అచ్చుయంత్రముల నిర్మాతలు
అల్లికవలెనుండు ముద్రణయంత్రములను (వీటిపై కాగితముయొక్క రెండువైపులను ఒకేసారి అచ్చు వేయుటకు వీలగునట్లు) నిర్మించెను. అచ్చుపడిన కాగితములను మడత పెట్టుటకు ముక్కోణాకారపు సాధనమును కల్పనచేసెను.
3. గూటెన్ బెర్గు జొహాన్నిస్, లేక, హెన్ని:- జొహాన్నిస్ గూటెన్ బెర్గ్ అనువాడు కదలించుటకు వీలైన ముద్రాక్షరములతో ముద్రణ విధానమును కల్పించిన జర్మను కల్పకుడు. ఇతడు క్రీ. శ. 1400 సంవత్సర ప్రాంతమున మెయింజ్ అనుచోట జన్మించి, క్రీ. శ. 1468 వ సంవత్సరమున ఫిబ్రవరి నెల 23 వ తేదిని అచటనే చనిపోయెను. అతని బాల్యదశనుగూర్చి మనకేమియు తెలియదు. 1434 వ సంవత్సరమున అతడు స్ట్రాస్ బర్గులో నివసించుచుండెను. రహస్యమైనవియును, అద్భుత మైనవియు నగు తనకళలనన్నిటిని వారికి బోధించునట్లును, వాటిని వారి ఉమ్మడి ప్రయోజనము కొరకు వినియోగించునట్లును 1436 వ సంవత్సరమున అతడు ఆండ్రియాడై జెల్మ్ మున్నగు వారితో ఒడంబడిక చేసికొనెను. 1438 వ సంవత్సరాంతమున డ్రైజెల్మ్ చనిపోవుటచే ఆ కంపెనీ ఒడంబడికకు భగ్నముకలిగెను. తరువాత 1448 వ సంవత్సర ప్రాంతమున అతడు మెయింజ్ కు తిరిగివచ్చి, వెంటనే ధనికస్వర్ణ కారుడగు జోహాన్ పాస్టుతో భాగస్వామిగా చేరెను. పొస్టు ఒక ముద్రణాలయమును స్థాపించుటకు వలయు ధనము సమకూర్చెను. ఆముద్రణాలయమునందు లాటిన్ భాషలో నున్న బైబిలు గ్రంథము మొదట అచ్చువేయబడెను. 1450 వ సంవత్సరమున ముద్రణము ప్రారంభింపబడి 1455 వ సంవత్సరమున పూర్తిచేయబడిన 'మజారి౯ బైబిలు' అను గ్రంథము చలనాత్మక ముద్రాక్షరములతో ముద్రింపబడిన ప్రథమగ్రంథముగా తెలియుచున్నది. కొన్ని యేండ్ల తరువాత ఈసంబంధము విడిపోయినది. పొస్టు ముందుగా పెద్దమొత్తములను పెట్టుబడి పెట్టెను. వాటిని తీర్చవలసినదని ఆతడు గూటెన్ బెర్గును నిర్బంధించెను. గూటెన్ బెర్గు వాటిని తీర్చుటకు శక్తి లేకయో. ఇష్టము లేకయో ఊరకుండుటచే, ఈ విషయము న్యాయస్థానమునకు తీసికొని పోబడెను. దాని ఫలితముగా ముద్రణాలయము ఫాస్టునకు అధీనమయ్యెను. అతడు దానిని అభివృద్ధిచేసి, జెర౯షీమ్ వాస్తవ్యుడగు పీటర్ షోఫర్ అనునాతనితో చేరి ఉపయోగించుచుండెను.
మెయింజ్ వాస్తవ్యుడగు కోనార్డుహమ్మర్ అను నొక వకీలు పోషకత్వముచే ఆమరుసటి సంవత్సరము గూటెన్ బెర్గు మరలనొక ముద్రణాలయమును స్థాపింపగలిగెను. ఆముద్రణాలయమునుండి 1460 వ సంవత్సరములో ఒక చక్కని "కాథొలికన్"', 1454, 55 వ సంవత్సరములలో "లెటర్సు ఆఫ్ ఇండల్జెన్స్"అను గ్రంథములు వెలువడినవి. ఆతని ముద్రణాలయమునుండి వెలువడిన ఏగ్రంథము పైనను గూటెన్ బెర్గు యొక్క పేరు కనిపించదు. అతని స్నేహితులు గాని, పోషకులుగాని ముద్రణ విషయమగు కల్పనల సందర్భమున గూబెన్ బెర్గు నామము పేర్కొనరు.
గ. శి. శా.
అచ్చు యంత్రములు - ముద్రణకళ : (1) ముద్రాక్షరములనుగాని ముద్రాక్షరములు అచ్చుముక్కలనుగాని కూర్చి వాటిని ముద్రణము కొరకు పంక్తులలోను వరుసలలోను (columns) ఏర్పరచు అన్ని తరగతుల యంత్రములను సాధారణముగా అచ్చుకూర్పు యంత్రములు అని వర్గీకరింపవచ్చును. ఈ యంత్రములలో ' పంక్తి ముద్రణము · (Linotype), ' ఏక ముద్రణము' (Monotype) అనునవి ప్రధానమయినవి.
చారిత్రకముగా చూచినచో కానెక్టికట్ వాస్తవ్యుడగు విలియం చర్చ్ అను నాతడు కనిపెట్టిన ముద్రాక్షర యంత్రము మొట్టమొదటిది. ఇంగ్లాండులో 1822 వ సంవత్సరమున దాని కల్పనాధికారము పొందబడినది. అతడొక ' మీటల బల్ల' (Key Board) ను నియోగించి ముద్ర_అక్షరములను కాలువలలో (Channels) చేర్చి యుంచెను. 1848-1872 వ సంవత్సరము వరకును ఆమెరికా సంయుక్త రాష్ట్రములలో 57 అచ్చుకూర్పు యంత్రములకు కల్పన రక్షణాధికారములు (Patents) ఒసగబడెను. గ్రేటు బ్రిటనులో కూడ సుమారు ఆ సంఖ్యలోనే కల్పన రక్షణాధికారములు పొందబడినవి.
1. పంక్తి ముద్రణ యంత్రము :- అచ్చును కూర్చుట, పోత పోయుట అను రెండు పనులను చేయునట్లు ఇది కల్పింప బడినది. విడివిడిగా నున్న అక్షరములను పంక్తులనుగా