Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆఖిలేశ్వర వాదము ఇట్లు రెండు పక్షములవారిచే నిరూపింపబడిన అఖిలే శ్వర సిద్ధాంతము యొక్క ప్రాథమికావస్థ యందైనను మృణ్మయములు, శిలామయములు. చిత్రమయములు, సాంప్రదాయికములు నగు విగ్రహముల యొక్క ఆరాధ నకు తావు లభించియుండలేదు. అఖిలేశ్వర వాదు లిట్లు వాదింతురు. "దేవుడు తన కృత్యముల ద్వారముననే స్వాత్మను ఆవిష్కరించుకొనేను. భగవంతుని కృత్యము లను తెలిసికొనుటచేతనే మానవునకు భగవంతుని గూర్చి జ్ఞానము లభించును.” దీనిని బట్టి అభిలేశ్వర సిద్ధాంతము నందు భగవంతుని సాకారునిగ నిరూపించుట గాని, ఈ ప్రకృతి యందలి వస్తువులందు చైతన్యము నారోపించుట గాని జరిగియుండలేదని తెలియును. ఇదియే ఈ సిద్ధాం తము నందలి ప్రత్యేకత. G దేవ విషయకమయిన ఇట్టి భావన, మనుష్యత్వారో పము నొక వైపునను, అనాత్మ వాదమును మరి యొక వైపునను నిరాకరించుచున్నది. " దేవుడు శక్తివిశిస్టుడు, శాశ్వతుడు, అనంతుడు. ప్రకృతి యందలి ప్రతిరూపము యొక్కయు, సంఘటన యొక్కయు ద్వారమున అతడు స్వాత్మను ప్రకటించుకొనును. భగవంతుడు నశ్య పదార్థము కంటే భిన్నుడు. ఆత్మకు శరీరమునకు గల సంబంధము వంటిదే భగవంతునకును. ద్రవ్యమునకును గల సంబంధము. ఒక సుప్రసిద్ధ తత్త్వజ్ఞుడు వచించినట్లు మహాసముద్రము ప్రకృతమునకు తార్కాణము, సముద్రము అనంతము, శాశ్వతము. అట్టిదాని యందు సంఖ్యాతీతములయిన రూప భేదములతో పెక్కు బుద్బుద ములు, చిన్న తరంగములు, గొప్ప తరంగములు పుట్టును. అవి అందే భాసించి, అందే లయించి, దాని రూపమునే పొందుచున్నవి. ఆ బుద్బుదాదులన్నియు జలము కంటె భిన్నమయినవి కావు, ఎప్పుడును జలరూపమున నుండు నవే. శరీరము యొక్క ఆకృతులు వశ్యములు. ఆత్మ శాశ్వతమైనది. అది ఏకము, అద్వితీయము, సార్వకాలి కము " అని ఈ సిద్ధాంతము. కావున అఖిలేశ్వర వాదము ద్వైతమును గాక అద్వైతమునే ప్రతిపాదించుచున్నది. అఖిలేశ్వర వాదము యొక్క సంగ్రహ చరిత్ర :- మత చరిత మెంత పురాతనమైనదో, అభిలేశ్వర వాదముకూడ అంత ప్రాచీనమయినది. అన్ని యుగములందును అఖిలే 74 శ్వర వాదమునందు అభిరుచిగలవా రుండిరి. అది ప్రపంచ మున ప్రాచీనతములయిన నాగరకులలో వ్యాప్తినొం దెను. అన్ని దేశములలో, అన్ని కాలములలో అది ఆదర మును గాంచెను. ప్రాక్పశ్చిమ దేశములలో అందరికి దీని యందు ఆభిముఖ్య మేర్పడెను. హిందువుల అఖిలేశ్వర వాదమును వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత బోధిం చెను. గ్రీకు అఖిలేశ్వర వాదమును ప్రబోధించిన వారు ఐయోనియన్స్, ఈలియాటిక్సు, అర్వాచీనమయిన ప్లేటో మతమును అనుసరించిన వారు. మధ్య యుగములలో దేవాలయాధికారుల యొక్క నిర్బంధ పర్యవేక్షణము కారణముగ మత మీమాంసకు అవకాశము లేదయ్యె. జానుస్కోటసు ఎం బేన అను వేదాంతి యొక్కడే మత మీమాంసకు డుండెను. అతడు ప్రాచీన, అర్వాచీనము లయిన అఖిలేశ్వర వాదముల మధ్య ఒక గొలుసువలె భావింపబడెను. పశ్చిమ దేశములలో గయార్డానో బ్రూనో బెనెడిక్టు, స్పినోజా, ఫిక్టే, హెగెల్ అనువారు అర్వాచీన మయిన అఖిలేశ్వర వాదమునకు ప్రతినిధులు. హిందూ దేశమున దివ్యజ్ఞాన సమాజస్థులలో రాజా రామమోహన రాయ, కేశవ చంద్రసేనులు మొదలుకొని స్వామి వివేకానంద, రవీంద్రనాథ ఠాకూరుల వరకు దానికి ప్రతినిధులు పలువురున్నారు. వేదములయందు హిందూ - అఖిలేశ్వర వాదము :- విగ్రహారాధనకు ప్రసక్తి లేకుండెను. హిందూ దేశమున మూర్తిపూజఅనునది మిక్కిలి అనంతరీయమయిన కాలమున ఏర్పడిన వ్యవస్థ. అది సామాన్యముగ పెక్కురు గ్రహిం చిన బహుదేవతావాదమునకు ఎంతమాత్రము సంబం ధించినది కాదు. వేదములందు సూర్యుడు, అగ్ని, ఉషస్సు మున్నగు దేవతలనుగూర్చి ప్రార్థనలున్నవనుట సత్యమే. అయితే ఆ దేవతలలో ఏయొక్క దేవత ప్రత్యేకముగ ప్రార్థింపబడినను, ఆ దేవత, శేషంచిన దేవతల అధి కార మునకు లోబడినదిగాగాని, ఇతర దేవతలకంటే గౌరవ ప్రతిపత్తులలో న్యూన తాధిక్యములు కలదిగాగాని భావింప బడలేదు. మహత్త్వవిషయమున ప్రతి దేవతకు ఇతర దేవతలతో సమత కల్పింపబడెను. ఆరాధ్య దేవత యొక్క దేవశాత్మక, ప్రాధాన్యము, పరమాత్మత, మున్నగు గుణములను గూర్చి ఆరాధకుని మనమున ఎట్టిశంకకును