పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆ సందర్భంగా, అష్పాఖ్‌ న్యాయవాది శ్రీ కృపాశంకర్‌ హజేలాను దగ్గరకు పిలిచి, హజేలా సాబ్‌, వీళ్ళందర్ని మీ వెంట ఎందుకు తీసుకొచ్చారు? ఇది రోదించాల్సిన సమయమా? సంతోషించాల్సిన సమయమా?....నా భారతదేశపు రాజ్యాధికారాన్ని ఆంగ్లేయుల నుండి లాక్కోడానికి నేను కుట్రపన్నానని నా మీద విచారణ సాగింది. ఈ లక్ష్యం ప్రాణాలను పణంగా పెట్టి సాధించాల్సింది కాదా? అటువంటప్పుడు ఈ ఏడ్పులు పెడబొబ్బలేంటి? వీరి తమ్ముడు లేక చిన్నాన్నదేశం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఉరివేదిక నెక్కనున్నందుకు వీళ్లంతా సంతోషించాలి. హిందూ సమాజం నుండి శ్రీ ఖుదీరాం, శ్రీ కనహ్య్యలాల్‌ లాంటి మహనీయులు మాతృదేశం కోసం తన ప్రాణాలను బలిప్టిెన విషయం వీళ్లకు తెలపండి. ముస్లిం సమాజం నుండి, విప్లవకారుల మీద మోపిన ఇటువింటి కుట్ర కేసులో ఉరివేదిక ఎక్కి ప్రాణాలను అర్పించనున్న తొలి ముస్లింని నేనేనని గర్విస్తున్నానని, అష్పాఖ్‌ అన్నారు.( Sudhir Vidhyardhi:Page.88)

ఈ మాటలు వింటూనే న్యాయవాది శ్రీ హజాలే విచలితుడయ్యారు. ఉబికి వస్తున్నదు:ఖాన్ని ఆణిచి పెట్టుకుంటూ, మీ చివరి కోరిక ఏంటీ ? అని అష్పాఖ్‌ను ఆయన అడిగారు. ఆ మాటకు నవ్వుతూ, ఆ నాకొక చివరి కోరిక ఉంది. మీరు పూర్తి చేయగలిగితే...ఎల్లుండి నన్ను ఉరివేదిక నెక్కిస్తారు. మీరు చూస్తు ఉండిపొండి నేను ఏ విధంగా ఉరిని స్వీకరిస్తానో, అన్నారు. ఆ పని మాత్రం నేను చేయలేనంటూ న్యాయవాది హజేలా కంటతడి పెట్టగా, ఆయన బంధువులకు దు:ఖం కట్టలు తెంచుకుంది.

ప్రముఖ రచయిత శ్రీ శాంతిమోయ్‌ రే తన పుస్తకం ఫ్రీడమ్‌ మూవ్‌మెంట్ అండ్‌ ఇండియన్‌ ముస్లిమ్స్‌ లో ఆరోజున అష్పాఖుల్లా ఖాన్‌ నోట వెలువడిన మాటలను ఆంగ్లంలో ఈ విధంగా గ్రంథస్థం చేశారు.

“...If I am not allowed to observe the last ceremony of the noblest ordeal with all dignity and steadiness then the sanctity of the occasion will be tarnished. Today I feel myself worthy of honour with the hope that a sacred and great responsibility for the liberation of motherland has been entrusted to me. You should feel happy and proud that one of yours is fortunate enough to offer his life. You must remember that the Hindu community has dedicated great souls like Khudiram and Kanailal. To me this is a good fortune that belonging to Muslim Community I have acquired the privilege of following the footsteps of those great martyrs...” (Freedom Movement and Indian Muslims, Santimoy Ray, PPH, New Delhi, 1983, Page. 43)

64