేర్ప రుప బడినవి. దీని వెనుక భాగమున ప్రలంబ పాదాసనమున చెక్కబడిన బుద్ధుని విగ్రహముగల పూజామందిరమున్నది. ముందరి భాగమున ఐదు స్తంభములపై మోపిన కప్పుగల వసారా కలదు. వసారాకును చావడికిని రెండు ప్రక్కల 14 అరల వరుస యున్నది. మరి రెండు అరలు పూజా మందిరము రెండు ప్రక్కలను చావడి లోపలి భాగమున కానవచ్చును. చావడియందు 20 స్తంభములు కలవు. 17వ సంఖ్య గుహ :- ఇది పై గుహతో సమానమైన యాకృతి రచన కలిగియున్నది. దాని స్తంభములు కూడ పై గుహా స్తంభముల వలె అలంకార సంపద వహించి యున్నవి. అవి శిఖర ప్రదేశము నందును అడుగుభాగము నందును చతురస్రముగా నున్నవి. వీనికి మధ్యభాగమున మాత్రము అంచుకట్టుపని కలదు. వసారాయందలి స్తంభ ములకు క్రింద చెక్కుడు దిమ్మలును, పైన చెక్కడపు తన్నులును గలవు. విగ్రహమున్న మందిరపు ద్వారముపై సవి స్తరమైన శిల్పము కలదు. దీనిపై లతాగుల్మాకృతులు, బుద్ధవిగ్రహములు, ద్వారపాలికలు, రింగులు రింగులు, పెనవేయబడిన మోకు నమోనాలు, గోడలో రాసిన చదరపు స్తంభములు, కమల పత్రములు మున్నగునవి చెక్కబడియున్నవి. మూలలందలి ఉబ్బు ప్రదేశములలో మకరములపై నిలిచియున్నట్లు చెక్కబడిన నారీ విగ్రహ ములు నేత్రానందకరముగ నున్నవి. పూర్వమందిరము నందలి స్తంభములు, చతుష్కోణ స్తంభములు ప్రశస్తా అంకరణమునకు నెలవులై యున్నవి. 1 వ సంఖ్య గుహ :- స్తంభముల యింపు సోంపుల లోను, తదితర వాస్తు అంగ ప్రత్యంగముల కళా ప్రభా నము నందును, 16, 17 సంఖ్యల గుహలు, 1 వ గుహ 96 కన్న మిన్నగా ఉన్నను మొత్తముమీద పరికించినచో ఆకృతి రమ్యతయందు ఈ గుహ వాటిని అధఃకరించు చున్నది. ఈ నాల్గు విహారములలోను ఇదియే విశాల తమమైనది. దీనిలో ద్వారమంటపము, వసారా, నాల్గు వైపుల సన్న త్రోవలుగల చావడి, పూర్వ మందిరము (Ante-chamber), బుద్ధభగవానుని అంబర చుంబియైన విగ్రహము చెక్కబడియున్నవి. విహారము యొక్క అంత ర్యాగమునందు 14 అర లున్నని. వసారాకు రెండు ప్రక్కలను మరిరెండు చిన్న గదులు గలవు. వసారా 64 అడుగుల నిడివియు, 9 అడుగుల వెడల్పును, 12 అడు గుల 6 అంగుళముల ఎత్తును కలిగియున్నది. దీని మధ్యలో ఒక పెద్ద ద్వార మున్నది. ద్వారబంధము, స్తంభోపరి భాగములు మిక్కిలి సుందరముగ చెక్క బడినవి. ద్వారము 64 అడుగుల చదరమైన పెద్ద చావడిలోనికి తెరచు కొనును. దీని కప్పు భారమును 20 స్తంభయుగళములు మోయుచున్నవి. చుట్టును 9 అడుగుల 8 అంగుళముల వెడల్పు వసారా యున్నది. చావడి వెనుక భాగమున ఉన్న పూర్వమందిరము 10×9 అడుగుల కొలతలతో నున్నది. దీనినుండి పూజామందిరమునకు పోవు ద్వారము కలదు. ఇది యద్భుత శిల్పములతో కూడియున్నది పూజామందిరము దాదాపు 20 అడుగుల చదరముగా తీర్చబడినది. ఈ గుహాంతర్భాగము నందలి స్తంభములు ఆకృతీ యందలి వై విధ్యముతోను, అలంకార శిల్పము నంద చమత్కృతితోను, వాటిని శిల్పించిన విశ్వకర్మల బుధ్ధి వైశద్యమును నిరూపించుచున్నవి. ఈ గుణములతోపాట గుహావి స్తీర్ణతవలన నిరవధిక భావము కలిసి భార దేశము నందలి సుందరతమమగు గుహావిహారములలో నొక్కటిగా ఇది పరిగణింపబడుచున్నది. ద్వార మం పము విధ్వంస మొనర్పబడుటచే ఈ గుహావిహారమ యొక్క వెలుపలి భాగము కొంత సొంపు చెడియున్నడి బుద్ధభగవానుని జీవిత సన్ని వేశములును, గజయుద్ధములు వేట చిత్రములు ఇక్కడ అద్భుత కౌశల్యముతో చెక బడి యున్నవి. ఇవి శిల్పము యొక్క అగ్రశిఖరము నంద కొన్నవి. గుహయొక్క వీథి వదరు అలం కార శిల్పమ నందు నిస్తులమై అత్యంత సుందరమై విపులమై యున్నర