పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

అష్పాఖుల్లా ఖాన్‌ ఆరోజు చెప్పిన మాటలు ఆయన మహోన్నత త్యాగనిరతికి, మాతృభూమి పట్ల ఆయనకు గల అపార ప్రేమాభిమానాలకు, లక్ష్యం పట్ల ఉన్న నిబద్దతకు నిర్భీతికి, లక్ష్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేయడానికి సిద్ధమైన తీరుకు, ఆయనలోని ధైర్యసాహసాలకు సజీవ చిహ్నాలుగా నిలుస్తాయి.

ఉరిశిక్ష అమలుకు ముందురోజున, అంటే 1927 డిసెంబరు 18వ తేదీన, జైలులో అష్పాఖ్‌ను చూసిన సర్దార్‌ భగత్‌సింగ్ ఆరోజున అష్పాఖ్‌ ఎలా ఉన్నాడన్నవిష యాన్ని, ఈ స్వచ్ఛంద కవి. ఆశ్చర్యంలో ముంచే ఉల్లాసంతో ఉరికంబమెక్కాడు. ఎంతో అందగాడు, మంచి ఒడ్డుపొడుగూ ఉన్న యువకుడు. చాలా బలిష్టంగా ఉండేవాడు. జైలులో కొద్దిగా చిక్కాడు. చిక్కిపోడానికి కారణం దిగులు కాదని, దేవుని స్మరించుకుంటూ శాంతిగా ఉండడానికి ఆహారం చాలా తక్కువ తీసుకోవడమే కారణమని జైలులో కలిసినప్పుడు చెప్పాడు. ఉరితీయడానికి ఒకరోజు ముందు ఆయనను కలిశాను. ఆయన బాగా ముస్తాబు అయి ఉన్నాడు. పాపిటతీసి దువ్విన పొడవాటి వెంట్రుకలు ఎంతో అందంగా ఉన్నాయి. ఎంతో హుషారుగా నవ్వుతూ, తుళ్ళుతూ మాట్లాడాడు. ' రేపు నా పెళ్ళి ' అని అన్నాడని భగత్‌సింగ్ తెలిపారు. (జ్ఞాపకం చేసుకోండి..: పేజి 40) ఆ పెళ్ళిరోజు రానే వచ్చింది. '.. నా పెళ్ళి చేయాలని మా వాళ్లెంతో ప్రయత్నించారు. నాకు నచ్చిన వదువు దొరకక చేసుకోలేదు. ఇన్నాళ్ళకు ఇదిగో నాకు నచ్చిన వదువు దొరికింది, అంటూ అష్పాక్‌ ఉరిశిక్షను వదువుతో పోల్చారు. (బిస్మిల్‌ ఆత్మకథ: పేజి 152).

అష్పాఖుల్లా మృత్యువు సముఖంలో ప్రదర్శించిన ధర్య సాహాసాలను శ్రీ రాంప్రసాద్‌ బిస్మిల్‌ తన ఆత్మకధలో ప్రశంసిస్తూ, నాకిప్పుడు కొంతైనా తృప్తి ఉందంటే ఆదంతా ఈ ప్రపంచంలో నా పేరు ప్రతిషల్ని నీవు సముజ్వలం గావించావనే. ' అష్పాఖుల్లా విప్లవోద్య మంలో పాల్గొన్నాడు. తోబుట్టువులు, బందుమిత్రులు ఎంతగా వారించినా అతడు ఏ మాత్రం లెక్క చేయలేదు. ఆరెస్టయిన పిదప కూడా తన భావాలను వదులుకోకుండా సుదాృఢంగా నిలిచారు.' అనే సంగతి భారతదశ చరిత్రలో ఎంతో ఉలేఖనీయమై పోయింది., అని పేర్కొన్నారు. (పేజి: 123).

ఈ సందార్భంగా బిస్మిల్‌ అల్లిన కవిత ఈ విధంగా సాగుతుంది. 'మరణిస్తారు ఆన్యాయంగా బిస్మిల్‌, రోషన్‌, లాహిరి, అష్పాఖ్‌ - నేల యీనినట్టు పుట్టుకొస్తారు- మా నెత్తురు ధారలనుండి వందలాది యోధులు' (మరతే 'బిస్మిల్‌ ', 'రోషన్‌', 'లహరీ', 'అష్‌ఫాఖ్‌' అత్యాచార్‌ సే-హోంగే పైదా సైకడో ఉన్‌కే రుధిర్‌ కి ధార్‌ సే)

65