అంతర్వేది
వసిష్ఠుని యనంతరము నృసింహ విగ్రహమొక పుట్టలో నణగియుండెను. కలియుగమున కేశవదాసను గొల్లవాడు తన కపిలగోవు ప్రతిదినమును ఆపుట్టమీద తనపొదుగు పాలు విడుచుచుండుట చూచి అట త్రవ్వింపగా స్వామి విగ్రహము దొరికెను. దానికతడు దారువులతో ఆలయము నిర్మించి పూజాదికము లారంభించెను. స్వామి పెక్కు మహిమలు చూపెను. స్వామివారి అర్చాదులు నిర్వహించుటకు కేశవదాసు కొన్ని భూములను దానముచేసెను. కేశవదాసు నిర్మించిన కొయ్య గుడిస్తంభములు చక్కని శిల్పపు చెక్కడపు పనితనముతో నొప్పుచు, ఉక్కుస్తంభములవలె గట్టిగనున్నవి. ఈ దార్వాలయపు స్తంభములును ప్రస్తుతపు శివాలయము ప్రక్కను భద్రపరుపబడి స్వామివారి పాకశాలగా నేర్పడియున్నది. కేశవదాసు పాలెమను గ్రామము నేటికిని అంతర్వేదికి సమీపమున నున్నది. కేశవదాస నిర్మిత దార్వాలయము శిథిలావస్థకు రాగా బెండమూర్లంక కాపురస్థులును, అగ్నికుల క్షత్రియులును అగు కొపనాతి ఆదినారాయణగారు జీర్ణాలయోద్ధరణమునకు పూనుకొనిరి. ఇసుకతప్ప ఏ రాయియు దొరకని, యీ దూరసముద్ర ప్రాంతమునకు మహాలయ
నిర్మాణమునకు గావలసిన శిలాస్తంభములును, రాళ్లును గొనిరాబడుట వింత. ఆదినారాయణ కొడుకు కృష్ణమ్మ.
వీరు ఓడవర్తకము చేయుచుండిరి. ఆనాడు బెండమూర్లంక నుండి ఓడల మూలమున, బట్టలు మొదలగునవి సరకుల
వర్తకము విదేశములతో జరుగుచుండెను. పోయినవను కొన్న ఓడలు నృసింహస్వామి యనుగ్రహమున విశేష ధనసంపదతో తిరిగిరాగా కృష్ణమ్మగారు, తండ్రి సంకల్పించిన ఆలయ మండపాదుల నిర్మాణము పూర్తిగావించిరి. ఈపని శాలివాహన శకము 1745 వ. సంవత్సరమునకు సరియయిన క్రీ. శ. 1823 న ముగిసినట్లు ఆలయపు గోడమీద నొక శిలాశాసనమున్నది.
గర్భాలయముననున్న స్వామి విగ్రహము పశ్చిమ ముఖముగానుండును. గర్భాలయమునకు నెదుట దానికి జేరి బలమైన మండపములున్నవి. నృసింహాలయమునకు కుడిప్రక్కను రామాలయమున్నది. ఈయాలయ మండపములందు గాఢాంధకారము నెలకొనియున్నను సాయంకాలమున పడమటనస్తమించు సూర్యుని కిరణములు స్వామి విగ్రహ వక్షస్థలమున ప్రసరించి బంగరుకాంతులతో వెల్గులీనుట రమ్యముగ నుండును. ఆ సొగసు ఆలయనిర్మాణమునందే గలదు. స్వామి ఆలయమున కెడమ నైపున కల్యాణ మండపమున్నది. దీనికి చుట్టును నాల్గువైపులను మండపమున్నది. పశ్చిమ ద్వారముమీది గోపురముకాక, పది చుట్టుకోవెల లున్నవి. నృసింహస్వామి చుట్టును రాజలక్ష్మి తాయారు, వెంకటేశ్వరస్వామి, భూదేవి తాయారు, శ్రీరంగనాయకస్వామి, సంతాన గోపాలస్వామి, కేశవస్వామి, పన్నిద్దరాళ్వారులు, ఆంజనేయస్వామి, శ్రీరాములవారు, గోవాలస్వామియు గలరు. వీరందరును సన్నిధి దేవతలు. మండపములమీది విమా నములు కొన్ని గుండ్రముగను, కొన్ని కూచిగను ఉండును. నీలకం ఠేశ్వరస్వామి వారి కొక రెడ్డి ప్రభువు ఆలయము కట్టించెను. అది శిథిలము కాగా, దుడ్డు బాబయ్యగారను పేరూరు వాస్తవ్యులును, ఆత్మూరి చినతాతయ్య యను నరసాపురపు ఓడ వర్తకులును జీర్ణాలయోద్ధారము గావించిరి. ఈ యాలయము నేడు శిథిలమగుచున్నది.
ప్రతి సంవత్సరమును మాఘ శుద్ధ దశమినాడు నృసింహస్వామి కల్యాణము జరుగును. ఏకాదశినాడు రథోత్సవమున స్వామి రథము గుఱ్ఱాలక్క గుడివరకు పోవును. వేలకొలది యాత్రికులు భీష్మైకాదశి మొదలు పూర్ణిమ వరకును ఉదయములందు సాగర సంగమ స్నానము గావించి పాపక్షయము నొందుదురు. ద్వాదశితో కూడిన ఆదివారమున సముద్ర స్నానము పుణ్య ప్రదము. త్రయోదశినాటి రక్తకుల్యాస్నానము పీడాహరము. చతుర్దశినాడు చోరోత్సవము. పూర్ణిమనాడు స్వామి చక్రతీర్థస్నానముకొరకు సముద్రమున కేగును. ఆ స్థలమున స్వామివారు నిలుచుటకు కట్టబడిన మండపము చక్కగనున్నది. పూర్వ మీ ప్రాంతము. గోల్కొండ నవాబు పాలనలో నుండగా క్రీ. శ. 1582 సంవత్సర మున స్వామివారి చక్రము సముద్రములో కొట్టుకొని పోయెనట. ఎంత వెదకించినను చక్రము దొరకలేదు. అంత పేరూరు ద్రావిడ బ్రాహ్మణు లగు అంతర్వేది చయనులుగారు పదునొకం డహోరాత్రములు మంత్ర జపము చేయగా సముద్రుడు చక్రమును బ్రాహ్మణుని పాదములకడ జేర్చెనట. నాటినుండియు పేరూరి