Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రాహ్మణులకు స్వామి కల్యాణమున ప్రముఖస్థాన మేర్పడి నది. వారు వచ్చి స్వామి రథముమీద సురటులు వీచినగాని రథము కదలదట. స్వామికి నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవాదులు జరుగును. ఈ సముద్రతీర ప్రాంతమును మొదట పరాసు వారాక్రమింపగా 1758వ సంవత్సరమున పరాసులు నోడించి ఆంగ్లేయు లాక్రమించుకొనిరి. దేశమంతయు నొక నిర్ణీత ప్రభుత్వము క్రింద లేదు. పెద్దాపురము సంస్థా నపు రాజులగు వత్సవాయి వారి ప్రదేశమునకు ప్రభువు లయిరి. పెద్దాపురపు రాజులు సుమారు వేయి ఎకరముల భూమి నృసింహస్వామి వారికిచ్చిరి. స్వామి వారికి లక్షయు ముప్పది వేల రూపాయల విలువగల జవాహరీ నిర్మింప బడెను. సంస్థానపు మర్యాదలనుబట్టి స్వామి వారికి నగారావాద్యములు, పవళింపు సేవలు మొదలయినవి జరుగుచుండెడివి. 1844 లో పెద్దాపురపు కోట ఆంగ్లే యుల వశమాయెను. అందుచే నాటినుండి ఆ రాజ్యపు సామంతులగు మొగలితుఱ్ఱు సంస్థానపు రాజులు, కలిదిండి వంశస్థులు, ఈ ఆలయములకు ధర్మకర్తలై కల్యాణోత్స వాదులు జరిపించుచున్నారు. నేడీ ఆలయ పరిపాలన ప్రభుత్వపు ధర్మాదాయ దేవాదాయసంస్థచేతిలో నున్నది. వా. రా. బ్ర. అక్కన్న మాదన్నలు: అక్కన్న మాదన్న లిద్దరు అచ్చపుటాంధ్రపుత్రులు. అయినను వీరు సేడంకాపురస్థు అక్కన్న మాదన్నలు లగు కులకర్ణివంశపు కన్నడ బ్రాహ్మణులనియును, మహా రాష్ట్రులనియును, శివాజీ ప్రధాని యగు మోరోపంతు పింగళే యొక్క దాయాదులనియును కొంత ప్రచార మున్నది. ఈ వాదమును సమకాలికులగు ఏ చారిత్రకులచేతను చెప్పబడలేదు. చారిత్రక నిదర్శనములు గాని, స్థల పురాణములు గాని ఈ వాదమునకు బల మొసంగుటలేదు. వీరి పింగలివంళము, ఆ పింగళేవంశము పేరు. ఋషులు వేరు. వీరు ఆంధ్రులనుట చారిత్రక సత్యము. అయితే, ఎచ్చటివారో నిష్కర్షగా చెప్పుటకు వీలుపడదు. ప్రస్తుతము అందుబాటులోనున్న చారిత్రక సాధనములను బట్టి వీరు భానుజయ్య, భాగ్యమ్మల సంతా నము. భానుజయ్య హనుమకొండలో 'ఆమిలు' నొద్ద పనిజేయు పని జేయు ప్రభుత్వోద్యోగి. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమా ర్తెలు కలిగినారు. కొడుకుల పేర్లు వరుసగా అక్కన్న, మాదన్న, విస్సన్న ( విశ్వ నాథుడు), మల్లన్న ( మృత్యుంజయుడు ). ఆడపిల్లల పేర్లు తెలియుట లేదు. అయినను వీరి సంతానముగ కంచర్ల గోపన్న (రామదాసు), పొదిలి లింగన్న, పులిపల్లి ఎంకన్న రుస్తుంరావు) అనువారు కలరు. అక్కన్నకు "మల్లు" అను కొడుకును, పేరు తెలియని ఒక కూతురును ఉండిరి. మాదన్నకు మల్లన్న యను కుమారుడును, పేరు తెలియని ఒక కుమార్తెయు ఉండిరి. మూడుతరముల వంశవృక్ష మీ క్రింద ఈయబడినది : భానుజయ్య - భాగ్యమ్మ అక్కన్న మాదన్న విస్సన్న మల్లన్న మల్లు కూతురు a మల్లన్న కూతురు 65 కూతురు ర కూతురు కంచర్ల గోపన్న పొదిలి లింగన్న పులిపల్లి ఎంకన్న (రామదాసు)