Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్వాచీనమయిన అఖిలేశ్వరవాదము : దీనికి అనుయా యులు పెక్కురు గలరు. దీనిని ప్రకాశింపజేసిన ప్రముఖు లలో సెర్విటను, బ్రూనో, వానిని (vanini), స్పినోజా, ఫిక్టే, హె గెల్— పేర్కొనదగుదురు. బ్రూనో ప్రతిపాదించిన వాదములు రెండు. వాటిని అఖిలేశ్వర వాదము యొక్క ముఖ్యలక్షణములు అనవచ్చును. దేవతలు లోనుండి వ్యవహరింతురు; బహిఃస్థితులయి వ్యవహరింపరు. విశ్వము ఏకము. అనంతము, అనునవి ఆవాదములు. విశ్వైక్య మును చింతించుచు బ్రూనో ఇట్లు వచించెను. "జాత మయిన వస్తు వెట్టిదైనను మార్పునొందును. నిత్యవస్తువు మాత్రము మారునది కాదు. ఆ వస్తువు ఏకము, దివ్యము, శాశ్వతము. వస్తుజాతము విశ్వమునందున్నది; విశ్వము వస్తుజాతమున గలదు. మనము 'తత్' అనుదానియందు న్నాము. 'తత్' అనునది మనయందున్నది. అందరము పరిపూర్ణ -అద్వైతమున సమాగమము నొందుదుము.” ఆధునిక వేదాంతులలో స్పినోజా ప్రముఖుడు. అతడు అఖిలేశ్వర వాదమునకు ప్రవక్తగ పరిగణింపబడెను. స్పష్టత యందు తర్క కౌశలమునందు ఆతని వాదము అద్వితీ యము.“దేవుడుసర్వము తానయైయున్నాడు.అతనికంటె భిన్న మొండు లేదు. ఆతనిలో నీ విశ్వము ఇమిడియున్నది. దేవుడు అనంతుడు. ప్రపంచమునకు అంతముకలదు. అనంతవస్తువునకును, నశ్యవస్తువునకును పొత్తుకుదరదు. నళ్యములగు వస్తువులు యథార్థముగలేనివే. వికార రహితమయిన పదార్థము యొక్క ఖ్యాపనములు లేక ఆకృతులుగా తెలియబడునంతవరకు అవి సత్యములు. ఆధ్యాత్మిక పరిభాషలో అవి సత్యవస్తువు యొక్క ప్రతి రూపములు. అన్యవస్తువునందున్న దానికే ప్రతిరూపమని పేరు, ఆ అన్యవస్తువుచేతనే దాని స్వరూపము గోచరిం చును. సర్వము భగవంతునియందే కలదు. భగవంతుని యందు లేనిది లేనేలేదు. సముద్రమునకును, తరంగముల కును గల సంబంధము వంటిదే సద్వస్తువునకును, ప్రతి రూపములకునుగల సంబంధము, అవి సత్యవస్తువు యొక్క భిన్న భిన్నములయిన అవిర్భావములు, ఆ వస్తువుకంటే నవి అభిన్నములు. దానియందే అవి లయించును." అని అతడు ప్రవచించెను. ఇట్లు సర్వమునకు అంతర్గతమయిన కారణముగా, సర్వసారముగా విశ్వమునందలి సర్వ 77 అఖిలేశ్వర వాదము వస్తుజాతముపైని విశేషముగ మానవుని హృదయము పైని ప్రభావముతోగూడిన ఆత్మజ్ఞత, సంకల్పము, ప్రజ్ఞ, వ్యక్తిత్వము కలవాడుగా భగవంతుడు స్పినోజాకు గోచ రించెను. శాశ్వతమును సర్వగతమునగు కారణమగుటచే భగవంతునకు ఆంగ్లేయములో 'నాచురనాచురన్స్' అని వ్యవహారము. సృష్టియందు ఆవిష్కృతుడగుటచే అతనికి “నాచురనాచురట" అని పేరు. ప్రకృతి అనగా, విశ్వము భగవంతుని ముఖ్యసారము. అందుచే నది అతని శక్తి. కాగా భగవంతుడు, అతనియందలి ప్రకృతి, ఆద్యము, అనే పాధిక మునగు కారణము. ప్రకృతికార్యము అనగా, ఆతనిశ క్తి యొక్క ఔపాధికమయిన ఆవిర్భా వము. భగవంతునికం వ్యతిరిక్తమయినది ఏదియు లేదు.” ఫిక్టే, మరియొక అర్వాచీనుడగు అఖిలేశ్వరవాది, అతడు దేవుని, విశ్వమును గూర్చి గాఢముగ విమర్శన మొనర్చెను. ప్రతిరూప భేదమునకు వెనుక నున్న వాడు దేవుడే యైనను అతనిని గూర్చి స్వల్పముగానే మనము తెలిసికొనగల్గుచున్నాము. అతనిని రాయిగా, మొక్కగా, ప్రాణిగా లేదా ప్రకృతిసూత్రముగా, నైతిక సూత్రముగా మాత్రమే మనము తెలిసికొనుచున్నాము. ఇవియన్నియు ఆతనికంటె భిన్నములు. ఆకృతియే సత్యవస్తువును మన దృష్టి నుండి మరుగుపరచుచున్నది. ఈ పరిదృశ్యమాన మే ఆసత్యవస్తువును దాచుచున్నది. మన దృష్టి ఇంకకంటె వి శేషమును గుర్తింపజాలకున్నది” అని ఫిళ్లే వచించెను. రాజా అర్వాచీనులయిన హిందూ వేదాంతులలో, రామమోహనరాయలు మొదలుకొని రవీంద్రనాథ ఠాకూరు వరకు పెక్కురు కలరు. మహర్షి దేవేంద్రనాథ ఠాకూరు, కేశవచంద్ర నేను మొదలగు మతోపదేశకు లున్నారు. బ్రహ్మజ్ఞాన సమాజస్థులలో ప్రముఖులుకలరు. వివేకానందస్వామి యొకడున్నాడు. వీరి మత- వేదాంత విషయకములయిన ఆశయములు అఖిలేశ్వరవాదమునకు అనుకూలములైనవి. వీరి వేదాంతము ఏకేశ్వరుని ప్రతి పాదించు ఉపనిషత్తత్త్వమే. ఇది ఆధ్యాత్మిక గూఢ తత్త్వము కంటే అభిన్నము. అఖిలేశ్వర వాద సిద్ధాంతములు:- " సత్య వస్తు వొకటి కలదు. అది సర్వ వ్యాపి. పరిదృశ్యమానమగు సర్వ ప్రపంచమున కది మూలతత్త్వము. అది ఏకము, అవిది