Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్జాతీయ సంస్థలు ఇది స్పష్టము చేయుచున్నది. ఇదిగాక అగ్రరాజ్యము లై దును ఐకమత్యముగల పై ఒక త్రాటిమీద నడిచినప్పుడే భద్రతాసంఘము ఏపనినైనను చేయగలదనికూడ దీని నుండి స్పష్టమగుచున్నది. అట్టి ఐకమత్యము కుదిరిన పను లను మాత్రమే తల పెట్టుట యుక్తమను భావముతో ఈ సంఘనిర్మాణము జరిగెను. రాజ్యములమధ్య సంభవించు వివాదములను గుర్తించుట, వివాదములు యుద్ధములకు దారితీయకుండ చూచుట, యుద్ధములు సంభవించినపుడు ఉభయ పక్షముల వారితో సంప్రదించి శాంతిని స్థాపించుట. దురాక్రమణ యుద్ధములలో దిగిన రాజ్యము లను శిక్షించుట, ఇదంతయు భద్రతా సంఘము చేయవలసిన పనులు. కాని గత పది సంవత్సరములనుండి సోవియట్ రషియా యునై టెడ్ స్టేట్సులమధ్య విపరీతమగు వైరు ధ్యమేర్పడిన కారణమున భద్రతాసంఘము కార్యనిర్వ హణసంఘ మగుటకు బదులు, గొప్ప వాద ప్రతివాద రంగముగ మారిపోయెను. 3. ఆర్థికసాంఘిక సంఘము:- ప్రపంచమందు కొన్ని రాజ్యములు ఆర్థిక సాంఘిక రంగములందు వృద్ధిగాంచు నట్టివిగను, కొన్ని వెనుకబడినట్టివిగను ఉన్నవి. ఈ తరతమ భేదములు తగ్గుటకు కావలసిన చర్యలను సంస్కరణములను సూచించుటకును, వెనుక బడిన దేశములలోని దారిద్ర్యమును తొలగించుటకును, అన్ని రంగములలో పురోభివృద్ధి మార్గ ములను సూచించుటకును ఆర్థికసాంఘికసంఘము స్థాపింప బడెను. ఇందు పదు నెనిమిది రాజ్యములకు సభ్యత్వమున్నది. సమితిలో సభ్యత్వముగల రాజ్యములన్నియు ఈసంఘమున కెన్ను కొనబడుటకు అర్హులు. ఏ పదునెనిమిది రాజ్యములను ఎన్నుకొనవలెనో నిర్ణయించు అధికారము మహాసభది. సభ్యత్వ కాలపరిమితి మూడుసంవత్సరములు. ఆర్థికాభి వృద్ధి, నిరుద్యోగనిర్మూలము, రవాణా సౌకర్యములు, మానవుల ప్రాధమిక హక్కులు, సంఘమందు స్త్రీలకుండ వలసిన “గౌరవము, మత్తుపదార్ధముల నిషేధము, జన సంఖ్యసమస్యలు మొదలగు వివిధ విషయములనుగురించి ఈ ఆర్థిక సాంఘిక సంఘము అనేక పరిశోధనలనుగావించి, అభ్యుదయకరము అగు సూచనలను చేయు చున్నది. 4. ధర్మకర్తృత్వ సంఘము ఇదివరకు వలసలుగ (Colonies) నుండిన ప్రాంతము అనేకములు రెండవ 62 ప్రపంచ యుద్ధానంతరము స్వతంత్రరాజ్యములుగ మారి నను ఇప్పటికికూడ పరాయి ప్రభుత్వమునకు లోబడిన ప్రాంతము లనేకము లున్నవి. ఆప్రాంతములలోని ప్రజలు వెనుకబడినవా రనియు ఇప్పటికిప్పుడే రాజకీయముగ ఆ స్వరాజ్యము ననుభవించుట కర్హులు కారనియు అందుచేత కొంతకాలము వరకు ప్రాంతములలో పరాయి ప్రభు త్వము ఉండుట తప్పదన్న అభిప్రాయమొకటి ఉన్నది. కాని వానిని పాలించు పరాయి ప్రభుత్వముల వారు స్వలాభపరులుగాక పాలితుల శ్రేయస్సుకై పాటుపడు నట్లు చేయుట ఐక్యరాజ్యసమితి కర్తవ్యములలో నొకటి యని సమితి నిర్మాతలు అంగీకరించి, ఉద్దేశము నెర వేరుటకు గాను ధర్మకర్తృత్వసంఘమును స్థాపించిరి. ఇందు భద్రతాసంఘములోని శాశ్వత సభ్యులు, వలస ప్రాంతము ల పాలించు రాజ్య ము ల ప్రతినిధులు, సమితిమహాసభ ఎన్నుకొన్న మరికొందరు ప్రతినిధులు ఉన్నారు. సభ్యులలో సగముఖాగము వలసలను పాలించు రాజ్యముల ప్రతినిధులుగను, తక్కిన సగము ఇతరులుగను ఉండవలెనను ప్రాతిపదిక పై ధర్మకర్తృత్వ సంఘ నిర్మాణము గావింపబడెను. ఇది ఏపేట రెండు పర్యాయములు సమావేశమై, వలసల పరి పాలనముగురించి పరిపాలకులు సమర్పించిన నివేదికలను చర్చించి, ప్రజలకు అన్యాయము జరుగకుండుటకును, శీఘ్ర కాలమున వారికి స్వరాజ్యార్హత లభించుటకును కావలసిన సూచనలను చేయుచుండును. 5. ఉద్యోగవర్గము :- ప్రతిరాజ్యముయొక్క పరిపా లనమునకు నిపుణుల తో, కూడిన ఉద్యోగవర్గమున్నట్లు సమితి వ్యవహారములను జరుపుటకుకూడ ఒక ఉద్యోగ వర్గము (Secretariat) ఉన్నది. వీరందరిపై పెత్తనము వహించువాడు సమితి ప్రధాన కార్యదర్శి (Secretary General). ఉద్యోగులు సమితిలో సభ్యత్వముగల వివిధ రాజ్యముల పౌరులు; ఏ ఒక్క రాజ్యమునకు సంబంధిం చినవారు కారు. 6. అంతర్జాతీయ న్యాయస్థానము:- అంతర్జాతీయన్యాయ స్థానమందు పదునై దుగురు న్యాయాధీశులున్నారు. వీరిని భద్రతా సంఘము, మహాసభ కలసి నియమించుచున్నవి. వీరి ఉద్యోగకాలము తొమ్మిది సంవత్సరములు. వివాద