Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అఖిలేశ్వర వాదము ఖ్యాకము అయిన అగ్నికణములవంటివారు. జీవులు భగవంతుని అంశములు, అందుచే వారు ఆతనియందే జనించి, ఆతనినే చేరుదురు. జీవాత్మ, శరీరమును, దాని అవయవములను నియమించును. అతనికి ఉత్పత్తి నాశ ములు లేవు. జీవాత్మ దివ్య వస్తువు (పరబ్రహ్మము) యొక్క అంశము. అందుచేత అతడు అనంతుడు, అమరుడు, ప్రాజ్ఞుడు, చేతనుడు, వాస్తవికుడు. దేహాంతర ప్రాప్తికి లోనగుచు, జీవుడు, లోకాంతర ప్రవిష్టుడయి, అచ్చట తన యొక్క సుకృత దుష్కుృతముల ఫలము లను అనుభ వించును. శిక్షను అనుభవించు నిమిత్తమై పావులు వేరు వేరు లోకముల కేగుదురు. సుకృతవంతులు చంద్రలోకము నకు అరుగుదురు. అరిగి, అచట నిజ సుకృతఫలము ననుభవింతురు. పుణ్యము క్షీణింపగా, వారు మర్త్యలోక మున నిజ కర్మానుగుణము లయిన దేహముల నొంది, విధివళమున ప్రవర్తింతురు. జ్ఞానవంతులు ప్రాపంచిక బంధములనుండి ముక్తులయి, ఉన్నతతర మయిన బ్రహ్మ లోకమున ప్రవేశింతురు; జ్ఞాన పరిపూర్ణు లగు జీవులు వెంటనే బ్రహ్మైక్యము నొందుదురు. గ్రీకుల అఖిలేశ్వర వాదము :- హిందువుల వేదాంతము నందువలె గ్రీకుల వేదాంతమునందు కూడ అఖిలేశ్వర వాద సూచనలు పెక్కు లుండెను. థేల్సు, గ్రీకు వేదాం తులలో ఆద్యుడు. అతడు సర్వవస్తువులకు మూలము ఉదక మని నిరూపించెను. అత డిట్లు వాదించెను, "మనుజుడు ప్రథమ సృష్టి యనుట పొసగదు. ఎందుచేత నన- అతడు తనకంటే ముందు పుట్టిన నీటిపై ఆధార వడెను. దేవతల సృష్టికూడ మొదటిది అనుటకు వీలులేదు, దేవతలుకూడ మనుజులవలె నీటి అవసరము కలవారే. వారు ఆకసములో నివసింతురని భావింప బడుచున్నది. ఆకసమునుండియే వాన పడును. నీరు లేనియెడల ప్రాణి వర్గము నశించును. నీరులేక ఏ వస్తువు పుట్టియుండదు. అందుచేత నీరే అన్ని వస్తువులలో మొదటి సృష్టి.” థేల్సు పుట్టిన తరువాత, ముప్పది సంవత్సరములకు, క్రీ. పూ. 810 ప్రాంతమున జన్మించినవాడు అనాగ్జి మాండరు. అతడు భూమియే ఆద్యసృష్టి యని నిరూపించి నట్లు ప్రసిద్ధికలదు. అతడు భూగోళశాస్త్రజ్ఞుడు. అతడు ఆ శాస్త్ర భూగోళశాస్త్ర సాధనములను కనిపెట్టినట్లు విషయమున తన ప్రజ్ఞను వినియోగించినట్లు తెలియు చున్నది. పిదప చెప్పదగినవాడు ఎనాగ్జిమీనసు. అతడు థేల్సు పుట్టిన పిదప, నూరు సంవత్సరములకు జన్మించెను. ఐయోనియను వేదాంతులలో అతడు తృతీయ స్థానమును ఆక్రమించెను. అతడు పూర్వులగు వేదాంతు లొనర్చిన సిద్ధాంతములతో తృప్తినొందడయ్యె. "వాయువు ఆద్య తత్త్వము. జలము, భూమి, గుణమునందు పరిమితములు. వాతావరణము సర్వత్ర వ్యాపించునది. దానికి దేవునితో తాదాత్మ్యము కలదు అని ఆతని సిద్ధాంతము. హిరా క్లిటను అను వేదాంతి అగ్నిని ప్రథమ తత్త్వముగా నిరూ పించెను. అతడు క్రీ. పూ. 6వ శతాబ్దివాడు. "అగ్ని సర్వముగాను, సర్వము అగ్నిగాను మార్చుటకుళక్యము. " అనునది ఆతని సిద్ధాంతము - కాగా పై సిద్ధాంతము లన్నియు స్పష్టి కెల్ల మూలబీజము ప్రకృతి యను విషయ మున నైకమత్యము కలిగియున్నవి. అనగా నివన్నియు అనాత్మవాదమును ప్రతిపాదించునవే. పై థాగరసు, ఈ లియాటిక్సు అను వేదాంతులు అనంతరీయులు. వారిరు పురు అయోనియను వేదాంతమును పెంపొందించిరి. పై భాగరసు విళ్వైక్యమును స్పష్టముగ దర్శించెను. "ఏక మునుండి సర్వము పుట్టుచున్నది. దేవుడు సర్వ వ్వాపి. సర్వ ప్రేరకుడయ్యు, అతడొక్కడే సర్వావస్థలు గళిత ములు కాగా, పరమాత్ముడొక్కడే అద్వితీయుడును, సంపూర్ణుడునై శేషించుచున్నాడు." అని అతడు వాదించెను. హిందూ వేదాంతుల వేదాంతమునందలి 76 అత్యంత నిర్గుణత. ఆధ్యాత్మికత, అను సంశములను ఈ లియాటిక్సు అంగీకరించెను. పిదప పేర్కొనదగిన వారు అర్వాచీనమయిన ప్లేటో మతమునకు చెందిన గూఢత త్త్వ ద్రష్టలు. తదనంతరీయులు అరేబియను సూఫీ మతస్థులు. వారు భగవదై కాగ్ర్యమును సర్వజనులకు ప్రీతి పాత్రము కావించిరి. వారు దూరస్థుడగు నీశ్వరుని భజింపరు. ఈశ్వరుడు వారి హృదయమునం దుండవలయును. "అత్యున్నత సత్యములను స్వాధ్యాయమువలన అందు కొనజాలము. ఆనంద పారవశ్యమునందలి ఆత్మపరివర్త నముచేతనే వాటిని పొందగలుగుదుము." అని వారు వక్కాణించిరి.