Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అగ్ని పర్వతములు (Sponge-like) ఉండును. వీటన్నిటికంటే ముఖ్యమైనది శిలాద్రవము; దీనినే భూమి అంతర్భాగములో నున్నపుడు 'మాగ్మా' (Magma) అనియు, భూమిపైన పడినపుడు 'లావా' (Lava) అనియు అందురు. లానా ఘనీభవించగా ఏర్పడిన శిలారూప లక్షణములు మాగ్మా ద్రవపుస మ్మేళ నము (composition), దాని ఉష్ణోగ్రత (Temperature), జిగటలనము (Viscosity) మొదలైన పరిస్థితుల పై ఆధారపడియుండును. కనుక ఇప్పుడు మాగ్మా పరిస్థితు లను గురించి కొంత తెలిసికొనుట అవసరము. భూమి పై భాగము నుండి లోతుగా వెళ్ళినకొలది ఉష్ణోగ్రత పెరుగుచునుండును. చాల మైళ్ళ దిగువ నుండెడు ఉష్ణోగ్రత భూమి పైన ఉండెడు రాళ్ళను కరిగించునంత ఎక్కువగా ఉండునని అంచనా వేయబడినది. ఈ ఉష్ణో గ్రతతోబాటు భూమి లోపల పీడనము (Pressure) ఎక్కువ అగుచుండును. కనుక భూగర్భములోనుండెడు అత్యధిక పీడనశక్తి రాళ్ళను కరగనియ్యదు. కొన్ని ప్రదేశ ములలో పీడనశ క్తి తక్కువగానుండి ఉష్ణోగ్రత ఎక్కువగా నుండవచ్చును. అట్టిపరిస్థితులలో అక్కడ ఘనస్థితిలో నుండెడు శిలాపదార్థము మాగ్మారూపము చెందును. మాగ్మాద్రవము 1200 సెం. డిగ్రీల ఉష్ణోగ్రతకలిగిఉండు నని అంచనా వేయబడినది. ఈ మాగ్మా ద్రవాళయములు భూగర్భములో విపరీతముగా నుండును. ఈ మాగ్మా అతి తీవ్రమైన శ క్తితో భూమిని భేదించుకొని బయటపడుట యే అగ్నిపర్వతోద్గారము (Volcanic eruption) అనబడును. కొన్ని మైళ్ళ పొడవున సొరంగ బీటికల ద్వారా మాగ్మా మెల్లగా భూమిపైకి ప్రవహించుచు వచ్చినచో దానిని రంధ్రోద్గారము (Fissure eruption) అందురు, అగ్ని పర్వతముల నన్నింటిని పరిశీలించినచో వాటి స్వభావ లక్షణములలో ఎక్కువతేడా కన్పించును. ఇవి తీవ్రజాతి (Violent), మాధ్యమిక జాతి (Intermediate), సాత్వికజాతి (Quiet) అని మూడు తెగలుగ విభజింప బడి నవి, బ్రహ్మాండ మైన శ క్తితో బ్రద్దలగువాటిని తీవ్రజాతి గాను, అతి నెమ్మదిగా బ్రద్దలగువాటిని సాత్విక జాతి గాను, ఈ రెండింటికి మధ్యగా నుండెడు వాటిని మాధ్య మిక జాతిగాను పేర్కొనుచున్నారు. తీవ్రజాతి పర్వత ములనుండి ముఖ్యముగా ఘన, వాయు పదార్థములే 84 ఎక్కువగా బహిర్గత మగును. సాత్వికజాతినుండి ముఖ్య ముగా ' లావా ' పదార్థము వెలువడును; మధ్యరకపు జాతినుండి ఘన, ద్రవ, వాయు పదార్థములు అన్నియు సమానముగ నే బహిర్గతమగును. ఆశా చైతన్యము కలిగిన ప్రతి అగ్నిపర్వతపు జీవిత ప్రమా ణము వేరువేరుగా నుండును. ఇటలీలో నున్న “ఎట్నా” (Etna) అనెడు అగ్నిపర్వతము ఇప్పుడు ఎంత తీవ్రముగా వేలుచున్నదో అంతటి శక్తితో గత 2500 సంవత్స రముల నుండియు ప్రేలుచు వచ్చినదట. బ్రహ్మాండ ముగా నున్న దీని పరిమాణము అతి సూక్ష్మముగా ఉండుచున్న పెరుగుదలతో సరిపోల్చిన ట్లైన దీనిని నిర్మించుటకు అధమపక్షము 8 లక్షల సంవత్సరము లైనను కావలసి యుండును. కాని భూగర్భశాస్త్రరీత్యా ఈ పర్వ తము అంత పురాతనమైనది కాదని, ఆ శాస్త్రయుగము లలో ఇటీవలదైన “ప్లిస్టోసిన్” (Pleistocene) మధ్య భాగమువరకు ఇది వ్రేలియుండలేదని తెలియుచున్నది. ఈ ఆధారమునుబట్టి ఈ పర్వతమింకను యౌవనదశలోనే ఉన్నదని నిర్ధారణ అయినది. అగ్నిపర్వతపు జీవిత కాలము వాతావరణమునకు, సంబంధించిన గాలి, నీరు, మొదలైనవి చేయు వినాశకరమైన క్రియలకు గురి యగును. ఒక నియమిత కాలములో అగ్నిపర్వతపు స్వరూ పము, ఎత్తు, దాని నిర్మాణమునకు తోడ్పడెడు శ క్తులకు (constructive forces) వినాశనమునకు దారితీయు శక్తు లకు (destructive forces) ఉండేడు తారతమ్యముపై ఆధారపడియుండును. వాతావరణ శక్తుల ప్రాబల్యము అధిక మైన కొలది అగ్ని పర్వతపు శ్రీణత అధికమగు " చుండును. " అతి భయంకరమైన సంఘటనలతో నిండిన జాతిలో క్రాకటోవా ” (Krakatoa) అను అగ్ని పర్వతము ముఖ్యముగా చెప్పదగినది. ఇది జావా, సుమత్రా దీవుల మధ్య 'సుండా' జలసంధిలో ఉన్నది. ఇది "వ్రేలినపుడు సంభవించిన ప్రమాదములు చరిత్రాత్మక మైనవి. సుమారు రెండువందల సంవత్సరములు ఈ పర్వతము మందకొడి గానే ఉండి దానిపై భాగము చెట్టుచేమలతో నిండిఉండెడి కాని అకస్మాత్తుగా ఒక రోజున (1888 ఆగస్టు 8 27 తారీఖున) భయంకరమైన శబ్దముతో యావ డిది.