Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజంతా గోడపై శాసనమొకటి చెక్క బడియున్నది. అందు సుగతా లయము (బుద్ధాలయము) ను బుద్ధభద్రు డను నొకభితువు ధర్మముచేసినట్లు వ్రాయబడినది. ఇతడు భవ్వి రాజునకు స్నేహితుడు. భవ్వి రాజు అశ్మకుడను రాజునకు మంత్రి. ఇతడు 17వ గుహాలయమును కట్టించి యిచ్చినవాడుగాని, అతని ఉత్తరాధికారిగాని యైయుండవచ్చును. లేఖన శాస్త్రానుసారముగ, ఈ శాసనము క్రీ. శ. 450-525 సం॥రముల మధ్యకాలమునకు చెందినదిగా నిర్ణయింపబడి నది. కావున క్రీ. శ. 6 వ శతాబ్ది ప్రథమార్ధ భాగమునందు శిల్పవిద్యా విషయకమును, కళాత్మక మునగు క్రియా సంరంభము ప్రవర్తిల్లినట్లును ఏడవ శతాబ్దిలో ఎట్టిప్రయ త్నములేనట్లును తలంచుట కవకాశము గలదు. అయినను, 26 వ గుహోకోణమునకు ఎడకువైపునగల సమతలము నకు సంబంధించిన కుడిగోడపై వ్రాయబడిన ఒకానొక రాష్ట్రకూట శాసన ఖండము ఈ గుహాలయములు క్రీ. శ. 8, 9 శతాబ్దులలో ఉపయోగమున నుండెనని రుజువు చేయుచున్నది. 2. వాస్తువు తెలిసికొని అజంతా యందలి ముప్పది గుహ లలో రెండు గుహలు (9, 10 సంఖ్య గలవి) హీనయాన బౌద్ధమత శాఖకు చెందిన చైత్యాలయములని యున్నాము. ఇవి క్రీస్తు పూర్వయుగమునకు చెందినవి. మరి మూడు గుహలు ( 19, 28, 29 సంఖ్య గలవి. ( మహాయాన బౌద్ధ శాఖకు చెందిన చైత్యాలయములు. ఇవి హీనయాన చైత్యముల కన్న చాల అర్వాచీనములు. క్రీ.శ. 5, 6 శతాబ్దుల కివి చెందియుండవచ్చును. మిగిలి నవి గుహా విహారములు. ఇక్కడకూడ రెండు స్థూల విభా గములను మనము గుర్తింపవచ్చును. నాలుగు గుహలు ( 8, 12, 18, 80 సంఖ్య గలవి) క్రీస్తు పూర్వపు హీన 8,12,18,80 యాన బౌద్ధశాఖకు సంబంధించినవి. మిగిలినవి అర్వాచీన కాలమున విలసిల్లిన మహాయాన బౌద్ధశాఖకు సంబంధించి యున్నవి. ఈ విహారములు పైన పేర్కొన్న మహాయాన చైత్యములతో సమకాలికములై యుండియుండును. చైత్యాలయము లన్నిటికిని సామాన్యమగు ముఖ్య లక్షణములు కొన్ని కలవు. వీటి పై కప్పు గుమ్మటము లేక కమానురూపములో నుండును. చైత్యము వెలువలి 93 ముఖ భాగము (facade) నందు ద్వారముపైన గుఱ్ఱపు డెక్క ఆకారములో నున్న ఒక పెద్ద వారాయనము కొట్టవచ్చిన ట్లుండుట మరియొక విశేష లక్షణము, చైత్యాంతర్భాగము స్తూపాకృతి స్తంభములతో వేరు చేయబడి, గర్భగుడి (నడిబొడ్డు), విశ్రాంతి మండపము (apse)చుట్టివచ్చు వసారాలు కలిగియుండును. వసారాయే విశ్రాంతిమండపము వెనుక భాగమునుగూడ చుట్టియుండి, ప్రదక్షిణ పథముగా ఉపయోగపడును. విశ్రాంతిప్రదేశపు నట్టనడుమ పూజాస్థానముండును. అది చైత్యాకారమును గాని, లఘు స్తూపాకారమును గాని, దగోడా (ధాతు గర్భము) ఆకారమునుగాని కలిగియుండును. ఇవియు పర్వతగర్భమున తొలువబడినవి యే. మొదటి దశ చైత్యములు :- క్రీస్తు పూర్వము వెలసిన వియు, హీనయాన బౌద్ధుల నిర్మాణములును అయిన ప్రాచీన చైత్యములలో బుద్ధవిగ్రహములు కాన్పించవు. బుద్ధభగవానుని భౌతికరూపమును యథాతథముగ ప్రద ర్శించుట వారి సంప్రదాయమునకు విరుద్ధము. దీనిని వారు పట్టుదలతో పాటించిరి. శతాబ్దములు గడచి మహా యాన బౌద్ధము మహోన్నత స్థితికి వచ్చినప్పుడు ఈ లోపమును పూరించుటకై ప్రయత్నములు సాగెను. 9వ సంఖ్యగల గుహా బహిర్భాగమునందు బుద్దుని సమున్నత విగ్రహములు ముందున్న చెక్కడములపై తిరిగి చెక్క బడెను. అయినను పూర్వచైత్యాలయములందలి వాస్తువు నిరాడంబరమై, అర్వాచీన చైత్యముల వాస్తు నిర్మాణ ముతో అత్యంతము భిన్నించుచున్నది. 9వ సంఖ్య గుహః- ఈ గుహ యొక్క వాస్తు లక్షణ ములను సంగ్రహముగ వీక్షించినచో పై అంశము విళద మగును. ఈ గుహ చతురస్రాకారములో నున్నది. దాని వెనుక కొనను దగోడాయు, దాని చుట్టివచ్చుచు, వర్తుల స్తంభపరంపరయు గలవు. ఇది విశ్రాంతి మందిరస్థానము. దగోబా మీది యండము అర్ధవర్తులముగా నుండి, విషమ వృత్తాకారమైన దిమ్మపై నిలచినది. ఈ దిమ్మ ఎత్తుగా నుండి నిరలంకృతముగా నున్నది. దాని చుట్టును కంచె కట్టు ఉన్నది. మీదికి పోయిన కొలదియు ఇది తలక్రిండైన పిరమిడు రూపములో నున్నది. శిఖర భాగమునందు రెండు దారునిర్మిత ఛత్రములుండిన ట్లూహించదగియు