పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ప్రజా చైతన్యం మాత్రమే సమస్యలకు పరిష్కారం

మాతృదేశం కోసం ప్రాణత్యాగానికి సిద్దపడిన అష్పాఖ్‌ తన అనుభవాల ఆధారంగా యావత్తు ప్రజలను చైతన్యవంతులను చేసి, భారతదేశం మొత్తం మీద విప్లవ జ్వాలలను ప్రజ్వరిల్ల చేయాలనుకున్నారు. ఈ విషయాలను జైలు నుంచి రాసిన చివరి లేఖలో ఈ విధాంగా పేర్కొన్నారు.

భారత రంగస్థలంపైన మా పాత్రను మేము నిర్వహించాము. మేము తప్పులు కాని ఒప్పులు కానీ ఏమి చేసనా స్వాతంత్య్రం సంపాదించాలనే భావనతో ప్రేరితులమయ్యే చేశాం. మా అయిన వాళ్ళు (కాంగ్రెస్‌ నేతలు) మమ్మల్ని పొగిడినా, నిందించినా, ఏదేమైనా మా శతృవులకు కూడా మా ధైర్యసాహసాలను పొగడక తప్పలేదు. మేము దేశంలో భయోత్పాతాలు సృష్టిస్తున్నామని కొందరు అంటున్నారు. అది సరికాదాు. ఇన్ని రోజులుగా కేసు నడుస్తూ ఉంది. మాలో చాలా మంది ఎంతో కాలం నిర్భంధంలో లేరు. ఇప్పుడు కూడ కొందరు బయట ఉన్నారు. అయినా మేము కాని, మా సహచరులు కాని మాకు కీడు చేసిన వారెవరిపైనా తుపాకి పేల్చలేదు. మా ఉద్దేశ్యం అది కాదు. మేము స్వాతంత్య్రం సంపాదించేందుకు దేశం మొత్తంలో విప్లవం తీసుకురావాలని అనుకున్నాము.

మా కేసు విచారించిన జడ్జీలు మమ్మల్ని క్రూరులు, బర్బరులు, మానవత్వంపై కళంకం వంటివారు అని ఎన్నో విశేషణాలతో ప్రస్తావించారు. మన పరిపాలకుల జాతివాడే అయిన జనరల్‌ డయ్యర్‌ నిరాయుధులైన పిల్లలు, ముసలివాళ్ళు, స్రీపురుషులు అందరి మీద తుపాకి గుండ్ల వర్షం కురిపించాడు. న్యాయం యొక్క గుత్తదారులు తమ ఈ ఆత్మీయుడిని ఏ విశేషణాలతో సంబోధించారు? అలాంటప్పుడు మా పట్లనే ఇలా పక్షపాతంతో వ్యవహరించడం ఎందుకు?, అని స్పష్టంగా ప్రబుత్వాన్ని, న్యాయమూర్తులను ప్రశ్నించారు. (జ్ఞాపకం చేసుకోండి.. ó పేజి 41)

అష్పాఖ్‌ ప్రకటించిన అభిప్రాయాన్నేబిస్మిల్‌ కూడ తన ఆత్మకథ చివర్లో, భారత ప్రజల్లో అధిక సంఖ్యాకులు మంచి విద్యావంతులు కానంతవరకు ఉచితానుచితాలేమిటో వాళ్ళకు బోధపడడం జరగనంతవరకు, మీరు పొరబాటున కూడా ఏ విధమైన విప్లవకర కుట్రలలో పాల్గొనకండి. దేశసేవ చేయాలనే కోరిక ఉంటే బహిరంగ ఉద్యమాల ద్వారా యధాశక్తి పనిచేయండి. లేని పక్షంలో మీ బలిదానాలు నిరుపయోగమవుతాయి. ఇతర విధాలుగానైతే యింతకంటే హెచ్చుగా దేశసేవ చేయవచ్చు. అందువల్ల ఉపయోగం

66