పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

పండించేందుకు మతస్తుల మధ్యన మాత్రమేకాదు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మత సంస్థలు అన్న్కూడా ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఐక్యతకు భూమికగా మాతృభూమి విముక్తి కోసం అన్నివర్గాలు ఆంగ్లేయుల మీద పోరుసల్పాలని, ఉవ్వెత్తున ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మనలోని అనెక్య త మూలంగా మనం పరాయిపాలకులకు బానిసలవుతున్నామని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మనల్ని అంతమొందిస్తున్నది ఎవ్వరో కాదు మనలోని అనైక్యత మాత్రమే మనల్ని అంతం చేస్తున్నది, అని ప్రకటించారు. మనవాళ్ళే మన అంతానికి కారణమøతున్నారనే భావంతో ఆంగ్లేయుడూ కాదు, జర్మనీవాడు కాదు, రష్యన్‌ కాదు, టర్కీవాడు కాదాు, మనల్ని అంతం చేస్తున్నవాళ్ళు మన హిందూస్థానీయులే అని అన్నారు. ఈ మేరకు తాత్విక భావనలను కూడా వ్యక్తం చేస్తూ, ప్రార్థనలు-పిటిషన్ల సంస్కతి ఇక వద్దన్నారు. ఆవేశపు పొంగులు గల ప్రజలు తనను చిత్రహంసలు పెడుతున్న వాడ్ని దేశం బయటిదాకా తరిమి తరిమి కొడతారని ఆయన ఆకాంక్షించారు. ఈ విషయమై ఆయన రాసిన ఉర్దూ కవితకు తెలుగు తర్జుమా క్రింది విధంగా సాగింది.

వాడు కాదు తెల్లవాడు, వాడు కాదు అంతకన్న జర్మని వాడు - రష్యా వాడు కానేకాదు, కాడు వాడు టర్కీవాడు - హిందూస్తానీయుడు తలారి వాడు- నన్ను చంపువాడు నేడు - పాపం! మురిసిపోతున్నారులా ఉంది నన్ను నాశనం చేసేశామని-వారు ఎవర్నయితే నాశనం చేసేశామని భావిస్తున్నారో - గ్రహించనే లేదు అసలు రహస్యం వారు - నాశనం చేయకుండానే నశించిపోయేవాణ్ణినేను - మరి లక్షసార్లు ప్రయత్నం దేనికి ? - వద్దు వద్దు 'విన్నపాలు' ! వద్దు వద్దు 'విన్నపాలు' ! - వుంటే గింటే ఆవేశపు పొంగు దేశ జనం గుండెల్లో - తరిమి తరిమి కొడ్తారు దేశం బయటిదాకా - నేడు నన్ను చిత్ర హింసల పాలుజేస్తున్నవాణ్ణి ! (ఉర్దూ మూలం: అష్పాఖుల్లా ఖాన్‌, తెలుగు సేత : నాజిర్‌, ప్రజాసాహితి మాసపత్రిక, డిసెంబరు 2000.)

ఆది నుండి శ్రమజీవుల పక్షపాతి

భారత స్వాతంత్రోద్యమంలో కార్మిక-కర్షక జనుల ప్రాతినిధ్యం అత్యవసరమని అష్పాఖ్‌ భావించారు. చిన్నతనం నుండి తమ జమీందారి కుటుంబీకులు ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరించారు. శ్రమజీవులైన కార్మికులు - కర్షకులు పడుతున్నవెతలు తీరాలని ఆరాటపడ్డారు. ఈ రుగ్మతలకు పరాయిపాలన కారణమని భావించారు. అందువలన వలస పాలనకు స్వస్తి పలకాలన్నారు. భారతదేశ సౌభాగ్యం శ్రమజీవుల

34