Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అసంఖ్యాకములగు తాళపత్ర గ్రంథములను అగ్నిలో వడ పై చిరి. అక్కన్న మాదన్నల శిరములను రోహీరులో నున్న షాఆలమునకు పంపిరి. అతడు వాటిని పోలాపురములో నున్న చక్రవర్తి కడకు పంపెను. ఆతడు గోలకొండ తనకు వళమయిన ప్లేభావించి సంతసించెను. ఆ శిరములను ఏనుగులచేత త్రొక్కించెను. వీరి మరణమునకు సుల్తాను అబుల్ హసన్ తానాషా మిక్కిలి దుఃఖంచెను. అక్కన్న మాదన్నలు పలు భాషలయందు అసమాన పాండిత్యము కలవారు, సనాతన ధర్మావలంబకులయి నను పురోగాములు, రాజకీయశాస్త్రకోవిదులు, అర్థశాస్త్ర ప్రవీణులు, కార్యదక్షులు, రాజభక్తి పరాయణులు, శిష్ట జన సంరక్షకులు, దుష్టజన భయంకరులు. మాదన్న ప్రపంచములోని మహామంత్రులతో సమానముగా నెన్న దగినవాడు. జ్యేష్ఠుడగు అక్కన్నయు అసామాన్యప్రతిభా శాలిగా పేరొం దేను. అక్కన్న పేష్కారుగను, దేశీయాంగ, రక్షణ, వాణిజ్య, నౌకా మంత్రిగను, పై న్యాధ్యడు.కు గను, రాయబారిగను, పెక్కు బాధ్యతాయుతములయిన పదవులను అత్యంత సామర్థ్యముతో నిర్వహించెను. అక్కన్న సాహసికుడు, యథార్థవాది, అరిభయంక రుడు, తమ్మునిలోనున్న సౌమ్యత ఈతనియందు కొంత లోపించి నట్లు కనపడును. కొ. భూ.రా. అక్బరు :- అక్బరు భారతదేశ సామ్రాజ్యము నేలిన మొగలాయి పాదుషాలలో నగ్రగణ్యుడు. విశ్వవిఖ్యాత కీర్తి నార్జించిన చక్రవర్తులలో నొకడు. అక్బరు తండ్రి హుమాయూను. తల్లి హమీదా బాను బేగం. అక్బరుఅమర్ కోటలో క్రీ.శ. 1542 నవంబరు 82వ తారీకున జన్మించెను. హుమాయూను మరణించినపుడు అక్బరు తన సంర క్షకుడగు బైరంఖానుతో పంజాబునందుండెను. నాటి కతనికి పదుమూడేండ్ల ప్రాయము. ఐనను, వెంటనే బైరం భాను అక్బరును చక్రవర్తిగా ప్రకటించెను. కాని దేశమున మొగలుల అధికారము నామమాత్రమై యుండెను. నలువైపులను సర్దారులు విజృంభించి స్వతంత్రులగు ఇది ఇట్లుండ హేము అను హైందవ వీరుడు ఢిల్లీ ఆగ్రాలను అక్రమించేను. చుండిరి 71 అక్బరు ఈ క్లిష్ట పరిస్థితులలో అక్బరు బైరంఖానుతో హేముపై నడచెను. పానిపట్టు క్షేత్రమున క్రీ. శ. 1558 లో జరిగిన ఘోరసంగ్రామమున హేము పరాజితు డయి వధింపబడెను. ఢిల్లీ, ఆగ్రాలు నాక్రమించి అక్బరు సింహాసన మధిష్ఠించెను. అక్బరు డాలుడగుటచే పరిపాలనా భారమును బైరం ఖాను వహించెను. బైరంఖాను సమర్థుడు, విశ్వాస పాత్రుడు, ప్రభుభక్తి పరాయణుడు. కాని దురహం కారి అగుటచే సర్దారులకు ఈతనిపై ద్వేషము జనించుట గమనించి క్రీ. శ. 1584 లో అక్బరు స్వయముగ పరిపాలనము సాగించుటకు నిర్ణయము చేసెను. అధికార వ్యామోహముతో బైరంఖాను ఒనర్చిన తిరుగుబాటు నణచి అక్బరాతనిని సగౌరవముగ మక్కా యాత్ర కంపెను. అక్బరు మహావీరుడు. గొప్పవిజేత. భారత దేశ మున నేకచ్ఛత్రాధిపత్యము నెలకొల్పుట ఆతని మహాశయము, సింహాసన మెక్కినది మొదలు 25 సంవత్సరములు నిర్విరామముగ విజయయాత్ర లొనర్చె ఆతడు నిర్మించిన మహాసామ్రాజ్యమునకు ప్రపంచమున లేదు. సాటి రాగలది సమ కాలిక సింహాసన మధిష్ఠించిన తరువాత కొలదికాలమున కే అజ్మీరు, గ్వాలియరు, జేన్పూరు, మాళవము, గోండు వనములు నాక్రమించి ఢిల్లీ పరిసరముల తన యధికారము నెదిరింపగల శత్రువర్గమును అక్బరు నిర్మూలించెను. రాజనీతి విశారదుడగు అక్బరు రసపుత్రుల మైత్రి మొగలాయి సామ్రాజ్య విస్తరణకును, సుస్థిరత్వమునకును అత్యవసరమని గుర్తించెను. నాటికి రాజపుత్రుల బలము కూడ క్షీణించినది. అందుచే సాధ్యమైనంతవరకు శాంతి యుతముగ తన సార్వభౌమత్వము వారిపయి విస్తరింప జేయుటయే అక్బరు సంకల్పము. 1562 లో జయ పురాధీశ్వరుడగు బీహారీమల్లు తన కుమార్తెను అక్బరున కిచ్చి వివాహమొనర్చెను. అతని కుమారుడగు భగవాన్ దాసును, మనుమడగు మాకాసింహుడును మొగలుల కొలువునందు ఉన్నత పదవులను బడసిరి. కాని, మీ వాడ్ రాజవంశము మాత్రము అక్బరును ప్రతిఘటించినది. క్రీ. శ. 1587 లో అక్బరు వారిపయి యుద్ధమును