పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

పరిచయం కోసం ప్రయత్నాలు ఏమాత్రం వీడలేదు. బిస్మిల్‌ ద్వారా విప్లవోద్యమ ప్రవేశం కోసం ఆయన నిర్విరామంగా ప్రయత్నించసాగారు.

ఒకసారి పండిత్‌ రాంప్రసాద్‌ బిస్మిల్‌ను స్వయంగా కలసి విప్లవోద్యమం గురించి చర్చించాలని అష్పాఖ్‌ పట్టుబట్టారు. అందుకు బిస్మిల్‌ అంగీకరించకున్నా, అష్పాఖుల్లా పట్టిన పట్టు వివడలేదు. అష్పాఖ్‌ ఆన్ని రోజలుగా బిస్మిల్‌ చుట్టూతా తిరగటంతో, చివరకు ఆయన దిగివచ్చి అష్పాఖ్‌ అభిష్టాన్ని అంగీకరించక తప్పలేదు.

ఈ విషయాన్నిబిస్మిల్‌ స్వయంగా తన ఆత్మకథలో ప్రస్తావిస్తూ, నాకు బాగా గుర్తు, చక్రవర్తి క్షమాప్రకటన అనంతరం నేను షాజహాన్‌పూర్‌ తిరిగి వచ్చినప్పుడు నీవు మొదట నన్ను స్కూలులో కలిసావు. నన్ను కలుసుకోవాలనే కోర్కె నీ మనస్సులో ఎంతగానో ఉండింది. మైనపురి కుట్ర గురించి నాతో కొంత మాట్లాడాలని నీవు కోరావు. స్కూలులో చదివే ఒక ముస్లిం విద్యార్థి నాతో యిలాంటి విషయాల గురించి ప్రస్తావిస్తున్నాడని శంకించి నేను నీ ప్రశ్నలకు ఎంతో ఉపేక్షతో జవాబు ఇచ్చాను. నీకప్పుడు ఎంతో ఖేదం కలిగింది. నీ హృదయంలోని భావాలు నీ ముఖకవళికల్లో స్పష్టంగా గోచరించాయి.అయితే నీవంతటితో విరమించుకోక దృఢనిశ్చయంతో నిలిచావు. ఏదోవిధంగా వీలు చూసుకుని లక్నో కాంగ్రెసులో నాతో మాట్లాడావు, (బిస్మిల్‌ ఆత్మకధా, పేజి.105) అని రాశారు.

అష్పాఖ్‌ పట్టువీడకుండా బిస్మిల్‌ వెంటపడి ఆయనతో మ్లాడుతూ, తనను ఎలాగైనా రహస్య దళంలోకి తీసుకోమని కోరసాగారు. విప్లవోద్యమంలో తాను పనిచేయాలని అనుకుంటున్నానని బిస్మిల్‌తో చెప్పారు. చివరకు నేను బూటకపు మనిషిని కాను, అంటూ అష్పాఖ్‌ తన ప్రయత్నాలను మరింత ఉదృతం చేసారు. బిస్మిల్‌ మిత్రుల ద్వారా కూడా సిఫారస్సు చేయించారు. చివరకు ఆష్పాఖ్‌ పట్టుదల, దృఢ దీక్షను బిస్మిల్‌ గౌెరవించక తప్పలేదు. అష్పాఖ్‌ మాటల్లో నిజాయితీ విప్లవోద్యమం పట్ల ఆయనకున్న నిబద్ధతను పరీకించాక, అష్పాఖ్‌తో సఖ్యతకు బిస్మిల్‌ అంగీకరించారు.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, నీ మిత్రులతో చెప్పించి నాకు నమ్మకం కలిగించ ప్రయత్నించావు. చివరకు నీవే నెగ్గావు. నీ ప్రయత్నాల వలన నా హృదయంలో నీకు చోటు దొరికింది. పైగా మీ అన్న ఉర్దూ మిడిల్‌ స్కూల్‌లో నా సహపాఠి, మిత్రుడేనన్న సంగతి తెలిసి నాకు మరీ సంతోషమైంది, అని తరువాత రాంప్రసాద్‌ బిస్మిల్‌ అన్నారు. (బిస్మిల్‌ ఆత్మకథ, పేజి.105).

18