పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

మీద ఆధారపడి ఉందన్నారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం శ్రమజీవులకు దక్కడం లేదని ఆవేదన చెందారు. ఈ దుర్భర పరిస్థితులకు పాలకవర్గాలు, పాలకవర్గాల తొత్తులైన జమీందారులు, ఆ జమీందారుల ప్రతినిదులు కారణమన్నారు. జమీందారులను పంట భూముల్లోకి రప్పంచాలని, వారిచేత సేద్యం చేయించాలన్నారు. ఈ విషయాలను అష్పాఖ్‌ చాలా స్పష్టంగా వివరించారు.

అష్పాఖ్‌ తన ప్రగతిశీల అభిప్రాయాలకు సక్రమమైన రీతిలో అక్షర రూపం ఇవ్వలేకపోయారు. అంతటి సమయం ఆయనకు లేకపోయింది. ఆయన రాసిన లేఖలు, డైరీలు మాత్రమే కొంత వరకు ఆయన ఆలోచనలను వెల్లడిస్తున్నాయి. ఆయన రాసిన లేఖలన్నీకూడాడ అందాుబాటులోకి రాలేదు. ఆయన అన్నగారింట దొంగలు పడి సొత్తు, సామాగ్రితో పాటుగా అష్పాఖ్‌ రాసిన లేఖలను కూడాఎత్తుకుపోయారు. ఈ దొంగతనం వలన అమూల్యమైన ఆయన లేఖలు చరిత్రకు అందకుండా పోయాయి. ఈ కారణంగా ఆయనను సమగ్రంగా అధ్యయనం చేయ డానికి చరిత్రకారులకు వీలులేకుండా పోయింది.

శ్రమజీవుల పరిస్థితులను వివరిస్తూ, పేదరైతుల, దు;ఖితులైన కార్మికుల స్థితిగతుల పట్ల నా హృదయం ఎల్లప్పుడూ ఆవేదనకు గురవుతుంది. ఈ వర్గాల దుర్భర జీవితాలను చాలా సమీపంనుండి గమనించాను. నాకు సాధ్యం అయ్యేట్టయితే ప్రపం చంలోని సకల సౌకర్యాలను వారికి అందచేయాలని నా మనస్సు కోరుకుంటుంది. మన పట్టణాలలోని సౌభాగ్యం వీరి శ్రమ వలన వచ్చి చేరుతోంది. మన కర్మాగారాలు వీరి వలన నడుస్తున్నాయి. మన కుళాయిలలో మంచినీళ్ళు కూడా వీరి వలన మాత్రమే లభిస్తున్నాయి. మనం అనుభవిస్తున్న అన్నిసౌకర్యాలు ఈ వర్గాల శ్రమ వలన మాత్రమే దక్కుతున్నాయి.

పేదరైతు వర్షంలో తడుస్తూ, మండుటెండలో మాడుతూ మన కోసం ఆహార ధాన్యాలను పండిస్తున్నాడు. పండించిన ధాన్యంలో రైతుకు, తన శ్రమతో తయారు చేసన సరుకులో కార్మికునికి సరైన వాటాలభించడం లేదన్నది వాస్తవం. ఈ పరిస్థితులకు పాలకవర్గాలు, జమీందారులు, వారిప్రతినిదులు కారణమవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటీ?

ఆ ప్రబువులను, జమీందారులను, ఏజెంట్లను కార్మిక, కర్షక జనుల పరిస్థితులను తెలుసుకునే స్థితికి తీసుకురావాలి. జమీందారులు తమ జమీన్‌ను వదులుకుని రైతుల్లాగే పొలాల్లో పంటలు పండించే పరిస్థితి కలుగచేయాలి. మనం కర్మాగారాలలో స్థానం సంపాదించి కార్మికులకు వారి స్థితిగతులను తెలియచేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపోందించాలి. మీరు గ్రాండ్‌మాస్టర్‌ ఆఫ్‌ రష్యా, కేథరిన్‌ జీవిత చరిత్ర చదవండి.

35