Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అక్కన్న మాదన్నలు చుండెను. 1. వరహా 2. ఫనము, 3. నేవలము, 4. కాసు, 5. తార, 6. గవ్వ. వరహా శ్రీ అంగుళముల వెడల్పును, 52 గురిగింజల బరువును, 21 క్యారెట్ల వన్నెను కలిగియుండెను. ఇది విజయనగరపు నాణెము. మాదన్న చట్టబద్ధ మొనర్చినకొలత మానములో గజము, మూర ఉండెను. తులామానములో తులము, శేరు, వీసె, పుట్టి, ఉండెను. మంత్రిపదవి వహించినతోడనే మాదన్న రాజ్యమున పర్యటనము చేసియుండెనుగదా ! ఆ పర్యటనమువలన పరిపాలనా యంత్రమందలి దోషములు మాదన్నకు బాగుగ బోధపడెను. చీకులు, భోగలాలసులు, స్వార్థులు, అసమర్దులును అగు ఉన్నతోద్యోగులను తొలగించి, వారి స్థానములలో సమర్థులగు యువకులను నియ మించెను. ఇంతవరకు ఉన్నతాధికారులు తమస్థానము లకు బోవక పట్టణములందే యుండెడివారు. మాదన్న యీపద్ధతిని మాన్పించి అధికారులు తమతమ ప్రాంతము లందు వసించునట్లు కట్టడిచేసెను. అంతియేగాక, ప్రతి రెండు, మూడు సంవత్సరములకొకసారి అధికారులను మార్పుచేయు నాచారమును ప్రవేశ పెట్టెను. దీనివలన పరిపాలనా యంత్రాంగము పరిపుష్టమై, చైతన్యవంత మైనది. సిమ్రులను (రాష్ట్రములను), తరఫులను (మండలము లను) మరలనిర్మించి, వాటిపై విశ్వాసపాత్రులు, సమర్థు లును అగు యువకోద్యోగులను నియమించెను. వాపీ, కూపతటాకములు, రహదారులు, అన్నసత్రములు, ఉచిత విద్యా వైద్య ప్రసూతిశాలలు, ఏర్పాటు చేసెను. క్రొత్తగ జయింపబడిన కర్ణాటకమందు శాంతి నెల కొల్పెను. ఆ ప్రాంతమును “ఖిబ్లా పట్టి" యనియును, అచ్చటి నాయకులను అహ్నం అనియును పేర్కొ నెడు వారు. ఈ క్రొత్త పద్ధతులపై రెండు సంవత్సరములు పరిపాలన జరిగిన మీదట తన సంస్కరణ ఫలితములను పరిశీలించుటకై మాదన్న 1678 జనవరిలో మరల రాజయుక్తముగ మూడు నెలలు దేశసంచారము చేసి మార్చితుదకు గోలకొండకు ఏతెంచెను. ఉద్యోగములు, మన్సబులు, ఇతర ప్రత్యేకతలు కోలు పోయిన ఉన్నతాధికారులు, ఉమ్రావులు మున్నగువారు 68 1678 మధ్యలో తిరుగుబాటు చేసిరి. వీరికి గజపతి కుమారుడు నాయకత్వము వహించెను. అయితే రాజ వంశీయుడగు అప్పలరాజును మాదన్న తనకు వశంవదుని చేసికొని అతని సాయమున తిరుగుబాటుదారుల నడచి, శ్రీ శ్రీకాకుళము వరకు దేశమును మరల స్వాధీనపరచు కొ నెను. అప్పలరాజునకు "అప్పలపాయక రావు బహద్దరు " అను బిరుదును, అనేక జాగీరులను ఒసగెను. (పాయక రావనగా యుద్ధమున ముందుండు వాడని యర్థము.) యము ఆర్థికనీతి :- దేశములో శాంతి నెలకొల్పుట యందును, బీజాపురముతో, మొగలులతో జరిగిన ఒప్పందమును నేర వేర్చుటయందును, పాడుపడిన దుర్గములను బాగుచేయుట యందును, సైన్యమును బలిష్ఠము చేయుటయందును, పశ్చిమోత్తర సరిహద్దులను సురక్షిత మొనర్చుటయందును మాదన్న ధనము విశేషముగా వ్యయము చేసెను. ఆ దా సరిపడునదిగాకుండెను. అందుచే మాదన్న వ్యయము తగ్గించియు, పెద్ద జీతములు మన్సబులు తగ్గించియు, ఆయవ్యయములను సరిపుచ్చుటకు ప్రయ త్నించెను. ఈ మార్పులు జన సామాన్యపు శాంతజీవనము నకు ఎంతో దోహదము కలిగించెను. ప్రజలకు అగ్రహారీ కులనుండియు, అధికారులనుండియు ఎట్టి అలజడి కలుగ కుండ కట్టుదిట్టములు చేసెను. దేశము సస్యశ్యామల మయ్యెను. ప్రజలు సిరిసంపదలతో హాయిగ నుండిరి. ప్రభుత్వాదాయము వృద్ధిచెందెను. ఇట్టి ఘనవిజయము నకు సుల్తాను మిక్కిలి సంతోషించి మాదన్నకు “ఆలంపనాః” అను బిరుదును ప్రసాదిం చెను. క్రీ. శ. 1857 నాటి మీర్జుమ్లా తిరుగుబాటు వలనను, మొగలాయీల యుద్ధములవలనను రాజ్యములో అశాంతి ఏర్పడెను. ఆ కారణమున రాజ్యములోని వజ్రపు గనులు మూసి వేయబడెను. 1680 నుండి 1674 వరకు వజ్రాల గనులలో పనులు జరుగలేదు. మాదన్న ఆగనులను తెరపించి సక్రమముగా పనిచేయునట్లు ఏర్పాటుచేసెను. గనులలో పనిచేయు కూలివారికి అనుకూలముగనుండునట్లు భృతినిర్ణయములు గావించెను. తిరిగి గోలకొండ రాజ్యము యథాప్రకారము "రత్న కోశము" గా ప్రసిద్ధి చెందెను. ప్రసిద్ధిచెం దేశీయ విధానము :- ఆంగ్లేయులు జబర్దస్తీగా వ్యవహ రింప మొదలిడిరి. తమ గిడ్డంగులను సైనిక స్థావరములుగా