పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రాజారాం పరిచయం కోసం ప్రయత్నించారు. ఆపాటికి ఆయన అరెస్టు కావడంతో అది సాధ్యం కాలేదు. శ్రీ రాజారాం అరెస్టు జరిగినప్పుడు తన మిత్రుడు ఆందించిన సమాచారం మేరకు, తన పాఠశాలలోని ఇతర విప్లవకారుల కోసం ఆయన అంవేషణ ప్రారంభించారు.

ఆ ప్రయ త్నంలో అష్పాఖ్‌ ఉండగా, ఒక మిత్రుడు ఆయనకు ఆనంద్‌మఠ్‌ గ్రంథాన్ని ఇచ్చాడు. అది హిందీలో రాసి ఉంది. అష్పాఖ్‌కు హిందీ సరిగ్గా రానందువల్ల మరొక మిత్రుడి ద్వారా ఆ పుస్తకాన్ని చదివించుకుని పూర్తిగా విన్నారు. ఆ పుస్తకం చదువుతూ, ఆ పుస్తకంలోని విశేషాలను చర్చించుకుంటున్న సందర్భంగా విప్లవోద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న, ఆ పాఠశాలకు చెందిన మరో విద్యార్థి శ్రీ పండిత్‌ రాంప్రసాద్‌ బిస్మిల్‌ గురించి ఆ మిత్రుడు చెప్పాడు. ఆ రాంప్రసాద్‌ బిస్మిల్‌ కూడా ఆష్పాఖ్‌ స్వగ్రామమైన షాజహాన్‌పూర్‌కు చెందినవారు. ఆష్పాఖ్‌ అన్నయ్య రియాతుల్లా ఖాన్‌కు బిస్మిల్‌ మిత్రుడు మాత్రమే కాదు, Abbie Rich Mission High School లో ఆయన సహవిద్యార్థి.

ఆ మాత్రం సమాచారం అందటంలో శ్రీరాం ప్రసాద్‌ బిస్మిల్‌ పరిచయం కోసం అష్పాఖ్‌ ప్రయtnaaలు ప్రారంభించారు. అష్పాఖ్‌కు శ్రీ బిస్మిల్‌ పరిచయం అంత తేలిగ్గా దొరకలేదు. ఒకసారి షాజహాన్‌పూర్‌ పట్టణం సమీపాన గల 'ఖోన్నొత్‌' నది తీరాన గల ఇసుక తిన్నెల మీద సభ జరిగింది. ఆందులో రాంప్రసాద్‌ బిస్మిల్‌ పాల్గొంటున్నట్టు తెలిసి ఆయన పరిచయం కోరుతూ అష్పాఖ్‌ కూడా సభకు హజరయ్యారు. ఆ సభలో శ్రీ బిస్మిల్‌ ప్రసంగిస్తూ, మాతృభూమి స్వేచ్ఛ కోసం ఎటువంటి త్యాగానికైనా తాను సిద్దమని ప్రకటించారు. మాతృభూమికి స్వేచ్ఛ ప్రసాదించేందుకు తన లాంటి యువకులు కూడా అందుకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఆ ప్రసంగం అష్పాఖ్‌ను ముగ్దుడ్ని చేసంది. ఆ క్షణాన రాంప్రసాద్‌ బిస్మిల్‌ మారదర్శ కత్వంలో విప్లవోద్యామంలో ప్రవేశించాలని అష్పాఖ్‌ నిర్ణయించుకున్నారు.

ముస్లిం యోధులకు అగ్నిపరీక్ష

ఆ సభలో మొట్టమొదటి సారిగా శ్రీ రాంప్రసాద్‌ బిస్మిల్‌ను అష్పాఖ్‌ చూసారు. అప్పటి నుంచి ఆయన బిస్మిల్‌ను తరచుగా కలవసాగారు. ఆయనతో నమాట్లాడేందుకు ప్రయత్నించారు. అష్పాఖ్‌ ఎన్నిసార్లు కలిసినా బిస్మిల్‌ ఆయనను సరిగ్గా పలకరించేవారు

16