Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్రవము ఘనీభవించుటచే జనించిన శంఖాకారపు రాతిగుట్ట గలిగియున్న పర్వతమనియు చెప్పవచ్చును. క్రేటరు అగ్ని పర్వతపు ముఖ్యాంగము. ఇది అగ్ని పర్వత శిఖరములనే కాకుండ ఒకటి రెండు ప్రక్కలయందుకూడ ఉండవచ్చును. ఆగ్నిపర్వతభేదములు:- ఇటలీలో నుండెడు " వెసూవి యస్" (Vesuvious) అనునది అగ్ని పర్వతము లన్నింటి లోనికి చాల ప్రఖ్యాతిచెందినది. దీని ఆకారము, లక్షణ ములు మొదలైనవి సిసలైన అగ్నిపర్వతమునకు ఉండ వలసినవిగా ఎంచబడినవి. కాని ప్రపంచములో నుండెడు అగ్నిపర్వతములను పరిశీలించినచో ఈ లక్షణములు అన్నిటి యందును కన్పించకపోవచ్చును. సరియైన అంచనాలు ఇంతవరకును వేయబడనప్పటికిని భూమిమీద ఉండెడు అగ్ని పర్వతముల సంఖ్య వేనవేలుండునని చెప్ప వచ్చును. వీటన్నిటిలోనికి సుమారు నాలుగయిదు వందలుమాత్రమే చైతన్యము కలిగి యున్నవి (Active Volcanoes). భూమిపై మానవజాతి ఉద్భవించిన పిదప ఏర్పడిన అగ్ని పర్వతములు చైతన్యము కలవిగాను, మిగతా వన్నియు చల్లారి జడమైనవిగాను (Extinct Volcanoes) విభజించుట పరిపాటి. కాని ఈ విభజనము అంతసమంజస మైనదికాదు. ఎందువల్లననగా ఒకే అగ్నిపర్వతము కొన్ని కాలముల పాటు చైతన్య రహితముగా కనబడుచు మందకొడిగానుండి తిరిగి చైతన్యము పొందవచ్చును. ఒకప్పుడు స్తబ్ధతతోకూడిన విరామకాలము, మరొకప్పుడు భీభత్స సంఘటనలతో నిండియుండవచ్చును. అగ్నిపర్వతములనుండి అనేక పదార్థములు వెలువడు టను ప్రేలుడు, లేక బ్రద్దలగుట (Eruption) అందురు. అగ్నిపర్వతము “ప్రేలుచున్నప్పుడు బయల్వెడలెడుశ క్తులు, వాటివలన సంభవించెడు దారుణ ఫలితములు మిగుల భయంకరమైనవి. పరిమాణములో అగ్ని పర్వతములు చాల మార్పుకలిగి తేనెపట్టంత చిన్న శంఖాకృతులు మొదలు బ్రహ్మాండమైన ఎత్తుకలిగినవికూడ ఉండును. ఇటువంటి అగ్నిపర్వతములు దక్షిణఅ మెరికాలోని ఆండీసు (Andes) పర్వతాలలో నున్నవి. అక్కడి పర్వత శిఖరాలు చాలవరకు అగ్నిపర్వతాలే ఉదాహరణకు : ఈక్విడారులోని "కోటోపాక్సీ” (cotopaxi) ప్రపంచము లోని అగ్ని పర్వతాలన్నిటిలోను చాల ఎత్తయినది. దీని 83 అగ్ని పర్వతములు ఎత్తు 19,600 అడుగులు; క్రేటరు వెడల్పు అర మైలు; లోతు 1500 అడుగులు. ఇంత విపరీత పరిమాణము కలిగినవి హవాయి దీవులలో కూడ ఉన్నవి. అక్కడ ఉండెడు పర్వతములు సముద్రమట్టమునకు 4 మొదలు 15 వేల అడుగుల దిగువనుండి పైన 14,000 ఎత్తు వరకు వ్యాపించి, మొత్తము సుమారు ముప్పది వేల అడుగులకు వ్యాపించియున్నవి. "లావా" :- భూగర్భమునుండి వెలువడెడు వాయు, ఘన పదార్థముల బహిర్గత క్రియకు సంబంధించిన శాస్త్ర విషయములనన్నిటిని అగ్ని పర్వతశాస్త్రమందురు (Volca- nology). ఈ మహోన్నత కార్యము భూనిర్మాణము నకు సంబంధించిన క్రియలలో నొకటిగా నొకటిగా (Earth's Building Activity) ఎంచబడినది. బహిర్గతమయ్యెడు పదార్థము ఒకప్పుడు పూర్తిగా శిలాద్రవమే కావచ్చును; అట్లు కానిపక్షములో పూర్తిగాగాని, అసంపూర్తిగాగాని ఘనీభవించిన రాళ్ళసముదాయముగనే యుండవచ్చును. ఇవికాక నీటిఆవిరి, అనేక వాయువులు వివిధపరిమాణము లలో వెలువడును. అందువల్లనే అగ్నిపర్వతము వ్రేలి నవుడు దట్టమైన మేఘములు ఆకాశమును ఆవరించును. అట్టి సమయమ 'లయందు భీభత్సపరిస్థితుల మూలమునను, వెలువడిన వాయువులు పై నున్న గాలిలో అత్యంత త్వరిత ముతో కలిసిపోవుట వలనను, వాటియొక్క సమ్మేళనము (composition) సరిగా తెలిసికొనుట సాధ్యముకాదు. కాని ఈ వాయువులు చాలవరకు నీటియావిరి అని చెప్పు టకు ఆధారములున్నవి. ఒక్కొక అగ్ని పర్వతమునుండి వంద రోజులలో సుమారు 46 కోట్ల గాల నుల నీరు వెలువడునని అంచనా వేసిరి. నీటి ఆవిరితోపాటు మరికొన్ని ఇతరపదార్థములు—ముఖ్యముగా కర్బనద్వి ఆమ్లజనిద ము (Carbon-Dioxide), ఉదజహరితామ్లము (Hydrochloric acid), గంధకమిశ్రమ ద్రవ్యములు (Sulphur com- pounds), ఉదజని (Hydrogen) మొద లైనవి వెలు వడును. ఇవికాక అగ్నిపర్వతమునుండి వెలువడు రాతి ముక్కల సముదాయమును పైరోక్లాస్టికు పదార్థము (Pyroclastic material) అందురు. ఈ వెదజిమ్మబడెడు శిలాఖండములు కొంతభాగము గట్టిగాను, మరికొంత భాగము అనేక సూక్ష్మరంధ్రములుకలిగి స్పాంజివ లెను'