Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కూర్చుటకు బదులుగా ఇందు లోహపు పట్టెలమీద గాని, లోష్టకముల మీదగాని అక్షర పంక్తులు అమర్చబడును. ఈ పట్టెలు పేజీగా అమర్చినపుడు విడిముద్రాక్షరములతో కూర్చిన పేజీవలెనే కనపడును. ఇవి నేరుగా అచ్చువేయు టకుగాని, మామూలు పద్ధతిలో విడదీయుటకు వీలు లేకుండ కూర్చి గట్టిచేసి వేయబడిన ముద్రాక్షరములు గల దిమ్మలను లేక విద్యున్ముద్రాక్షరముల దిమ్మెలను తయారుచేయుటకుగాని ఉపయోగించును. ఈ యంత్రము మనకు కావలసిన వివిధ రీతులుగల అచ్చు అక్షరములను తయారుచేయును. ముద్రాక్షరశాలలలో చేతికూర్పుమీద అయిదుగురు లేక ఆరుగురు వ్యక్తులు చేయగల పనిని ఒక్క వ్యక్తియే ఈ యంత్రసాహాయ్యమున చేయగల్గును. , 1886 వ సంవత్సరములో బాల్టిమోర్ వాస్తవ్యు డగు ఆట్మర్ మెర్జెన్ థాలర్ అను నాతడు పంక్తి ముద్రణమును కనిపెట్టెను. అతడు పుట్టుకచే జర్మనీ దేశస్థుడు. ప్రప్రథమమున 1886 వ సంవత్సరమున న్యూయార్కు ' ట్రిబ్యూను ' అను పత్రికను ప్రచురించుట యందు ఇది ఉపయోగపడెను. అది మొదలు వార్తా పత్రి కల కార్యాలయముల యందును, ప్రపంచమందలి ముద్ర ణాలయముల యందును సాధారణముగా ఈ రకపు యంత్రములు ఉపయోగింపబడుచు వచ్చెను. ఈ యంత్రమున వందలకొలది ఇత్తడి అచ్చుముక్కలు (Matrices) కలవు. ప్రతిఅచ్చుముక్కలోను ఒక చదునైన రేకుపై ఒక్కొక్క సంజ్ఞ చెక్కబడియుండును. ఆ అచ్చు ముక్కల యొక్క పై భాగమున పండ్లు (Teeth) కలవు. యంత్ర - ఆధారఫలకములో అచ్చు ముక్కలు వాటి యొక్క స్థానములకు చేరుటకు ఆ పండ్లు ఉపయోగ పడును. అచ్చుముక్కలు రెండురకముల సంజ్ఞలతో తయారగును. ఉదా :- రోమను అక్షరములు, ఏటవాలు (Italics) అక్షరములు. వీటిలో మనకు కావలసిన రకపు అక్షరము లను ఉపయోగించుకొనవచ్చును. యంత్రములో ప్రతి యక్షరమునకును పెక్కు అచ్చుముక్కలుండును. ప్రత్యేక సంజ్ఞల కొరకును, మాటమాటకు నడుమ ఎడము ఏర్పర చుట (space) కొరకును కూడ అచ్చుముక్కలుండును. 87 అచ్చుయంత్రములు - ముద్రణకళ ఇందులో యంత్రము యొక్క సామాన్య నిర్మాణము సంగ్రహముగా వివరింపబడినది. 'ఎ' అనునది ఏట వాలుగా నున్న ఒక స్థిరమైన యంత్ర ఆధారఫలకము అయి యున్నది. దానిలో కాలువ లుండును. ఆ కాలువలలో క్రమపద్ధతిలో అచ్చు ముక్కలు చేర్చబడియుండును. ఆ కాలువలలోని అచ్చుముక్కలు ఒక్కొక్కటి చొప్పున పై కొననుండి జారుచు ప్రవేశించి, క్రింది కొన గుండా బయటికి వచ్చుచుండును. యంత్ర - ఆధార ఫలకములో నున్న ప్రతి కాలువకును క్రిందికొన వద్ద 'బి' అను నిష మణ ద్వారముండును. అది 'సి' అను కడ్డీ మూలమున 'డి' అను వ్రేలిమీటకు కలుపబడియుండును. ఆ వ్రేలిమీట, కాలువలలో నున్న అచ్చుముక్కల అక్షరములను గాని, సంజ్ఞులను గాని తెలియజేయుచుండును. ప్రతి సంజ్ఞకును ఒక మీట యుండును. అక్షరముల నడుమ ఎడము కొరకు ఉంచుకణికలకును, మధ్యమధ్య స్థలములను కల్పించుటకై దిగగొట్టబడిన ముక్కలకును మీట లుండును. కావలసిన అచ్చుముక్కలును, ఖాళీస్థలములను ఏర్ప రచు వస్తువులును, వివిధములగు మీటలను ఉపయోగించు టచే 'జి' అను అచ్చు చట్రములోనికి వచ్చి చేరును. ఈ విధముగ అచ్చులో ఒక పంక్తిలో నుండవలసిన సంజ్ఞల న్నియు దానిలో చేరిన తరువాత, కూర్పబడిన ఆ పంక్తి, రెండవ బొమ్మలో చుక్కలతో చూపిన దారి గుండా, యంత్ర సహాయముచే తీసికొనిపోబడి, 'కే' అను చక్రము గుండా దాని ముందు వైపునుండి వెనుక వైపునకు వ్యాపించియున్న మూసకట్టు లేక నిడుపైన కన్నమునకు ముందు ఒక స్థానమున నిల్చును. మాటకును మాటకును మధ్య ఎడములను సర్దుటకై చీలలు మూసకట్టునకు ఎదు రుగానున్న ముద్రణ పంక్తిలో చేర్పబడును. అవి ఆ ముద్రణ పంక్తిని సరియైన ప్రమాణమునకు తెచ్చును. మూసకట్టునకు (mould) వెనుక భాగమున 'ఎమ్ *అను కరుగు పాత్ర యొకటి కలదు. అది వాయువుచే గాని, గాసొలీనుచే గాని, విద్యుత్ శాపక ముచే గాని, వేడిచేయ బడును. (రెండవ బొమ్మలో చూపబడినట్లు) పోతబోయ వలసిన అచ్చుముక్కల పంక్తి, మూసకు ముందుభాగ ముననున్న పిదప కరగిన లోహద్రవము కరుగుపొత్ర