Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న్నది. ఛత్రదండములను నిలుపుటకు పై భాగమున కల్పిం వబడిన గుంటలు దీనికి నిదర్శనములు. ఈ గుహయందలి స్తంభములు సాధారణాలం కారము మాత్రము కలవియై అష్టకోణాకృతి కలిగి, క్రింది దిమ్మకాని, మీది దిమ్మకాని లేకుండనున్నవి. విశ్రాంతి మందిర భాగముల పైకప్పు చదునుగా నుండి రెండు చిన్న కిటికీల గుండ వెలుతురు లోనికి ప్రసరించుచున్నది. ఈ కాలపు చైత్యముల ప్రధానలక్షణ మేమన, అవి చారు నిర్మాణములను అంధప్రాయముగ ననుకరించు చున్నవి. వాటి పూర్ణాకృతులును ముఖ్య వివరములును గూడ దారు నిర్మాణముల యనుకృతులే. నాటి శిలా శిల్పులు వీటిలో కట్టె దూలములను, వాసములను గూడ నిష్ప్రయోజనముగనే చొప్పించుటకు సిద్ధపడిరి. అర్వాచీన చైత్య సభలు :- అనంతర కాలమున వెల సిన మహాయాన చైత్య సభలు మూడింటిలో ఒక్కటైన 29 వ సంఖ్య గుహ అసంపూర్తి నిర్మాణము. మిగిలిన రెండును అనగా 19, 28 సంఖ్యల గుహలు ప్రాచీన చైత్యముల యొరవడినే ఆకృతిగా గలిగియున్నవి. అత్యంత ముఖ్యమైన భేద మేమన, వీటిమీది యలంకర ణము నువిపులమై, అణువణువునకు శ్రద్ధతో చేయబడి యున్నది. ద గోబామీదనే గూళ్ళలో బుద్ధ విగ్రహములు చెక్కుట జరిగినది. బుద్ధుడు సింహాసనముపై కూర్చున్న యట్లును, నిలుచున్నట్లును, వివిధరీతులలో బుద్ధ విగ్రహ ములు లాజుల పై భాగపు కుడ్యముల మీదను, విశ్రాంతి మందిరపు వెనుక గోడలమీదను చెక్కబడియున్నవి. బుద్ధా కృతులు కుప్పలు తిప్పలుగా వీథి నదరున (Fracade) మలచబడియున్నవి. వాస్తవమునకు గుహాంతర్బహిర్భా గము అన్నియు సమానముగ శిల్ప బాహుళ్యముచే కృతములై యున్నవి. ప్రాచీన చైత్యములందలి ప్రశాంత గంభీర వాతావరణము తొలిగి దానిస్థానే ప్రభూతాద్భుత శిల్ప సంపద చెలువారుచున్నది. అర్వాచీన చైత్యము లలో నడికప్పునకును, చైత్యవారాయనముల గళ్ళ పని కిని గూడ కట్టెవాసములను వాడు ఆచారము త్యజింప బడెను. సభాభవనమునందలి స్తంభములు నిట్టనిలువుగా తొలువనై నది. పిరమిడు ఆకృతిలోని పిట్టగోడ వీటియందు కాన్పించదు. _స్తంథములు వర్తులములై చక్రాకృతిలో అలం 94 నున్న వలయపు గుంటలుగల్గి, లతాలంక రణములు. ఆభర ణాకృతులు వీటిపై చెక్కబడి యున్నవి. 19 వ సంఖ్య గుహ బౌద్ధుల గుహా నిర్మాణ వాస్తువు నకు సమగ్ర ప్రతినిధియైన మచ్చుతునకగా పరిగణింపబడు చున్నది. గుహాంతర్భాగము నందలి స్తంభము లన్నిటికిని స్తంభపు పైదిమ్మె మీద మధ్యభాగమున ఆసీన బుద్ధుని విగ్రహములు చెక్కబడియున్నవి. దూలముల తన్నులు (Brackets) ముందుకు చొచ్చుకొని వచ్చిన ట్లుండును. ఇవి మావటీలతోగూడిన ఏనుగులు, శార్దూలములు, ఎగురుచున్న మిధునములు, సన్న్యాసులు, గాయకులు మున్నగు రూపములలో చెక్కబడినవి. అగ్రభాగమునం దున్న రెండు స్తంభములపైని తన్నులు సాలభంజికల రూపమున నున్నవి. లాజులమీది కుడ్యముపైన బుద్ధ విగ్రహములు ఆసీన స్థితిలోను తిష్ఠదాకారములోను, గదులు గదులుగ చెక్కబడినవి. వీటికి నడుమ నడుమ జంతు మనుష్య విగ్రహములలో అల్లుకొనిన జిలు గుపని కూర్పబడినది. ఈ గుహ వీథినదరు అత్యద్భుతమైన చిత్రములతో నలంకరింపబడి యున్నది. ద్వారమంటపము చిన్నదయ్యు, అందలి స్తంభములు లలితలలితము లై యున్నవి. ముంజూరుపైన చైత్య వాతాయనము గంభీరముగా కాననగును. దీని కిరుప్రక్కలను స్థూలాకృతి యక్షవిగ్రహ ములు చెక్కబడియున్నవి. వీటికి తిరోభాగమున సున్నిత మైన స్తంభపు అంచుకట్టు పనితనము గలదు. ఈ భాగ మంతయు చిత్రభావన యందును, పనితనమునందును, శిఖరముల నందుకొన్నది. చిత్రవివరణములయందు నిస్తుల సంపదయు, చిత్రముల పరిమాణములయందు లాలిత్య మును ముఖ్యముగ గమనింపదగినవి. 26 వ సంఖ్యగల గుహకూడ మహాయాన చైత్య సభా మంటపమే. అయినను అది 19 వ గుహకన్న పెద్దది. కాని గుహానిర్మాణము నందును, అలంకరణము నందును ఇది 19 వ గుహకు తీసికట్టు అని చెప్పవచ్చును. ఇచ్చటి చిత్రాలంకరణము కడుశ్రద్ధను చూపెట్టుచున్నను, చిత్రకారుడు అతిగాపోయి చిత్రకారుడు అతిగాపోయి శిల్పించినాడను భావము తోచును. చిత్రపరిమాణములలో సమత్వలా లిత్యములు కొరవడి లయ సమన్వయము చెడినట్లనిపించును.