Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాదన్న పరిపాలనమును కొన్ని ముఖ్య శాఖలుగ విభజింపవచ్చును. 1. ఆంతరంగిక శాఖ, 2. దేశీయశాఖ, లి. అంతర్జాతీయశాఖ, 4. రక్షణశాఖ, 5. సైన్యసంస్క రణశాఖ, 8. భూసంస్కరణశాఖ. 1. ఆంతరంగిక విధానము :- పెక్కు సంస్కరణలు ప్రవేశ పెట్టి పరిపాలనా యంత్రమును నిర్దుష్ట మొనరించి, వివిధ శాఖలుగా విభజించెను. కేంద్ర, ప్రాంతీయ, గ్రామ పరిపాలనములను వేర్వేరు చేసెను. కేంద్రములో రాజు, ప్రధాని, విదేశీయాంగ మంత్రి, దేశీయమంత్రి, ముజ్ములేదారు, బషీఉల్ మూమిలిక్, సరే ఖేల్, దారోగాయే ఆజం, సదరుఖాజీ, దబీరు, మహే ల్దారు. మంత్రివర్గముగ నేర్పడెను. ప్రాంతీయ పరిపాలనా వర్గమున తరల్దారు, దివాను, సరేఖేల్, ఖాజీ, పండితులు ఉండిరి. కాని సర్కారు, సిమ్లు, పరగణా, మహల్, పాలకవర్గము గూడ దాదాపు ఈ విధముగనే యుండెను. అచ్చటి పై న్యాధిపతులు వరుసగ పౌరులనియు, హవ ల్దారులనియును, న్యాయాధికారులు "ఖాతిబు” లనియు పిలువబడెడువారు. మాదన్నకు ముందు వీరికి జాగీరు లుండెను. వీరికి జీతములు ఏర్పాటుచేసి మాదన్న వారలను విధేయులుగను, రాజ భక్త్యధికులుగను కావించి, నీరసులుగు నొనర్చెను. గ్రామపరిపాలన :- పట్వారీ, మాలీపటేలు, కొత్వాలీ పటేలు, శేఖు సనదు, పురోహితుడు, వీరు పాలక వర్గ ముగా నేర్పడిరి. వీరికి జీతములుగాక మాన్యము లుండెను. పరిపాలన :- మాదన్నకు పూర్వము దేశమున కొక రాజ్యాంగము, ప్రజలకు భద్రత లేకుండెను. దేశము సార వంతమయ్యును, సుభిక్షము గాకుండెను. మీరు మొదలు బంట్రోతువరకు అందరును బాహాటముగనే లంచములు అడిగి వుచ్చుకొనెడివారు. మిర్జామహ్మదు సయీదు, మహమ్మదు అమీను, సయ్యదు ముజప్ఫరు అను వారలు మీర్జుమ్లాలుగా నున్నపుడు సైతము ప్రజలకు ఈ గోడు తప్పలేదు. మాదన్నకు పూర్వము దేశములోని "తరఫు”” లు మొదలుకొని గ్రామముల వరకు అన్నియు వార్షికము 67 అక్కన్న మాదన్నలు అందుచేత అస్థిరత, లకు వేలము వేయబడుచుండినవి. అందుచేత అవిశ్వాసము దారిద్ర్యము బాగుగ పాడుకొనిపోయినవి. ఇజారాదారుల దౌర్జన్య క్రౌర్యములకు తాళజాలక గ్రామ ములకు గ్రామములే మనుష్యరహితములైనవి. ముల్లా లకు, బ్రాహ్మణులకు అనేక గ్రామములు మాన్యములుగ నీయబడుచుండెడివి. ఈ కారణముల వలన ప్రభుత్వము భూమ్యాదాయ విషయమున విపరీతముగ నష్టపడినది. అడవులు నరకి క్రొత్త గ్రామములు నిర్మించుట, పాడు పడిన గ్రామముల పునరావాస మొనర్చుట, అగ్రహార ములు, మాన్యములు మున్నగువాటి నుండియు స్పల్ప మొత్తములు శిస్తుల రూపమున రాబట్టుట అను మూడు పద్ధతులను అవలంబించి మాదన్న గొడ్డుబోయిన భూమ్యా దాయమును కామధేనువుగ నొనర్చెను. వ్యవసాయము, తోటలు అభివృద్ధిపరచి వాటి ఫలసాయమును సరసమగు ధరలకు విక్రయించు వ్యవస్థ చేసెను. ఈస్టిండియా కంపె నీతో జరిగిన సుదీర్ఘ సంఘర్షణము ఇందులకొక నిదర్శ నము, గ్రామములను వేలము వేయు పద్ధతులను మాన్పించి గ్రామాధికారులను మాదన్న నియమించెను. దేవాలయ పోషణము కొరకును, పురోహితుడు, వడ్రంగి, కురుమ, కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, దాసరి, తంబళి, సర్రావ్, పట్వారి, పటేలు, షేఖుననది, వెట్టి, మాదిగ మున్నగు పనివారల జీవనము కొరకును మాన్యము లీయబడెను. చోరుల బాధలు అరికట్టబడెను. శాంతిభద్ర తలు నెలకొల్పబడెను. ప్రభుత్వపు అయోమయ స్థితివలన మూసివేయబడిన విఖ్యాతములగు వజ్రపుగనులను మాదన్న మరల తెర పించెను. భూసముద్ర వ్యాపారములను అభివృద్ధిపరచెను. రేపు సుంకముల ద్వారమునను విశేషాదాయము వచ్చు నట్లు చేసెను. సయాంతో జరిగిన నౌకా యుద్ధము సముద్ర వ్యాపార రక్షణకు జరిగినదే. మందుగుండు, నేత, అద్దకము, శిల్పము, చిత్రలేఖనము మున్నగు ననేక ముఖ్యపరిశ్రమలను అభివృద్ధిపరచెను. ఆ నాణేముల ముద్రణాధికారము ఇంతవరకు ఇతరులు కీయబడియుండెను. మాదన్న ఆ పద్దతిని రద్దుపరచి ప్రభు త్వపు టంకసాలలో నాణెములు ముద్రించు నేర్పాటు చేసెను. ఈ క్రింద బేర్కొనిన నాణెములు సిద్ధమగు