Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తావే లేకుండెను. బహుదేవతాత్వ భావనచే మన మనస్సు నందు జనింపదగిన పరిచ్ఛిన్న బుద్ధి, ఆరాధ్య దేవతా విష యమున భక్తుని మనమున పొడమలేదు. ఇది బహు దేవతా వాద మనుకొనబడినది గాని, బహుజను అనుకొనునట్టి ఏ కేశ్వర వాదము కాని కాదు. ఒక్కడును, అద్వితీయుడు నగు పరమాత్మయొక్క స్వరూపమే సర్వదేవతాగణము. ఆ పరమాత్మ ఒక్కడే భిన్నభిన్నములయిన ఆకృతులతో కనిపించును. దేవశలు, మనుజులు, ప్రకృతికృత్యములు, ఈ సర్వమును ఒక్కడు, సర్వవ్యాపి, సత్య స్వరూపుడు నగు పరమాత్మ యొక్క క్షణిక ప్రతిభాసయై యున్నది. అను జ్ఞానమే హిందూ - అఖిలేశ్వరవాద హృదయము. వేదములందలి హిందువు ప్రజ్ఞాసంస్కృతి విశేషము న పేక్షించు సమస్యలలో వ్యాపృతుడై యుండెను. అవి సత్యస్వరూపము నెరుంగు శక్తి నొసంగజాలియుండెను. మోక్షముల్లరు నుడివినట్లు, అతడు (హిందువు) ఈ ప్రపంచ సమస్యా పరిష్కార విషయమున మగ్నుడై యుండెను. ఆద్యమాన వునందువలె అతనియందును వాంఛలు లోపములు కన్పట్టెను. ఆహారమును, ధన మును, ఆధిపత్యమును, పెద్దకుటుంబమును, దీర్ఘాయువును తన దైనందిన ప్రార్థనలలో అత డర్థించేను. విశ్వమునగల సర్వభూతములకు అతడు నామకరణ మొనర్చెను. వాటిని ప్రార్థించెను; స్తుతించెను; పూజించెను; తన హృదయాంతర మందు ఒకశక్తిని అతడు గుర్తించెను. ఆ శక్తి తనయం దుండి ప్రార్థనను బోధించినట్లు, ఆ ప్రార్థనల నాలకించి నట్లు, తన పరిసరముల నున్న వారికి తోడ్పడినట్లు ఆతనికి గోచరించెను. తుదక దీనినే అతడు 'బ్రహ్మము' అనెను. ఆ వైయక్తిక మయిన ఈ 'బ్రహ్మము' కూడ కాలక్రమమున 'ఒక చిత్రము దివ్యమునైన వస్తువుగా మారెను. నేటికిని పూజింపబడుచున్న త్రిమూర్తులలో నొకడుగా నేర్పడెను. ఐన నాతని హృదయమునందలి భావనకు నిజమైన పేరు లేకుండెను. అనన్యమును, సర్వదేవతలకు, సర్వలోకమునకు, సర్వమునకు ఆధారభూతమునయిన శక్తి విశేషమొకటి వాచ్యముగాక, భావితమై అతని మనము నెదుట ప్లవమానమై గోచరించెను. తుద కాతడు దానిని 'ఆత్మ' యనెను. ఆదియందు, ఆత్మళ బ్దమునకు 75 ఆఖిలేశ్వర వాదము ప్రాణము, లేక, చైతన్యము అను నర్థము లుండెను. ఆ శబ్దము పిదప 'ఆక్మ' యను అర్థముననే స్థిరపడేను. భిన్నభిన్న దేవతలను గూర్చి, పౌనఃపున్యముగ, సర్వత్ర ప్రార్థనలు జరుగుచున్నంతలో, చాల స్వల్పసంఖ్యగల దేశ ములందలి జనులుమాత్రమే, సర్వవ్యాపి, విశ్వాత్ముకు నగు దేవుడొక్కడే కలడను విషయమును నొక్కి వక్కా ణింపగల్గి యథార్థముగ దేవుడొక్కడే. అత డే సర్వాత్మ; అతడే పరమాత్మ; ఈ విశ్వ మాతనికృతి. ఇతర దేవతలు వేరు వేరు నామములచే వ్యవహరింపబడుదురుగాక ! విశ్వ మును, మనుజులను, దేవతలను గూడ వ్యాపించి"పరమాత్మ ఒక్కడే ఉన్నాడు" అనుసత్యము విస్మృతము కాదగదు. బ్రాహ్మణముల కాలమున యాగాది కర్మ కలాప ముల వలన మతము క్రమముగా సన్నగిల్లెను. అందుచేత శుద్ధమును, ఆధ్యాత్మికమును, వైదికము నగు ఈశ్వర విషయక మయిన భావము నందలి ఉన్నతికి భంగము వాటిల్లెను. పురోహిత వర్గము యొక్క అధికారము, నీచ ప్రమాణమునకును దుర్వినీతికిని దారితీసెను. ఈ పరిస్థితులు బౌద్ధ ధర్మము, సాంఖ్యము మున్నగు హిందూ మతమునందలి సంస్కారాత్మక దర్శనములకు మార్గదర్శకము లయ్యెను. ఇవి పురోహిత వర్గముపైని, భగవద్విషయక భావనపైని, సవాలు చేసెను. అయితే ఈ దర్శనములు పూర్వోక్త విధమున అఖిలేశ్వర వాదము నందలి రెండవ పక్షమునకు చెందినవై యున్నవి. - ఉపనిషత్తుల యందుగూడ అఖిలేశ్వరవాద తాత్ప ర్యము కలదు. ఒక పాశ్చాత్య వేదాంతి దాని నిట్లు సంగ్రహించెను : " జగత్తునకు భగవంతుడు సర్వజ్ఞ తాయుతము, సర్వశక్తి విశిష్టము నైన కారణము ; ఇచ్ఛా మాత్రమున అతడు సృష్టి యొనర్చును. అతడు విశ్వమునకు సమర్థ కారణము, ఉపాదాన కారణము – ఉభయమునై యున్నాడు. అతడు స్రష్ట, సృష్టి; నిర్మాత; నిర్మితి; కర్త, కృత్యము. ప్రళయకాలమున సర్వము అతనియందే లీనమగును. పరమాత్మ ఒక్కడు, అద్వి తీయుడు, అఖండుడు, నిరవయవుడు, అనంతుడు, వాదా మగోచరుడు. అతడు సర్వజీవులకు, ఉత్తత్పత్తికి, వివేకము నకు, బుద్ధికి, సుఖమునకు అధీశుడు. ఆతనినుండి పుట్టిన వ్యక్తిగతజీవులు ప్రజ్వలించు నగ్నినుండి జనించిన అసం