Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Q అచ్చుయంత్రములు - ముద్రణకళ నుండి ఒక పంపుయొక్క సహాయమున అచ్చుమూస లోనికి పోయబడును. ఆ లోహద్రవము ఆ సంజ్ఞలలో పడిన వెంటనే ఘనీభవించును. ఆవిధముగ తయారయిన లోష్టకము యొక్క పై భాగమున అచ్చు ముక్కలచే నేర్పడి యెత్తైన సంజ్ఞల యొక్క ముద్రలు ఏర్పడును. సరియయినపొడ వు మందము ఉండునట్లుగా ఆ లోష్టకము కోయబడి, స్వతశ్చలనముచే (automatically) అచ్చునుండి తొలగిపోవును. తరువాత ఆ పంక్తి మూసకట్టునుండి ఎత్తబడి ప్రక్కకు జరపబడును. అప్పుడు అచ్చుముక్క లకు పై భాగముననున్న పండ్లు (teeth) బొమ్మలో 'ఆర్ ' అనుచోట గల కడ్డీయొక్క కొక్కెములను పట్టుకొనును. దీని ఫలితముగా యంత్రముయొక్క ఉపరిభాగమున నున్న విభాగమునకు (Distributor) ఆ అచ్చుముక్కలు పైకి లేపబడి చేరుకొనును. ఆ అచ్చుముక్కలు యంత్రా ధార ఫలకము యొక్క అడుగుభాగమునుండి బయలుదేరి అక్షరపం క్తిలోచేరి అక్కడనుండి మూసకట్టు ద్వారమున ఆధార ఫలక ము యొక్క పై భాగమునకు తిరిగిచేరును. ఈ ప్రదక్షిణ క్రమమువలన ముద్రణకార్యము అతివేగ ముగా జరుగును. అది టైపు వేగమును ఎన్నో రెట్లు మించును. ప్రస్తుతము భిన్నభిన్న ముద్రణ కార్యములను నిర్వహించుటకు అనువైన వేరువేరు రకముల పంక్తి ముణములు అమలులో నున్నవి. ఆధునిక యంత్రములు, ప్రకటనములకు, ప్రదర్శనములకు సంబంధించిన విష యములనే కాక పఠన విషయములను గూడ అచ్చుకూర్చ గలవు. లోహమును కరగించుటకు విద్యుచ్ఛక్తిచే వేడి చేయబడు లోహపాత్రమును ఉపయోగించుట, ఇటీవల జరిగిన అభివృద్ధియైయున్నది. దీనివలన సీసపు పొగలచే గలుగు బాధ తగ్గుటయేగాక లోహముయొక్క ఉష్ణో గ్రతను మిక్కిలి సూక్ష్మముగా క్రమపరుచుటకు కూడా వీలుకలుగుచున్నది. 1928వ సంవత్సరమున ప్రపంచమం దంతటను 60,000 పంక్తి ముద్రణ యంత్రములు ఉపయోగమునందుండెను. 2. ఏకముద్రణ యంత్రము (Monotype) :- ఈ యంత్రమునందు ప్రతి సంజ్ఞయు విడిగా అచ్చుపోయబడి అక్షరపంక్తులయందు స్వయముగా కూర్పబడుటచే దీనికి ఏకముద్రణ యంత్రము అను 'పేరు సార్థక మగుచున్నది. 88 తరచుగా దీనిలో మీటలబల్ల, పోతపోయు యంత్రము అను రెండు వేరు వేరు యంత్ర భాగములుండును. దీనిని ఒకే పనివాడు నడిపించుచుండును. మీట ల బల్లయు పోత బోయు సాధనమును ఒకేపనిని ఎడతెగక చేయుచుండుట వలన, వీటిలో ఏదైన తాత్కాలికముగ ఆగినయెడల, రెండవదానికి ఆటంకములేకుండ, ముద్రణ కార్యము జరు గునట్లు ఈ సామగ్రి అమర్పబడియున్నది. మీటల బల్ల పై కూర్పు జరుగును. అది పోతయంత్రము కొరకు కాగితమును స్వాధీనమునందుంచు రిబ్బనుపై రంధ్రములు చేయును. ఈ మీటబల్ల పై 225 మీటలుండును. టైపుకొట్టు అన్ని ప్రమాణపు (standard) పై పుయంత్రములలో ఉండునట్లు గానే ఇందు ప్రతి అక్షరమునకును సంజ్ఞాక్రమము ఒకే విధముగా నుండును. ఆ మీటలు మీట కడ్డీల మూలమున పిధాన (Volves) ములతో చేర్చబడియుండును. ఆ పిధాన ములు చిన్న ముషలకముల (Pistons) క్రిందినుండి గాలిని ప్రవేశ పెట్టును. కార్యకర్త (Operator) మీట నొక్కగానే సిధానముల ద్వారా ప్రవేశించిన గాలి కాగితపు రిబ్బను నందు సంజ్ఞానుకూలములైన రంధ్రములను చేయును. మీటను వదలినతోడనే కాగితమును స్వాధీనమునందుంచు కొను రిబ్బను ముందునకు జరిగి తరువాతి సంజ్ఞను గ్రహిం చుటకు సిద్ధముగనుండును. కాగితపురిబ్బనునం దేర్పడిన రంధ్రసముదాయము పోతపోయు యంత్రమువద్ద మూసపై నున్న వలసిన సంజ్ఞను గ్రహించుటకు వీలుగా అచ్చుముక్కను అమర్చునట్లుగా రంధ్రములు చేయు ఇనుప సాధనములు ఏర్పాటు చేయబడినవి. రంధ్రములు చేయు యంత్రసామగ్రి, వీటితోపాటు లెక్కించుటకును, సరి చూచుటకును కావలసిన పరికరములు ట నుండును. లెక్కించు సాధనము, పంక్తిలో కొట్టబడిన ప్రతి సంజ్ఞ యు ఎంత వెడల్పుగానున్నదో లెక్కించి, పంక్తిలో ఇదివరకు కొట్టబడిన సంజ్ఞల యొక్క వెడల్పు నకు కలుపును, దానినిబట్టి ఒక్కసారిచూడగానే, పంక్తిలో ఇంక ఎంతస్థలము మిగిలియున్నదో కార్యకర్త తెలిసికొన గలడు. సరిచూచుయంత్రమునందు ఒక సూచికయుండును. ఎడమును సూచించు పట్టీని (spacebar) నొక్కిన వెంటనే ఆ సూచిక ఒక్కొకసారి ఒక్కొక్క గంటును పైకి లేవ నెత్తుచుండును. అప్పుడు పదములమధ్య సరియైన ఎడము