పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఒక పచ్చి ఆర్యసమాజికునికి, ఒక ముస్లిముకు మధ్య యిలా స్నేహం ఎలా కలిసింది? అని అంతా ముక్కుపై వేలేసుకునేవాళ్ళు. నేను ముహమ్మదీయులను శుద్ధి (హిందువులుగా మార్పిడి) చేస్తుండేవాడిని. ఆర్యసమాజ మందిరంలోనే నా నివాసం ఉండేది. కాని నీవీ విషయాలను వేటినీ కించిత్తయినా లేక్కచేయలేదు. నీవు ముహమ్మదీయుడివి కావడం చేత నా మిత్రులు కొందరు నిన్నుతిరస్కారభావంతో చూస్తుండేవారు. కానీ నీవు ధృఢనిశ్చయంతో నిలిచావు. నన్ను కలుసుకోవడానికి నీవు ఆర్యసమాజ మందిరానికి వచ్చిపోతుండేవాడివి. హిందూ-ముస్లింల కలహాలు చెలరగినప్పుడు మీ పేటలో అందరూ నిన్ను బాహటంగా దూషించేవారు. కానీ నీ వెప్పుడూ వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించలేదు.(బిస్మిల్‌ ఆత్మకధా, పేజి.105-106)

ఆర్య సమాజికుడైన బిస్మిల్‌తో స్నేహం వద్దని అష్పాక్‌ మీద ఆయన కుటుంబీకులు, సన్నిహిత మిత్రులు చాలా ఒత్తిడి తెచ్చారు. అష్పాఖ్‌ మాత్రం బిస్మిల్‌ స్నేహాన్ని వదలుకోలేదు. ప్రతిరోజు బిస్మిల్‌తో కలిసి ఎక్కువ సమయం ఆయనతో గడుపుతూ, బ్రిటిషు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రజలు పడుతున్నపాట్లు, స్వేచ్ఛా-స్వాతంత్య్రం కోసం సాగుతున్న రహస్య ఉద్యమాలు, పోరాటాల పరిణామాలు తదితర పలు విషయాల మీద చర్చలు జరిపేవారు. స్వేచ్ఛా-స్వాతంత్య్రాలు అను మహత్తర లక్ష్యాల సాధనకు కంకణం కట్టుకున్న ఆ యోధులు తాము అనుసరించాల్సిన నూతన పదకాల రూపకల్పన గురించి ఆలోచనలు సాగించారు.

ఈ ఇరువురు యోధుల మధ్య మాతృదేశ విముక్తి లక్ష్యమే ప్రధాన బంధమని సన్నిహితులు, బంధువులు అర్థం చేసుకోలేకపోయారు. ఆ స్నేహ సంబంధాల స్వభావం తెలియక అష్పాఖ్‌ కుటుంబీకులు మరీ కంగారు పడ్డారు. ఆయనెక్కడ మతం వదలి, శుద్ధి చేయించుకుని హిందువైపోతాడో అని భయపడ్డారు. బిస్మిల్‌తో స్నేహాన్ని మానుకోవాల్సిందిగా పట్టుబట్టారు. ఒకసారి అనారోగ్యం వలన అష్పాఖ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. బంధువులు, మిత్రులు కంగారు పడసాగారు. ఆ స్థితిలో కూడా ప్రతిరోజు కలుసుకుని, ఎక్కువ కాలం గడిపే మిత్రుడు బిస్మిల్‌ను అష్పాక్‌ కలవరించ సాగాడు. ఆ కలవరింపుతో ఆయన తన కుటుంబీకులలో కలకలం సృష్టించారు.

ఈ విషయాన్ని బిస్మిల్‌ వివరిస్తూ, మీ పేటలో అందరూ నిన్ను బాహాటంగానే విమర్శిస్తూ ఉండేవారు. చివరకు కాఫిర్‌ అనికూడా పిలుస్తుండేవాళ్లు. కాని నీవెప్పుడూ వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించలేదు. నీకు నామీద ప్రగాఢ అభిమానం ఉండేది. అయితే నీవు నాపేరును పూర్తిగా పిలువగలిగేవాడివి కాదు. నీవెల్లప్పుడూ నన్ను రామ్‌

20