Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అక్కన్న మాదన్నలు భానుజయ్యపంతులు తనకొమరులకు యుక్త వయస్సున ఉపనయనములు చేసెను. ఆ దినములలో అవసరములుగా అక్కన్న నుండిన పారసీ, హింది, సంస్కృ తము, ఆంధ్రము మున్నగు భాషలను వారికి చెప్పించెను. వివాహానంతరము అక్షన్న మాదన్నలు ఉద్యోగము కొరకు రాజధానియ గు హైదరాబాదునకు ఏతెంచిరి. అప్పుడు వీరి వయస్సు ఇరు వది రెండు, ఇరువది సంవత్సరములు ఉండవచ్చును. కొంత ప్రయత్న ఫలిత ముగా మీర్జామహమ్మదు సయీదు మీర్జున్లూ నొద్ద స్వల్ప వేతనములపై ఇద్దరును ఉద్యోగములలో కుదిరిరి (1860). వీరు క్రమముగా తమ ధీ విశేషముచేతను, పరిశ్రమ వలనను ఒక్కొక మెట్టెక్కుచు పైకివచ్చిరి. అవిరళ క్రీ. శ. 1858 లో మీర్జున్లూ చేసిన తిరుగుబాటులో ఈ అన్నదమ్ములు పాల్గొనలేదు. అందుచే భూమ్యాదాయ శాఖలోని వారి పదవులట్లే యుండెను. తరువాత మరి పది సంవత్సరములు కష్టించి పనిచేయుచురాగా వీరిరు వురిలో ఎక్కుడు ధీశాలియగు మాదన్న గోలకొండ సర్వ సై న్యాధ్యక్షుడగు “బడీ - ఉల్ ముమాలిక్ " కడ వేష్కా రుగ ప్రతిష్ఠితు డయ్యెను (1886). అప్పటినుండి భూమ్యాదాయశాఖ క్రీ.శ. 1678 వరకు ఈ అన్న దమ్ముల పర్యవేక్షణలోనే ఉండెను. ఉద్యోగములో ప్రవేశించినప్పటినుండి క్రీ. శ. 1878 తుదివరకు రమా రమి 25 సంవత్సరములు గోలకొండ భూమ్యాదాయ శాఖ వీరి ఆధీనములో నుండెను. క్రీ. శ. 1874 వ సంవత్సరపు విప్లవానంతరము మీర్జుమ్లా యగు సయ్యదు ముజష్ఫరు పతనమొం దేను. · 1674 జూన్లో లో మాదన్న గోలకొండ ప్రధాని ( మీర్జుమ్లా ) గ నియుక్తుడయ్యెను. సుల్తాన్ అబుల్ 66 హసిన్ తానాషా అతనికి "సూర్యప్రకాశరావు" అను బిరుదు, ఏనుగు, గుఱ్ఱము, కత్తి, నగారా, రాజాంబర ములు ప్రసాదించెను. అక్కన్న పేష్కారు పదవియందు ప్రతిష్ఠితుడయ్యెను. మాదన్న తమ్ముడగు విశ్వనాథుడు హనుమకొండ "ఆమిలు" గను, మేనల్లుండ్రలో నొకడగు ఎంకన్న దండనాయకుడుగను నియమితు లై 8. మాదన్నను ప్రధానిగ నెన్నుకొనుటలో సుల్తాను 3 సూత్రములను దృష్టియందుంచుకొనినట్లు అగపడుచున్నది. (1) మాదన్న బుద్ధివిశేషము ఆతనికి తనయెడ గల భక్తివిశ్వాసములు. (2) తన వంశ్యులగు ఉమ్రావులకు, సర్దారులకు మంత్రిత్వ మొసగినచో వారు తనయెడ భ క్తి వినయ విశ్వాసములను జూపరు. (8) మతోన్మాదము గల ఔరంగజేబునకు ముస్లి ములు వశ్యులగుదురు. మాదన్న ప్రధానియగునప్పటికి గోలకొండ రాజ్యపు కోస్తా శ్రీకాకుళమునుండి చెంగల్పట్టువరకు 480 మైళ్ళు వ్యాపించి యుండెను. ప్రధానియైన తదుపరి మాదన్న దేశములో శాంతిభద్రతలు నెలకొల్పుటలో నాలుగు నెలలు గడిపెను. ఆపై నవంబరునుండి డిసెంబరు తుది వరకు రెండు నెలలు రాజుతోగూడి రాజ్యమంతయు తిరిగి 1675 జనవరిలో రాజధానికి మరలవచ్చెను. గోలకొండ చరిత్రలో ఈ విధముగ రాజును, ప్రధానియు, ఊరూరు తిరిగి ప్రజల బాగో గులు వి చారించుట అపూర్వ మగు విశే షము. ప్రతి స్థలము నందును, ముఖ్యముగ మచిలీపట్టణ మందును వీరికి ఘనమగు సత్కా రము జరిగెను, ప్రధాని యగునాటికి మాదన్న వయస్సు రమారమి మా ద న్న 52 సంవత్సరములు ఉండియుండును.