Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అగ్గిపుల్లలు చేపిరి. 20 వ శతాబ్ది ప్రారంభమునకు ప్రపంచమంతటను అగ్గిపుల్ల లమందు చేయుటకై భాస్వరత్రిగంధకిదము వాడుకలోనికి వచ్చెను. అగ్గిపుల్లలలో, ఇష్టమువచ్చినచోట గీయతగినవి (strike-anywhere), పెట్టె మీద గీయతగినవి (strike-on- box or safety) అనునవి రెండు ముఖ్యమైన రకములు. వీటిలో మొదటిరకపు పుల్లలను, ఏ ప్రదేశముమీద గీచి నప్పటికి మంట బయలుదేరును. రెండవరకపు 'ప్రేమ' అగ్గి పుల్లలను స్వీడను దేశీయుడైన 'జాకు కోపింగ్' 1855 లో తయారుచేసెను. ఇవి ప్రత్యేకతలములపై గీచినప్పుడు మాత్రమే మండును. కావున వీటిని సురక్షితముగ నువ యోగింపవచ్చును. పుస్తకరూపముననుండు పెట్టెలలో దొరుకు మరియొకరకపు పుల్లలు కూడ క్షేమకరమైనవి. ఇవిగాక 'మైనపు అగ్గిపుల్లలు' 'రెండుకొనల అగ్గిపుల్లలు' రంగుపుల్లలు, ఫ్యూజీ; గాలిలో మండునవి (‘Fuzee', 'Wind flamer') మొదలగు వివిధరకములు గలవు. ఇవి ప్రత్యేకావసరములకు వాడబడును. అగ్గిపుల్లలను తయారుచేయుటకు కావలసిన ముడిపదా ర్ధములు కఱ్ఱ, రసాయనిక పదార్థములు, జిగురుపదార్థ ములు, పైన చుట్టు కాగితముపట్టీలు మొదలగునవి. పుల్ల లను తయారుచేయుట కుపయోగించు ముడిపదార్థము లో కఱ్ఱ ముఖ్యమైనది. అగ్గిపుల్లల నాణ్యము చాలవరకు దీనిపై ఆధారపడియుండును. ఈ కఱ్ఱ మెత్తగను, చదును గను, శుభ్రముగను, పగుళ్ళు, బొడిపెలు లేకుండగను ఉండవలెను. అగ్గిపుల్లలను తయారుచేయుటకు చాలరక ముల కలవల నుపయోగించెదరు. 'ఆస్పెన్,' *పోప్లార్,' 'బర్చ్,' మున్నగు రకములను పాశ్చాత్యదేశములలో తరచు వాడుచున్నారు. భారతదేశములో, 'పైనస్ లాంగి ఫోలియా' (Pinus longifolia) 'పైనస్ ఎక్సెల్సా' (Pinus exelsa), 'విల్లో' (Willow), 'పాప్యులస్ సిలియాటా' (Populus ciliata) అడవిమామిడి, ముని మోదుగ, పెద్ద మాను, అడవి గుమ్మడి, గుగ్గిలము, బూరుగ మున్నగు వృక్షముల కలపలను ఈ పరిశ్రమలో వాడుచున్నారు. అగ్గిపుల్ల మందు తయారుచేయుట కుపయోగించు రసాయనిక పదార్థములలో పొటాసియ హరితము, పొటాసియ ద్విక్రోమితము, గంధకము, మాంగ నద్విజమ్ల 80 జనిదము, కాల్షియగంధకితము, ఫెర్రిక్ ఆక్సైడ్, బేరియం గంధకితము మున్నగునవి ముఖ్యమైనవి. అగ్గిపెట్టె ప్రక్కల నుపయోగించు 'రాపిడి' మందులో, ఎఱ్ఱ భాస్వరము, భాస్వర త్రిగంధకిదము, అంటిమొని గంధకిదము, సుద్ద మున్నగువాటిని వాడెదరు. బంక, 'జలెటిన్,' తుమ్మ జిగురు, కేసీన్ (casein) పిండిపదార్థము మున్నగువాటి నుండి జిగురు పదార్థములను తయారు చేసి మందులలో వాడెదరు. క్రొవ్వొత్తుల మైనము, అమ్మోనియా భాస్వ రితము, గాజుపొడి మున్నగు ఇతర పదార్థములను కూడ అగ్గిపుల్లల పరిశ్రమలో వాడెదరు. అగ్గిపుల్లలను తయారుచేయువద్ధతి చాలా కాలమునుండి వృద్ధిచెందుచు అత్యుచ్ఛదశకు వచ్చినది. పురాతన పద్ధతుల కును నవీన పద్ధతులకును గల భేదము, ఉపయోగించెడు స్వయం చాలక యంత్రములయందును, ప్రమాదరహిత లేక క్షేమమగు అగ్గిపుల్లలకు కావలసిన మందుసామగ్రుల యందును, సరియైన మంటను కల్గించు లక్షణముల యందును, ముడిపదార్థముల నాణ్యమునందును గలదు. కాని పరిశ్రమయందలిమూలసూత్రములలో మార్పులేదు. 'క్షేమ' మగు అగ్గిపుల్లలను తయారుచేయు నూతనపద్ధతి సూక్ష్మముగ ఈ దిగువ వర్ణింపబడినది. అడవులనుండి తేబడిన దూలములను సుమారు రెండడు గుల పొడవుగల స్తంభాకారపు ముక్కలుగా కోయు దురు. వాటిపై బెరడు యంత్రసహాయముచే తీసివేయ బడును. తరువాత ఈ ముక్కలను కడిగి నీటిలో ఉడక బెట్టుట యో, ఆవిరిలో వేడిచేయుటయో జరుగును. ముక్కలు మెత్తబడిన తరువాత వాటిని చీలికలు చేయు యంత్రములవద్దకో, పైన పూతపూయు _ యంత్రముల దగ్గరకో పంపుదురు. ఇక్కడ ఈ ముక్కలనుండి, జాగ్ర తగా నమర్చబడిన కత్తితో, ఒకే మందముగల పొరను విడదీయుదురు. ఈ పొర ఒక పొడవైన రేకువలె వచ్చును. దీని వెడల్పు స్తంభాకారపు ముక్కల పొడవునకు సమా నము. దీని మందము, అగ్గిపెట్టెలకొరకు అంగుళము, పుల్లలకొరకు అంగుళము ఉండును. ఈ రేకులను దొంత రలుగా చేసి, పెట్టెలకు పనికివచ్చునట్లు ముక్కలుగను, పుల్లలుగను కోసెదరు. వీటిని మందులను పట్టించుటకై వేర్వేరు విభాగములకు పంపెదరు.