Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పుల్లలను తయారుచేయు విభాగములో, కఱ్ఱపుల్లలను ముందుగా వేడియైన 'మోనో అమ్మోనియం ' భాస్వ రితము ద్రావణములో నానబెట్టి ఎండబెట్టెదరు. ఇది పుల్లలను అంటించినతర్వాత మంట ఆరిపోయిన వెంటనే పూర్తిగా నిప్పు ఆరిపోవుటకై అవసరము. పూత పూసి యెండిన పుల్లలను ఒక యంత్రములో మెరుగు పెట్టి, మరి యొక యంత్రములో సమర్చబడిన పళ్లెములలో వరుసలుగా పేర్చెదరు. తరువాత ఈ పళ్లెములు అగ్గిపుల్ల లను తయారుచేయు స్వయంచాలక యంత్రముల వద్దకు తీసికొనిపోబడును. ఈ యంత్రములు సింప్లెక్సు, ఆటో మాట్, ఆదర్శ (‘Simplex’, “Automat’, ‘Ideal”) మొదలగు పేర్లతో పిలువబడుచున్నవి. ఇవి వేరు వేరు యంత్ర నిర్మాతలచే తయారు చేయబడినవి. ఈ యంత్ర ములు పనియంతయు స్వయముగానే మనుష్య సహా యము లేకుండా చేయగలవు. ఆగకుండా విద్యుచ్ఛక్తి సహాయముచే పనిచేయును. మొదట, పళ్లెములలో నున్న పుల్లలు, ఒక పట్టాపైనుండు సన్నని రంధ్రములలో నిలు వుగా వరుసలలో అమర్చబడును. ఈ పట్టా, వేడిచేయబడిన లోహపు పట్టీమీద కొంతదూరము ప్రయాణముచేయును. ఈ ప్రక్రియవలన, పట్టాపై అమర్చబడిన పుల్లలు వేడి యెక్కును. తరువాత ఈ పట్టా, 220° ఫా. ఉష్ణో గ్రత వద్ద నుంచబడిన మైనముపై పోవును. అప్పుడు పుల్లల కొనలకు శ్రీసెం॥ మీ॥ పొడుగున మైనపు పూత పూయబడును. అదనముగా అంటిన మైనమును కరగించి తీసి వేయుటకై పుల్లలను తిరిగి ఒక వేడిపట్టాపై వంపు దురు. తరువాత పుల్లలు చల్లార్చబడును. పిమ్మట పుల్ల "లతో నున్న పట్టాను, తిరుగుచున్న ఒక పొత్రముపై పంపెదరు. ఈ పొత్రము అగ్గిపుల్ల మందుంచిన ఒక తొట్టెలో తిరుగుచుండును. కావున పట్టా పొత్రముపై పోయినప్పుడు ప్రతి పుల్ల కొనకును కొంచెము మందు పట్టించ బడును. పుల్లల చివర మందును ఎండబెట్టి చల్లా ర్చెదరు. అంతట తయారైన పుల్లలను పెట్టెల సొరుగు లలో యంత్ర సహాయమున నింపెదరు. ఒక్కొక పెట్టెలో సుమారు 50 పుల్లల చొప్పున సమానముగా నింపబడును. సొరుగులను యంత్ర సహాయమున పెట్టెలలోనికి అతి కించెదరు. 11 81 అగ్గిపుల్లలు అగ్గి పెట్టెలను తయారుచేయుటకు కఱ్ఱనుండి తయారు చేసిన చదునైన ముక్కలను వాడెదరు. ఈ ముక్కలపై పెట్టెకు సరిపోవునట్లు కొంచెము లోతు కల్గిన గాడులు గీయబడును. ఈ గాడుల వెంబడి ముక్కలను వంచి కావలసినట్లు సొరుగులను, పెట్టెలను తయారుచేయుదురు. సొరుగుల పైనను. పెట్టెల పైనను రంగుకాగితము అంటించబడును. ఈ పనియంతయు యంత్రముల చేతనే చేయబడును. పుల్లలతో నింపిన పెట్టెలు రెండు గుండ్రని కుంచెల మధ్య ప్రయాణముచేయును. ఈ సమయములో పెట్టెల కిరువై పులను 'రాపిడి' మందు సమానమందముతో పూయబడును. తరువాత పెట్టెలను ఎండబెట్టి, రవాణా కొరకు వీలగునట్లు డజనుల చొప్పున, గ్రోసుల చొప్పున కట్టలుగా కట్టెదరు. కట్టలు కట్టుటగూడ యంత్ర సహా యముననే జరుగును. అగ్గిపుల్లలను కుటీరపరిశ్రమలలో తయారుచేయునపుడు పై వివరించిన పనులలో చాలవరకు యంత్రములచే గాక మనుష్యులచే చేయబడును. ఇట్టి పనులలో దుంగలను కోయుట, పళ్ళెములలో నింపుట, పుల్లలకు మందు పూయుట, పెట్టెలలో నింపి కట్టలు కట్టుట, సామగ్రులను ఒక చోటి నుండి మరియొకచోటికి కొంపోవుట మొదలగు నవి ముఖ్యమైనవి. ఇష్టమువచ్చినచోట గీయు రకపు అగ్గిపుల్లలను మంచి తెల్లని ' పైన్ ' కఱ్ఱనుండి తయారుచేయుదురు. వీటిలో మండెడు పదార్థములతోను, ఆమ్లజనీకరణ పదార్థముల తోను పుల్లల కొనలకు రెండు పూతలు ఒక దాని పై నొకటి పూయబడును. ఈ రకపు పుల్లలను మండించుటకు వేరే 'రాపిడి మందు' అనవసరము. ఏ గరుకు ప్రదేశము మీద నైనను గీచినచో ఈ పుల్లలు మండును. సామాన్యమైన వాడుకకును, ప్రత్యేకావసరములకును పనికివచ్చు అగ్గి పుల్లల రకములలో చిన్న పుస్తకరూపమున కుట్టబడి తయారగునవియు, సైనికావసరముల కుపయోగపడు

  • ' (

విండ్ ఫ్లేమర్ ' ( గాలిలో మండునవి ), ' ఫూజీ ' అను నవియు, రంగుమంట నిచ్చెడు పుల్లలును ముఖ్యమైనవి. రంగుమంట నిచ్చుటకై 'స్టాన్షియం', 'బేరియం ' లవణ ములు కల్గిన మందులతో మొదట పూతపూసి, దానిపై, మంట కల్గించెడు పదార్థములతో పూతనిచ్చెదరు.