Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అక్కన్న మాదన్నలు ఇగంతయు ఆత్మ రక్షణకొరకు మాదన్న చేయవలసివచ్చెను. కాని సార్వ భౌమ ప్రభుత్వమునకు కట్టవలసిన కప్పము యథాప్రకా రము మాదన్న చెల్లింపసాగెను. అంతియెగాదు. 1892 లో చక్రవర్తి దక్షిణాపథమునకు రాగా, మాదన్న పదునైదు ఏనుగులను, కొన్ని మణుగుల బంగారమును, కప్పమును బుర హా నుపుర ములోనున్న యాతనికి సత్కారపూర్వక ముగా బంపెను. అయినను అక్కన్న మాదన్నల యెడ క్రోధము విడనాడక ఔరంగ జేబు "జన్నారుదారానె దక్కన్ ఖాబిలె గర్దజదన్" (దక్షిణపు యజ్ఞోపవీత ధారులు అక్కన్న మాదన్న వధార్హులు.) అని తానాషా ప్రభువునకు వ్రాయుచుండెడి వాడు. మాదన్న ప్రతిభ అట్టిదిగా నుండెను. . ' మాదన్న పరిశ్రమలకు, వాణిజ్యములకు ఎక్కుడు ప్రోత్సాహమిచ్చెను. గోలకొండ వణిజులు ఓడలనిండ సరకుల నింపుకొని తూర్పు, పడమరలనున్న దూరదేశ ములకు పోయి, వ్యాపారము చేయుచుండిరి. ఆంగ్లే యులు, పరాసు వారు, సయాం చక్రవర్తిని ప్రోత్సహించి గోలకొండ పర్తక నౌకలను దోపిడి చేయించుచుండిరి. రెండుమూడు పర్యాయములు మాదన్న ఉపేక్షించెను. అయితే అది మాదన్న నీరసతగ నెంచి గోలకొండ వర్తకనావలను తరుచు కొల్లగొట్టసాగిరి. మాదన్న తన నౌకాలల సహాయముచే సయాం, ఆంగ్ల, పరాసులు సంయుక్త నౌకాబలమును 1886 ఉత్తరార్ధ మున నోడించి, తన వ్యాపారమును సురక్షితము చేసెను. మాదన్న భూనై న్యములనేగాక, సముద్ర సైన్యములను సహితము సంస్కరించి, సత్వసంపన్నములనుగా నొనర్చి యుంచెనని తెలియుచున్నది. దేశరక్షణ వ్యవస్థ:- దేశరక్షణ విషయములో మాదన్న అత్యంతము జాగరూకతను వహించి సువ్యవస్థగావించెను. భువనగిరి, ఓరుగల్లు, ఖమ్మముమెట్టు, కొండపల్లి, కొండ వీడు మొదలగు దుర్గములను వృద్ధిపరచెను. ప్రతి దుర్గము నందును ఉండు పండ్రెండువందల సైనికుల సంఖ్యను రెండు వేలకు పెంచెను. (1882). మన్సబుదారి పద్ధతి పైన జాగీరుదారులు కొంత సైన్యమును రాజునకు సహాయార్థము సిద్ధముచేసి యుంచెడివారు. కాని జాగీరు దారులతోనే యుద్ధము సంభవించినచో జాగీరు సైన్యము 70 జాగీరు వారి పక్షముననే మాదన్న ఈ విధానమును యుండునుగదా. అందుచే మార్చివై చెను. సైనిక నిర్మాణ వ్యవస్థయంతయు రాజాధీనముననే యుండు నపేర్పరచెను. దేశీయ, విదేశీయ సైనికుల జీతములందు గల హెచ్చుతగ్గులను మాదన్న సవరించెను. ఆశ్విక దళ మును, శతఘ్నీ దళమును విస్తృతపరచెను. సామ్రాజ్యపు ప్రబలసైన్యములను ఎనిమిదినెలలు పది రెండు దివసములు కాలూననీక అదలించిన దీ శతఘ్నీ దళమే. రాజ్య వ్యవస్థ : భూమ్యాదాయ, పరిపాలనాశాఖల సౌలభ్యముకొరకు మాదన్న దేశమును ఖండములు గను, ఖండములను సర్కారులుగను, సర్కారులను పరగణాలు గను విభజించెను. తెలంగాణ ఖండములో ఇరువది సర్కా రులును, రెండువందల ఇరువదినాలుగు పరగణాలును; కర్ణాటక ఖండములో ఇరువది రెండు సర్కారులును, మున్నూట పదునాలుగు పరగణాలును; ఆర్కాటు (తమిళ) ఖండమునందు పదునారు సర్కారులును, నూట పదునారు పరగణాలును ఉండెను. గోలకొండ రాజ్యము మూడు ఖండములు, ఏబది ఎనిమిది సర్కారులు, వందల ఏబదినాలుగు పరగణాలు కలదిగా నుండెను. ఆరు అక్కన్న మాదన్నల హత్య :- క్రీ. శ. 1885 అక్టో బరు నాటి సంధి ననుసరించి ఈ యన్నదమ్ములు పదభ్రష్టు అయి, కారాగారవానులయి యుండవలసి యుండెను. సుల్తాను దాని నమలుపరచలేదు. కాని ఆ సంధి నియమ ముల వలన మాదన్న విరోధులకు ధైర్యమెక్కువయినది. రాజాంతఃపురమునందును, వెలుపలను ఈ యన్నదమ్ము లను హత్యచేయుటకు కుట్రలు ప్రబలెను. 1688 మార్చి నెల తుది భాగమున ఒకనాటి రాత్రి మొదటి యామమున రాచకార్యములు ముగించుకొని, రాజాజ్ఞ గై కొని అక్కన్న మాదన్నలు ఇంటికి బోవుచున్న సమయమున కుట్రదారులు తటాలున వారిపైబడి కనుమూసి తెరచు నంతలో వారిని హత్య చేసిరి. విశేషముగ లంచముల కావరకే అంగరక్షకులు లోబడియుండుటచే ఈ హత్యా కాండ సునాయాసముగ జరిగిపోయినది. తరువాత హంతకులు నగరము పైబడి రుస్తుంరావును (పులిపల్లి, ఎంకన్న) రెండు వేల బ్రాహ్మణ కుటుంబములను సమూల ముగా హత్యగావించిరి. వారి యిండ్లను దగ్ధమొనర్చిరి.