Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంతర్జాతీయ సంస్థలు


సంఘర్షణములకును కారణములైన దారిద్య్రము, జాత్యహంకారము, మొదలగువానిని తొలగించుట, ఎట్టి వివక్షత లేక మానవులందరకు - (స్త్రీలకు, పురుషులకు ప్రాధమిక హక్కులను సమకూర్చుట, మానవకల్యాణమునకు సమస్తవిధముల తోడ్పడుట - ఇవియే సమితి యొక్క ఆశయములు.

ఇవి నెరవేరుటకు ప్రపంచములోని రాజ్యము లన్నిటి యొక్క సహకార మవసరము. దీనిని గ్రహించి 1945 లో 51 రాజ్యములు కలిసి సమితిని స్థాపించెను. ప్రపంచములోని తక్కిన రాజ్యములకుకూడ సభ్యత్వమును లభింప జేయుటకు సమితి మూల శాసనములో (Charter) కొన్నిసూత్రములు చేర్చబడెను. శాంతిని కాంక్షించు నట్టియు సమితి సభ్యత్వ విధులను నిర్వహించుట కిష్టపడునట్టియు, సమర్థత కలిగినట్టియు రాజ్యములు సభ్యత్వము పొందవచ్చును. దరఖాస్తు పెట్టికొనిన రాజ్యమునకు ఇట్టి అర్హతలు ఉండునదీ, లేనిదీ మొదలు భద్రతా సంఘము పరిశీలించును. అర్హతయున్నట్లు అది అభిప్రాయపడిన యెడల దాని నాధారము చేసికొని మహాసభ (General Assembly) దరఖాస్తును మంజూరు చేయును. భద్రతాసంఘము యొక్క ఆమోదములేక మహాజన సభ ఏ రాజ్యమునకుగాని సభ్యత్వము కల్పించుటకు వీలులేదు. 1945 తర్వాత ఇరువదియైదు రాజ్యములు సమితిలో కొత్తగ చేరగలిగెను.

సమితి వ్యవహారములను జరుపుటకు (1) మహాసభ(General Assembly), (2) భద్రతాసంఘము (Security Council), (3) ఆర్థిక సాంఘిక సంఘము (Economic and Social Council), (4) ధర్మకర్తృత్వ సంఘము (Trustee-ship Council), (5) ఉద్యోగవర్గము (Secretariat), (6) అంతర్జాతీయ న్యాయస్థానము అను ఆరు అంగము లున్నవి.

1. మహాసభ :- సమితిలో సభ్యత్వముగల ఒక్కొక్క రాజ్యము మహాసభకు అయిదుగురు ప్రతినిధులను పంపవచ్చును. కాని ఒక్కొక్క రాజ్యమునకు ఓటు (Vote) ఒకటే. కార్యనిర్వహణమునకై మహాసభ ఏటేట ఒక అధ్యక్షుని, ఏడుగురు ఉపాధ్యక్షులను, ఆరు కమిటీలను తప్పక ఎన్నుకొనును. ఇవిగాక మరికొన్ని కమిటీలుగూడ నున్నవి. మహాసభ అధమపక్షము సంవత్సరమునకొక పర్యాయమైన సమావేశము కావలసియున్నది. అంతర్జాతీయములగు రాజకీయ, ఆర్థిక, సాంఘిక విషయముల నన్నిటినిగురించి (కొన్ని స్వల్పమినహాయింపులకు లోబడి) మహాసభ ఆలోచించి, శిఫార్సు రూపములైన తీర్మానముల గావింపవచ్చును. భద్రతాసంఘముతో భాగస్వామియై ఇది సమితి ప్రధాన కార్యదర్శిని, అంతర్జాతీయ న్యాయస్థాన న్యాయాధీశులను ఎన్నుకోనుచున్నది. ఇదిగాక భద్రతా సంఘపు తాత్కాలిక సభ్యులను, ఆర్థిక సాంఘిక సంఘ సభ్యులను, ధర్మకర్తృత్వ సంఘములోని సభ్యులలో కొందరిని ఇది ఎన్నుకొనును. సమితి జమాఖర్చుల నిర్ణయము దీనిదే. సమితియొక్క తక్కిన అంగములు సమర్పించు నివేదికలను విమర్శించి సూచనలుచేయు అధికారము దీని కున్నది. ఇందులో జరుగు ప్రధానమైన. తీర్మానములు హాజరై ఓటింగు చేయువారిలో మూడింట రెండువంతుల సభ్యుల ఆమోదమును పొందవలెను. మహాసభ ఒక విధమైన పర్యవేక్షణసంఘ మని చెప్ప తగియున్నది.

2. భద్రతా సంఘము :- భద్రతాసంఘము సమితి యొక్క కార్యనిర్వాహకశాఖ. ఇందులో ఐదుగురు శాశ్వత సభ్యులు, ఆర్గురు తాత్కాలిక సభ్యులు- మొత్తము పదునొకండుగురు సభ్యులు ఉన్నారు. అగ్రరాజ్యములని పేరుగాంచిన సోవియట్ రషియా, యునైటెడ్ స్టేట్సు, బ్రిటన్, ఫ్రాన్సు, చైనాలది శాశ్వత సభ్యత్వము. తాత్కాలిక సభ్యులను రెండేండ్ల కాలపరిమితితో మహాసభ ఎన్నుకొనుచున్నది. భద్రతాసంఘమును గురించి గుర్తించ దగిన గొప్ప విశేషము అగ్ర రాజ్యములకు గల అడ్డుపెట్టు (Veto- వీటో) అధికారము. కార్యక్రమమునకు సంబంధించిన (Procedural) విషయములుగాక తక్కిన విషయములను గురించిన తీర్మానము లన్నిటికి అధమపథము మొత్తము సభ్యులలో ఏడ్గురి ఆమోదమును, ఆ ఏడ్గురిలో శాశ్వత సభ్యు లందరి ఆమోదమును ఉండవలెను. తీర్మానమును పదిమంది సభ్యు అంగీకరించినను అగ్రరాజ్య సభ్యుడొక్కడు ఆమోదించక అడ్డుతగిలిన యెడల అది వీగిపోవలసినదే. సమితి వ్యవహారములను నడుపుటలో అగ్రరాజ్యములను కాదని ఏపని చేయుటకు, వీలులేదని