Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్ప్రపంచము దద్దరిల్లునట్లు అది ప్రేలినది. దీని ఫలితముగా సముద్రమట్టమునకు 1500 అడుగుల ఎత్తున ఉన్న శిఖ రము పూర్తిగా ఎగిరిపోయి, సముద్రమట్టమునకు దిగువ 1000 అడుగుల లోతుగల పెద్ద అగాధము ఏర్పడినది. దీనినుండి వెలువడిన ధూళి ఆకాశమును అంటునట్లు 17 మైళ్ళు ఎత్తువరకు ఎగిరినది. ఈ బూడిద వేలకు వేలు మైళ్ళు ప్రయాణము చేసి 11,000 మైళ్ళు దూరములో నున్న యూరపు ఖండవీధులలోకూడ పడినదట! ఈ దారుణ సంఘటనకు సముద్రములో 50 అడుగుల ఎత్తు నరకు కెరటములు లేచినవట ! సుమారు 40,000 మంది ప్రాణములు కోల్పోయిరి. ఇది ప్రేలినపుడు ఉద్భవించిన ధ్వని 3000 మైళ్ళ దూరమువరకు వినిపించినదట! కనుక అగ్నిపర్వత మనునది ప్రేలినట్లయిన అది కలుగ జేసెడు భీభత్సము వర్ణనాతీతము. అగ్ని పర్వతములు ప్రతిచోటను ఉండవు. ఇవి సాధార ణముగ భూకంపములు వచ్చెడు ప్రదేశములలోను, భూమ్యుపరిభాగపు పెచ్చు (Earth's Outer Crust) బల హీనముగా ఉండెడు ప్రదేశములలోను, మడత పర్వత ములు ఏర్పడుచోట్లను ఉండును. ఈ ఉష్ణోగ్రత, భూమి పై భాగమునందు గాలియందున్న ఉష్ణోగ్రతలతో పోల్చి నచో అధికముగ నుండును. అందుచేఉష్ణోగ్రత తన సహజ లక్షణము ననుసరించి పైకి వచ్చుటకు ప్రయత్నించు చుండును. చాలభాగము అగ్ని పర్వతములు ఫసిఫికు మహాసము ద్రము చుట్టును కొంచెము ఇంచుమించు వలయాకార ముననుండి పసిఫిక్ ప్రాంతమునందలి అగ్నిమయమండ లాకార రేఖ (Pacific girdle of fire) అని పిలువబడు చున్నవి. ముఖ్యమైన మరొక పర్వతపంక్తి భూమధ్య రేఖకు ఉత్తరముగాను సమాంతరముగాను, భూమిని చుట్టుకొనియున్నది. - డా. ఎన్. డా. అచ్చుయంత్రముల నిర్మాతలు: 1. మెర్జెన్ థాలరు : మెర్జెన్ థాలర్ ఆట్మన్ అను నాతడు ఒక అమె రిక౯ కల్పకుడు (inventor). అతడు 1854 వ సంవత్స రమున మే నెల 10 వ తేది యందు జర్మనీ దేశములో వర్టెంబర్లు అనుచోట జన్మించెను. బాల్టిమూర్ లో 1898 వ 85 అచ్చుయంత్రముల నిర్మాతలు సంవత్సరమున అక్టోబరు నెలలో 28 వ తేదియందు అతడు కాలధర్మమునొందెను. గడియారములు చేయుట అతని వృత్తి. అతడు పదు నెనిమిదవ యేట అమెరికా సంయుక్త రాష్ట్రములకు పోయెను. వాషింగ్టనులో సంయుక్త రాష్ట్ర ప్రభుత్వోద్యోగమున ప్రవేశించెను. అచటి ప్రభుత్వ భవనము లన్నింటియందు నున్న 'క్లిక్కు' లను, విద్యుద్ఘాంటలను సరిచేసెను. సాంకేతిక శాఖయందు వాడుచున్న సాధనములను అభివృద్ధిచేసెను. 1878 వ సంవత్సరమున అతడు బాల్టిమూర్ నకు వచ్చి, ముద్రా క్షరములను కూర్చు నొక యంత్రమును దోషరహితముగ చేయుటలో నిమగ్నుడయ్యెను. అతడు కొన్ని సంవత్స రము లీ విషయమున గడపెను. అతని కల్పన (scheme) కొన్ని దళలలో జరిగినది. వాటిలో 'వంక్తి ముద్రణము' (Linotype) అనునది కడపటిది. ఈ యంత్రవిషయమున ఆతడు నూతన కల్పనాధికారమును పొందిన తరువాత, దానిని వాడుక లోనికి దెచ్చుట అతనికి చాల కష్టమయ్యెను. ఎడముల నేర్పరచు 'రోజర్సుసాధనము' ను ఇంకను పెకు ఉపకల్పనలను చేర్చి ఫిలిఫ్ని డాడ్జి ప్రభృతులు దానికి సంపూర్ణత్వమునిచ్చిరి. అందుచే దానిని కల్పన చేసినవానికి విశేషమగు లాభము దొరకినది. అది ఇప్పుడు పెద్ద పెద్ద ముద్రణ సంస్థలలో సాధారణముగ విశేషమయిన ఉప యోగమును కాంచుచున్నది. ఫలములు సమర్పించుటకు ఉపయోగపడు బుట్టలను "వెనీర్డు" (veneered wood) చక్కతో తయారుచేయుటకై ఒక యంత్రమును కూడ మెర్జెథాలర్ కల్పన చేసెను. 2. రిచర్డుమార్చ్ హో :-- రిచర్డుమార్చ్ హో అమె రికా దేశస్థుడు. సామానులుచేయుట అతని వృత్తి. అతడు 1812 వ సంవత్సరమున సెప్టెంబరు నెల 12 వ తేదిని న్యూయార్కు నగరమున జన్మించెను. 1886 వ సంవ త్సరమున జూన్ నెల 7 వ తేదీని ఇటలీలో ఫ్లారెన్సు నగరమున చనిపోయెను. అతడు రాబర్టు హో (1784- 1888) అనునాతని కొడుకు, మరియొక రాబర్ట్ హో (1889-1909) అనునాతనికి పినతండ్రి. తండ్రి అనం తరము ఆర్. హో అండ్ కంపెనీ యొక్క నిర్వహణ మును వహించి, 1847 వ సంవత్సరమున “హో” పరిభ్రమణముద్రణయంత్రమును కల్పనచేసెను. అతడు