పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌ తన ప్రజలను కాపాడుకున్నవిప్లవకారుడు హారిసన్‌ పాత్ర అష్పాఖ్‌ను బాగా ఆకర్షించింది.

ఆ సాహసికుని తెగింపు సమయస్పూర్తి ఎంతో ఉత్తేజం కలిగించింది. అప్పటి నుండి ఆయన మస్తిష్కంలో ముసురుకున్న అనుమానాల దొంతరలు క్రమక్రమంగా ఒక్కోక్కటి తొలగిపోసాగాయి.

ఆనాటి నుండి భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచిస్తున్న అష్పాఖుల్లాకు ఒకరోజున ఉపాధ్యాయులొకరు ప్రపంచ విప్లవవీరుల జీవిత చరిత్రల పుస్తకాన్ని ఇచ్చారు. ఆ పుస్తకంలో ప్రపంచంలోని విప్లవయోధుల జీవిత చరిత్రలు దృశ్శీకరించి ఉన్నాయి. ఆష్పాఖ్‌కు ఆ పుస్తకం ఇస్తూ ఈ పుస్తకం బహుమతిగా తీసుకోవడానికి నీవు మాత్రమే అర్హుడవు, అందుకని నీకు ఇస్తున్నానని ఆయన అన్నారు. ఆ మాటలు అష్పాఖ్‌లో కించిత్తు గర్వాన్ని కలిగించాయి. ఆయన పుస్తకాన్ని చాలా దీక్షగా చదివారు. పుస్తకం చదువుతున్నంత కాలం పుస్తకంలోని ఒక్కొక్క వీరుడు తన ముందు నిలిచి, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ, విప్లవోద్యమ సంఘటనలను పూసగుచ్చి వివరించినట్లుగా ఆయన భావించారు.

ఆ పుస్తక పఠనం సాగినాక ఆయన మస్తిష్కం పలు ప్రశ్నలకు వేదికయ్యింది. ఆ పుస్తకంలోని విప్లవ యోధుల్లాగే తనకూ మాతృదేశం కోసం జీవితాన్ని పణంగా పెట్టే సువర్ణావకాశం లభిస్తుందా? తాను కూడ విప్లవకారుడు కాగలఫడా? ఆ మహద్భాగ్యం తనకూ దక్కుతుందా? అని ఆయన తన్నుతాను పలుమార్లు ప్రశ్నించు కోసాగారు. ఆ ప్రశ్నలకు ఆయన స్వయంగా సమాధానం చెప్పుకుంటూ, మాతృదేశం కోసం ప్రాణాలను త్యాగం చేయగల విప్లవోద్యమ కార్యాచరణను రూపొందించుకు నేందుకు సిద్ధమయ్యారు.

విప్లవకారుల పరిచయం

ప్రపంచ విప్లవోద్యమాలు, ఆ విప్లవోద్యమాలకు జీవితాలను అర్పితం చేసి స్వజన హితం కోరుతూ, పరాయి పాలకుల బానిసత్వం నుండి మాతృదేశాల విముక్తి కోసం పోరాడుతున్న విప్లవకారుల సాహసోపేత జీవితాలద్వారా స్పూర్తి పొందిన అష్పాఖ్‌ మాతృదేశం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవకారునిగా ఆ విశ్వవిఖ్యాత విప్లవ వీరుల సరసన నిలబడాలని తీర్మానించుకున్నారు. అప్పటి నుండి విప్లవకారుల స్నేహం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అబ్బీ రిచ్‌ మిషన్‌ హైస్కూల్‌ లోని సహ విద్యార్థి శ్రీ 15