Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అక్బరు ప్రకటించి వారి రాజధానియగు చిత్తూరును ఆక్ర మించెను. మీవాడ్ రాణా ఉదయసింహుడు అక్బరునకు లొంగక ఉదయపూరునందు స్వతంత్ర ప్రభుత్వమును స్థాపించెను. అతని కుమారుడగు ప్రతాపసింహుడును, అనంతర మాతని కుమారుడగు అమరసింహుడును మీవాడ్ స్వాతంత్ర్య పోరాటమును సాగించిరి. అక్బరుకూడ వారి స్వాతంత్ర్య దీక్ష నభినందించి వారియందు ఉ వహించెను. రత్నభోరు, బికనీరు, జైసల్మీరు, కలంజరు మున్నగు వనపుత్ర సంస్థాన ప్రభువులు అక్బరునకు సామంతులయిరి. ఈ లోగా గుజరాతు, బెంగాలు, ఒరిస్సాలుకూడ అక్బరు సామ్రా జ్యమున చేర్చబడినవి. అక్బరు రసపుత్రుల తోడి యుద్ధములందు నిమగ్నుడయి యున్న సమయమున కాబూలును పాలించుచున్న అక్బరు సవతి తమ్ముడు మీర్జాహకీము ఢిల్లీ సింహాసన మాక్రమింపవలెనను దుర్బు ద్ధితో పంజాబుపై దండెత్తి వచ్చెను. హకీము యుద్ధమున నోడి పాదాక్రాంతుడగుటచే జాలిదలచి అక్బరాతని రాజ్య మును ఇచ్చివేసెను. క్రీ. శ. 1585 లో హకీము మరణా లో నంతరము కాబూలు మొగలు సామ్రాజ్యమున కలుప బడెను. తరువాత నీ చక్రవర్తి కాశ్మీరము, బెలూచి స్థానము, సింధురాష్ట్రమును స్వాధీనపరచుకొని వాయవ్య సరిహద్దులు నివసించు అనాగరిక కొండజాతులను తన యేలుబడిలోనికి తెచ్చి, వారు మొగలు సామ్రాజ్య శాంతి భద్రతలకు భంగము కలిగించకుండ కట్టుదిట్టములు చేసెను. ఉత్తర హిందూస్థానమును ఆక్రమించినపిమ్మట అక్బరు దక్షిణాపథము పై దృష్టిని మరలించెను. క్రీ. శ. 1598 లో చాందుబీబీనుండి అహమదునగరరాజ్యమును, 1801 లో ఫౌండేషును జయించి వశపరచుకొనేను. 1801లో భాం డేషు నందు దుర్భేద్యమగు అసీర్ ఘరు దుర్గమును ముట్టడించు చుండ, సలీము రాకుమారుడు తిరుగుబాటోనర్చి రాజ కుటుంబమునందు అశాంతికి కారకుడయ్యెను. ఈ అశాం తియే అక్బరు ఆశయపూర్తికి ఆటంకమాయెను. పైన వివరించిన విజయపరంపరలలో హిమాలయముల నుండి అహమదునగరము వరకును, హిందూ కుష్ పర్వత ములనుండి బెంగాలు వరకును వ్యాపించిన సామ్రాజ్య మును అక్బరు వదునెన్మిది సుబాలుగా విభజించి సుస్థిర నుగు రాజ్యాంగ విధానమును ఏర్పరచెను. తోడరుమల్లు 72 సహాయమున పంట పొలములను మషాయితీ చేయించి పంట ననుసరించి మధ్యవర్తుల ప్రమేయము లేకుండ ప్రభుత్వోద్యోగుల ద్వారమున పన్నులు వసూలు చేయు పద్ధతిని అమలు జరి పెను. రైతులపయి పన్నుల భారము తగ్గించి వారి కనేక సౌకర్యములు కలుగచేసెను. నెల జీతములపయిన ఆధారపడిన మన్సబుదారులు ద్వారమున సైన్యమును బలపరచెను. అక్బరు దైవచింత గలవాడు. బాల్యము నుండియు హిందూ మహమ్మదీయ మతపై షమ్యములు ఆతనిని కలవర పెట్టుచుండెను. మతసమస్యను పరిష్కరించుటయు, హిందూ మహమ్మదీయులనుండి సమైక్య భారతజాతిని రూపొందించుటయును అక్బరు జీవితలక్ష్యములైనవి. ఈ లక్ష్యసాధనకయి ఫతేపూరు సిక్రీలో అక్బరు మత చర్చలు జరిపెను. నిరక్షరాస్యుడయిన అక్బరు వివిధ మతాచార్యుల వాదములను శ్రద్ధతో నాలకించి తుదకు అన్ని మతములందును సత్యము గలదను నిర్ణయమునకు వచ్చెను. పిదప సర్వమత సారమగు "దికా ఇ ఇలాహి” అను క్రొత్త మతమునకు ప్రవక్త యయ్యెను. వ్యక్తి స్వాతంత్ర్యము, పరమత సహనము మూలసూత్రములు. మతసహన విషయమున అక్బరు చిత్తశుద్ధి కిది చక్కని నిదర్శనము. ఈ మతమునందలి అక్బరనేక సంస్కరణములను ప్రవేశ పెట్టెను. తన సామ్రాజ్యమున ముస్లిము మతగురువుల ప్రత్యేకాధికార ములను తొలగించెను. నాణెములపయి గల ఇస్లాముచిహ్న ములను మాన్పించెను. మహమ్మదీయులలో గో మాంస భక్షణము, బహుభార్యాత్వము, బహిరంగ ప్రార్థనా సమావేశములను మాన్పించెను. హిందువులపై జిజియా మున్నగు పన్నులను తొలగించి వారికి ప్రభుత్వమున సమానహక్కుల నోస గెను. బాల్యవివాహము, సహగమ నము, నిర్బంధ వైధవ్యము మున్నగు హిందూ దురాచార ములను మాన్పుటకు ప్రయత్నించెను. అక్బరు నిరక్షరాస్యుడు. కాని, కవిత్వమునందును, వేదాంత చర్చలలోను సంగీత చిత్రలేఖనములయందును అతనికి గొప్ప అభిమానము. అతడు కవి పండిత గాయక కల్పతరువు. కవి, చరిత్రకారుడు, వేదాంతి. అక్బరునకు గురువులు ది ఇలాహికి వ్యాఖ్యావకారుడు అగు అబుల్