పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

బిస్మిల్‌ - అష్పాఖ్‌ల స్నేహం

ఉత్తర భారతదేశంలో ఆనాడు వివిధ శక్తుల, వ్యక్తుల ప్రభావం వలన హిందూ -ముస్లింల మధ్యసత్సంబంధాలు లేవు. హిందూ, మస్లింల మధ్య జరుగుతున్న వివాదాలు సామరస్య వాతావరణాన్ని చెడగొట్టాయి. ఆ సమయంలో బిస్మిల్‌ - అష్పాఖ్‌ల మధ్య ఏర్పడిన స్నేహం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.

అష్పాఖ్‌ ఇస్లాం ధర్మానురక్తుడు. ఇస్లాం ఆదేశాలను తు.చ. తప్పక పాటించే నిష్టాగరిష్టుడైన ధార్మికుడు. పండిత బిస్మిల్‌ క్రియాశీలక అర్యసమాజీకుడు. సనాతన ధర్మపరాయణుడు. హిందూ మతం నుండి ఇతర మతాల్లోకి వెళ్ళిన వారిని శుద్ధి కార్యక్రమం ద్వారా తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించే కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్న వ్యక్తి. మత ధర్మాలను బట్టి ఎవరికి వారు సనాతనులుగా పరిగణించబడే వ్యకులు వారిద్దరు . అటువంటి వ్యక్తుల మధ్య ఏర్పడిన స్నేహబంధం చాలా చర్చనీయాంశ మైంది.

ఈ స్నేహబంధం ఆనాడు ఎంత సంచలనం సృషించిందో, ఈ యోధుల గురించి బందుమిత్రులు ఏమనుకున్నారో బిస్మిల్‌ తన ఆత్మకథలో ఈ విధంగా చెప్పుకున్నారు.

అష్పాఖ్‌తో బిస్మిల్‌

19