Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అగ్గిపుల్లలు ' సేఫ్టీ ' అగ్గిపుల్లల కుపయోగించెడు మందులు పాళ్లు ఉదాహరణకై ఈ దిగువ నీయబడినవి. ( పాళ్ళు బరువు లలో సూచింపబడినవి. ) .

  • పుల్లల మందు ' :- పొటాసియ హరితము 86; ఎఱ్ఱ

మాంగనము 4 ; పొటాసియ ద్విక్రోమితము 1; యళద ఆమ్లజనిదము శ్రీ; పారిస్ గార (ప్లాస్టర్ అప్ అప్ పారిస్) 1; గంగ సింధూరము 1; Caput Mortuum 4; గాజు పొడి 8; చౌడు(infusional earth) }; గుగ్గిలము (Rosin) }; గంధకము 8 ; బంక 8 ; నీరు 35. 4 ' ప్రక్కలకు పూయు రాపిడిమందు ':- ఎఱ్ఱభాస్వరము 400 i ఆంటిమొని గంధకిదము 320 ; సుద్ద 52 i గాజుపొడి 48; బంక 18; తుమ్మబంక 188; బాదము బంక (gum tragacanth) 7; డెక్ట్ ను (Dextrine) 24, 58 750. ప్రైమ భారతదేశములో అగ్గిపుల్లలు చేయు మొదటి కర్మా గారము భారతీయుల యాజమాన్యమున 1895 లో అహమ్మదాబాదు నగరములో స్థాపింపబడెను. అయినప్ప టికీ, మొదటి ప్రపంచ సంగ్రామమునకు పూర్వము మన దేశములో అగ్గిపుల్లలు తయారుకాలేదని యేచెప్పవచ్చును. 1922 లో దిగుమతి సరకులపై పన్నులు విధించిన తరు వాతను, 1928 లో గక్షణ సుంకములను విధించిన తరువాతను, మనదేశపు అగ్గిపుల్లల పరిశ్రమ త్వరితముగా అభివృద్ధిచెందెను. 1928 నాటికి మనకు కావలసిన అగ్గి పుల్లలు చాలవరకు భారతీయ పరిశ్రమయే తయారుచేయ గలిగెను. దేశములో అమలులో నున్న రక్షణసుంకము లను చెల్లించుకొనలేక పాశ్చాత్య ఎగుమతిదారులు భారత దేశములో నే అగ్గిపుల్లల కర్మాగారములను నెలకొల్పుటకు నిశ్చయించిరి. ఈ విధముగ పశ్చిమఇండియా అగ్గిపెట్టెల పరిశ్రమ కంపెనీ (Western India Match Co., Ltd. Wimco) అను పేరుతో స్వీడను దేశపు సంస్థ యొకటి మన దేశములో బెరైలీ, అంబరనాధ్, కలకత్తా, మద్రాస్ పట్టణముల యందు కర్మాగారములను స్థాపించేను. ఈ విమ్కో సంస్థ మనదేశములో ప్రస్తుతము కావలసిన అగ్గి పుల్లలలో నూటికి ఎనుబదివంతులు సరఫరా చేయుచున్నది. అయినప్పటికీ, అనేకచోట్ల మనదేశములో భారతీయ కర్మాగారములు పనిచేయుచున్నవి. ప్రస్తుతము దేశ మంతటను 150 అగ్గిపుల్లల కర్మాగారము లున్నవి. వీటిలో మొత్తము 18,000 మంది కార్మికులు పనిచేయు చున్నారు. ఇవి కాక, అనేక పల్లెలలోను, పట్టణముల లోను, కుటీరపరిశ్రమల ద్వారా కొంతవరకు అగ్గిపుల్లలు తయారగుచున్నవి. . 1950-1951 నాటికి మొత్తము కర్మాగారములలో 858 లక్షల గ్రోసుల పెట్టెలు తయారుచేయు శక్తియున్న దని అంచనా వేయబడినది. కాని ఆ సంవత్సరములో 291 లక్షల గ్రోసులు మాత్రమే తయారుచేయబడినవి. అదే సంవత్సరములో కుటీరపరిశ్రమ ద్వారా ఆగులక్షల గ్రోసులు తయారయినట్లు అంచనా వేయబడెను. ప్రథమ పంచవర్ష ప్రణాళిక ప్రకారము 1955 - 56 నాటికి దేశములోని కర్మాగారములు 388 లక్షల గ్రోసులు తయారుచేయు శక్తి కల్గియుండవలెననియు, అధమము 358 లక్షల గ్రోసులు తయారుచేయవలెననియు నిశ్చ యింపబడినది. కుటీర పరిశ్రమలలో 1955-56 నాటికి 18 లక్షల గ్రోసులు తయారుకావలెనని ప్రణాళిక నిశ్చ యించెను. · భారతదేశపు కర్మాగారములలో వాస్తవ ముగా తనూరయిన అగ్గిపుల్లల పెట్టెలు- 208 లక్షల గ్రోసులు : 1950 లో గ్రోసులు; 1952 లో 804 లక్షల 1954 లో 270 లక్షల గ్రోసులు. $2 . - 1948లో 262 లక్షల గ్రోసులు ; ఎమ్. జి. కృష్ణ అగ్ని పర్వతములు: – అగ్ని పర్వతముల యొక్క ముఖ్యాంశములు :- ప్రకృతిలో అనేక నదులు, పర్వతములు, ఎడారులు ఉన్నట్టుగానే అగ్ని పర్వతములుకూడ పెక్కు చోట్లలో నున్నవి. సాధారణముగ అగ్ని పర్వతములు ఎక్కువ ఏటవాలు లేని శంఖాకారమును (cone-shaped) కలిగిఉండును. దీనిశిఖరమునుండి మధ్యగా భూగర్భము లోనికి గెరాటీనిపోలిన ఒక సొరంగమార్గముండును. దీనినే అగ్ని పర్వతపు కంఠ నాళ మందురు. దీనిపై భాగమున నుండు బిలము 'క్రేటరు' (crater) అనబడును. ఈక్రేటరు ద్వారా కొన్ని సమయములలో అనేక వాయువులు, రాళ్ళు, శిలాద్రవము (Lava), “లా వాగుండ్లు” (Volcanic bombs.) వెలువడుచుండును. కనుక అగ్ని తర్వత మనునది ఒక జ్వాలా ముఖద్వారమనియు, దానిచుట్టును శిలా