Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మార్చిరి. దేశీయ వర్తకులను పీడింపసాగిరి. ప్రభుత్వ ఫర్మా నాలను నిర్లక్ష్యము చేయసాగిరి. స్వంత నాణెములను చలామణి చేయసాగిరి. న్యాయస్థానములను ఏర్పాటు చేసి ప్రభుత్వము నెరవసాగిరి. ఆంగ్లేయుల విధానము గోలకొండ ప్రభుత్వ వ్యాపారముపై దెబ్బతీయునదిగా నుండెను. అంత ప్రధాని మాదన్న ఆంగ్లేయుల అధికార విజృంభణమును అధికార దర్పముతో అణచి వేయుటకు కడ గెను. కర్ణాటక ములోని పరిస్థితులను చక్కదిద్దుటకు సమర్థులగు పాలకులు నియమింపబడిరి. వీరిలో అక్కన్న, లింగన్న లిద్దరు ఆంగ్లేయులకు కొరకరాని కొయ్యలయిరి. ఆంగ్లేయుల ఆటలు సాగవయ్యెను. మాదన్నను తమ కనుకూలునిగా చేసికొనుటకు ఆంగ్లేయులు పడరానిపాట్లు పడిరి. వారి ప్రయత్నము లన్నియు వ్యర్థమయ్యెను. దేశీయ ప్రభుత్వమునకు, దేశీయ వ్యాపారులకు ప్రాబల్య మునుచేకూర్చునట్టి మాదన్న యొక్క రాజనీతి ప్రయోగ విధానమునకు తట్టుకొనలేక ఆంగ్లేయులు గోలకొండ రాజ్యమందున్న తమ గిడ్డంగులను, నిర్మాణశాలలను ఎత్తివేసి, జింజీకి ప్రయాణమయిరి. దేశభద్రత, ఆర్థిక బలము, గౌరవము, వర్తకము, దేశీయవర్తకుల మర్యా దలు వృద్ధినొందెను. విదేశీయ విధానము :- మొగలులు దక్షిణ రాజ్యము లను జయించుటకు కడగి కొంతవరకు జయముపొందిరి. బీజపూరు గోలకొండ రాజ్యములకు ప్రమాదము కను చూపుమేరలోనికి వచ్చెను. బీజాపూరునందు రాజగు రెండవ అలీ ఆదిల్ షా మరణించెను (1872). అతని కుమారుడు పంచవర్ష ప్రాయుడు సికిందరు రాజయ్యెను. రాజ్యములో అంతఃకలహములు ప్రబలసాగెను. మాదన్న కల్పించుకొని నాయకప్రతినాయకుల మధ్య సంధిచేసెను. ఈ సంధి సూత్రముల ప్రకారము బీజపూరు రాజ్యమును గోలకొండ రాజ్యము రక్షించునట్లును, గోలకొండ రాజ్యపు విదేశాంగ నీతి ననుసరించి బీజాపూరు వర్తించు నట్లును, మాదన్న నిబంధించెను. బీజాపురము దర్బారు నందు గోలకొండ ప్రతినిధి నియుక్తుఁడయ్యెను. కాని సర్దారులు నాయకుడు “వకీల్ -ఉల్ -సుల్తనతు” అగు సిద్ధిమసూదు ఈ సంధిషరతులకు విరుద్ధముగ ప్రవ ర్తించెను, మాధన్న 'విధానమునకు విఘాతము కలిగినది. 69 అక్కన్న మాదన్నలు అయినను అతడు నిస్పృహ చెందక బీజాపురమందు గోల కొండ ప్రతినిధిగనున్న అక్కన్నను వాపసుపిలిపించు కొనెను. అయినను మొగలులు బీజాపూరుపై దండెత్తి నప్పుడు సికందరు యొక్క అభ్యర్థనమును పాటించి మాదన్న ప్రచండసైన్యమును పంపెను. ఈ సైనిక సహాయమువలన ఔరంగజేబు మాదన్న మీద క్రుద్ధు డయ్యెను. మహారాష్ట్రక క్తి ప్రళయ తాండవమునకు బలిగాకుండ గోలకొండ రాజ్యమును సంరక్షించుటకును, మొగలుల ఉపద్రవమునుండి కాపాడుటకును, దూర మాలోచించి మాదన్న అబుల్ హసన్ తానాషాకును, శివాజీకిని మైత్రి కుదిర్చెను. శివాజీ హైదరాబాదునకు విచ్చేసి ఒక సంధి పత్రముపై సంతకము చేసెను. ఈ సంధి షరతులప్రకారము మొగలులకు వ్యతిరేకముగ పరస్ప రము సహాయముచేసికొనుటకు నిశ్చయింపబడెను. నుశి క్షితులయి లతసంఖ్యాకులగు మహారాష్ట్ర సైనికులు గోలకొండ రక్షణమునకు లభించిరి. ఈ సంధి కారణముగా గోలకొండ రాజ్యమునకు శాంతిభద్రతలు చేకూ రెను. ఇది మాదన్న మంత్రి రాజనీతి చతురతకు పరాకాష్ఠయని చెప్ప వచ్చును. అయితే దీనివలన అలంఘీరునకు కోపము హెచ్చినది. ముసల్మానులిది దేశ ద్రోహముగా భావించిరి. విద్వేషపూరిత ప్రచారములు సాగెను. మాదన్న యున్నంతవరకు గోల కొండమీద తనయాటలు సాగవని ఔరంగ జేబునకు తోచెను. గోలకొండ సైన్యము సదాసంసిద్ధమై బలో పేతమై యుండెను. మొగలు సేనలు 1877 లో మాలేడునొద్ద గోలకొండ సేనల పరాక్రమమును చవిచూచెను. ఆ యుద్ధ మున సామ్రాజ్య సేనలు ఘోర పరాజయము పాలయ్యెను. ఇరువది మైళ్ళలో నున్న గుల్బ ర్గాను చేరుటకు మొగలు సేనలకు 12 దినములు పట్టెను !