Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

" అఖిలేశ్వర వాదము తము, అవేద్యము. బాహ్యప్రకృతి దాని ఆవిర్భావమే " అనునది సంగ్రహముగ అఖిలేశ్వరవాదము యొక్క ముఖ్య సిద్ధాంతము. అభిలేశ్వరవాదము యుక్తి సిద్ధము. దీనికి స్పెన్సరు వేదాంత మొక ఉత్తమోదాహరణము. స్పెన్సరు యొక్క అవేద్య విషయక భక్తియు, నిర్దు ణాత్మకమయిన అభిలేశ్వర వాదమే. వేదకాలపు ద్రష్టల నుండి ఆధునికులగు తత్త్వజ్ఞుల వరకు భగవంతునియందలి విశ్వాసము పెంపొందుచున్నదని నిరూపింపబడినది. దేవుడు ఒక్కడు అద్వితీయుడు, సర్వవ్యాపి, పరిదృశ్య మానమగు విశ్వమెల్ల అతని బాహ్యస్వరూపము ” అనున దే ఆ దృఢవిశ్వాసము. నేటికి ప్రకృతిశాస్త్రము దీనిని సరి చూచుటకు ఉపక్రమించుచున్నది. 'సత్త' పూర్వమందు ఉన్నట్టిది. ముందు అది పరిమాణమునందును, తత్త్వ మందును మార్పునొందనిది. ఆకృతియందే దానికి మార్పు ఘటిల్లును - అను విషయమును ప్రకృతి యొక్క అనశ్వ రత్వము, శక్తి యొక్క సంరక్షణము అను వాటిని గూర్చిన సిద్ధాంతములు నిరూపించుచున్నవి. ఈ ప్రకటన ముల పరిణామమే అఖిలేశ్వర వాదముగ దోచును. అవి జ్ఞాత (వస్తువు) ము లేకయే జ్ఞాతమును గూర్చి ఆలోచింప జాలనట్లు ప్రతిభాస- ఆధారముగ నంగీకరింపక యే, ప్రతి భాసములను అంగీకరింపజాలము. వీటిలో ఒకటి, రెండవ దాని పూర్వభావనయే. మనుజుడు ప్రతిభాస- ఆధార స్వరూపమును తెలిసికొనుశక్తి తనకు లేదని యంగీకరించి నను, దానియొక్క సత్తను మాత్రము, తర్క ప్రాబల్య మునకు లోనై, అంగీకరింపవలసినవా డగుచున్నాడు. ఆతడు తన శక్త్యభావమును సవినయముగ అంగీకరించు టయే అతని వివేకమునకు లక్షణము. ప్రతిభాస- ఆధారము యొక్క రూపములు అనంతములుగా ఆవి ష్కృతములు. అవి సంకల్పము, బుద్ధివైభవము, స్రష్ట, సృష్టి, సత్యము - మున్నగునవి. ఈ నామములు, నామ మాత్రములుగా (చిహ్నములుగా అంగీకరింపబడువరకు అవి యున్న వనుకున్నను బాధయుండదు. ఈ నామము అన్నియు అనిర్వాచ్యమగు సత్యపదార్థము యొక్క స్వరూప నిరూపణమున అపర్యాప్తములు- అను భావము ఉత్సుకుల హృదయ కుహరమున లక్షితమగుచున్నది. సి. ఇప్లంపుట్రీ అనునాతడు హూకరును ఇట్లనువదించు 2 • 78 చున్నాడు. "భగవంతుని యథాస్థితినిగూర్చి మన కేమియు తెలియదని గుర్తించుటయే ఆతని గూర్చి మనకు గల సంపూర్ణ జ్ఞానమగుచున్నది. అతడు అ వేద్యుడు. ఆతనిని గూర్చి మనము ప్రదర్శింపగల వాగ్వైభవము మౌనము వహించుటయే.” ఇందలి ముఖ్యమైన లోపములు (Limitations) :- అభి లేశ్వర వాదమున బుద్ధివైభవము మెండు. అందలి లక్షణ ములు చిత్తావర్ణకములు. ఐనను అది మతస్థాయిని అందుకొనలేక పోయినది. ఎందుచేతనన అది పాపము, తదుత్పత్తి మున్నగు సమస్యలను వివరించియుండ లేదు. సర్వము దేవుడేయైనచో, లోపములు కూడ దివ్యములే యగును. ఆ పక్షమున దేవుడు అసంపూర్ణుడగుట గాని, పాపమనునది లేనేలేకుండుట గాని సంభవించును. కాని ఇది మన ప్రత్యణానుభవమునకు విరుద్ధమైనది. దేవుడు ప్రతి సంఘటనకు(దృశ్యము) ప్రతిభాన ఆధారమయినచో అతడు ప్రపంచము నందలి పాపముల కెల్ల ప్రతిభాస. ఆధారమగునని అంగీకరింపవలసి యుండును. అట్లంగీకరిం చుట నాస్తికతను ప్రతిపాదించుటయే యగును. బేకను వచించినట్లు దేవునిగూర్చి అనర్హమయిన అభిప్రాయమును ప్రకటించుట కంటె, ఊరకుండుటయే మేలు. ఎందుచేత నన-ఒకటి అవిశ్వాసముగా, రెండవది అవజ్ఞ గా పరిగణింప బడును. అఖిలేశ్వర వాదమున గల లోప మొక్కటే. పాపమును గూర్చి వివరణ మిందు లేకుండుటయే ఆ దోషము. ఈ వాదమునకు మత గౌరవము చేకూర కుండుటకు గల ప్రతిబంధక మిదియే. అన్ని మతములకు గల నిక్కమయిన ప్రతిబంధక మిదియే. అఖిలేశ్వరవాదము ప్రగతికి సాధనము కాదను నా క్షేపము ఇందలి రెండవ లోపము. కారణములు- అనంతవస్తువునకును, నశ్యమయిన వస్తువునకును భేదా భావమే ఇందలి సారాంశమగుట; తన్మూలమున నశ్య వస్తువు అనళ్య వస్తువును పెక్కు రీతులు పోలియుండుట ; అందుచేత నళ్య వస్తుసముదాయము అనంత వస్తువువలె పరిపూర్ణతను చెందవలసివచ్చుట - ఇందలి యుక్తి ఇది; నశ్య వస్తుసముదాయము సంపూర్ణమే యైనచో, పురో గతికై, లేదా ఆదర్శ సంపాదనమునకై ప్రయత్నము అనవసరమగును. పూర్వస్థితియే చాలును. కాబట్టి ఈ .