పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

అష్పాఖ్‌ చివరి క్షణం వరకు హిందూ-ముస్లింల మధ్య ఐక్యతను ఆకాంక్షించారు. ఆ దిశగా కృషి చేశారు. ఆయనకు విధించిన ఉరిశిక్ష మరో మూడు రోజులలో అమలవుతుందనగా, 1927 డిసెంబరు 16వ తేదీన పెజాబాద్‌ జెలు నుండి దేశవాసులను ఉద్దేశిస్తూ ఒక లేఖ రాసారు.

ఆ లేఖలో, భారతదశ సోదరులారా మీరు ఏ మతానికి, సంప్రదాయానికి చెందిన వారైనా సరే, దేశసేవలో కృషిచేయండి. వృధాగా పరస్పరం కలహించకండి. అన్ని పనులూ ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు సాధనాలు. అలాంటప్పుడు ఈ వ్యర్ధపు కొట్లాటలూ, కుమ్ములాటలు ఎందుకు? ఐకమత్యంతో దేశంలోని దొరతనాన్నిఎదిరించండి. దేశాన్ని స్వతంత్రం చేయండి...చివరగా అందరికి నా సలాం. భారతదేశం స్వతంత్రమగుగాక. నా సోదరులు సుఖంగా ఉందురు గాక, అంటూ ఆ చారిత్రకమైన లేఖను అష్పాఖుల్లా ఖాన్‌ ముగించారు. (జ్ఞాపకం ఉంచుకోండి ఎప్పుడైనా...(అమర వీరుల ఉత్తరాలు), అనువాదం : జె. లక్ష్మీరెడి,భారత ప్రబుత్వం ప్రచురణలు, న్యూ డిలీ,్ల 19980 పేజి.43).

ఆనాడు అష్పాఖుల్లా ఖాన్‌ భిన్నమతస్థుల మధ్య సమైక్యత, సద్భావన, సహిష్ణుత ను ప్రగాఢంగా వాంచించారు. ఈ ఐక్యత ద్వారా మాత్రమే పరాయిపాలనకు చరమగీతం పాడగలమని ఆయన భావించారు.ఈ అభిప్రాయంలో ఆనాడు ఆయన పలికిన అజరామరమైన మాటలను ఈనాటి పరిస్థితులకు కూడా మనం అంవయించుకోవచ్చు.

హిందూ-ముస్లింల మధ్య న ప్రగాఢమైన ఐక్యతను కాంక్షించిన అష్పాఖుల్లా జీవిత చరమాంకం వరకు ఆ దిశగా కృషి చేస్తూ, ఐక్యతకు, స్నేహబంధానికి, పటిష్టమైన లౌకిక వ్యవస్థకు ప్రతీకగా నిలచారు. ఆ కారణంగా ప్రముఖ విప్లవ కారుడు శ్రీ మన్మధనాథ గుప్త, బిస్మిల్‌ అత్మ కథకు ముందుమాట రాస్తూ, రాంప్రసాద్‌, అష్పాఖ్‌ల ప్రగాఢ మైత్రిపాత తరహా లౌకికవాదపు అత్యున్నత దశ అని చెప్ప వచ్చు, అని పేర్కొన్నారు.

(బిస్మిల్‌ ఆత్మకథ: పేజి.iv)

ఐక్య పోరాటాలకు అద్వీతీయ ప్రాధాన్యత

స్వేచ్ఛా భారతావనిని కాంక్షించిన అష్పాఖుల్లా ఐక్యతను భంగపర్చే ప్రతి అంశం పట్ల అత్యంత శ్రద్ధ చూపారు. ప్రతి చిన్నవిషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని, ఆ సమస్యలను ప్రజల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. జైలు గోడల మధ్య నుండి ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తూ కూడా ఆయన భవ్యభారతం కోసం కలలు కన్నారు. ఆ కలలను

33