పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌అష్ఫాఖుల్లాఖాన్‌

అష్ఫాఖుల్లా జననం - బాల్యం ప్రదమ సాfiతంత్య్ర సంగ్రామ కాలం నుండి వీరపు త్రులను అందిసునfl ఉతర ప్రదేశ్‌రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లో 1900 సంవత్సరం అక్టోబరు 22వ తేదిన విద్యాధిక -సంపన్న జమీందారి కుటుంబంలో అష్పాఖుల్లా ఖాన్‌ జన్మించారు. ఆయన తల్లి మజహరున్నీసా బేగం. తండ్రి షపఖుల్లా ఖాన్‌. ఉన్నత ప్రబుత్వ ఉద్యోగులెన ఆ కుటుంబ సభ్యులు రాజకీయాలకు కడుదూరం. అష్పాఖుల్లా తల్లిదండ్రుల చివరి సంతానం. అతిగారాబంగా పెరిగారు. అష్పాఖుల్లా పొడుగాిటి మనిషి, విశాలమైన ఛాతి, దృఢమైన శరీరం. సింహబలుడు. స్పురద్రాూపి.మృదువైన మాటతీరుతోస్మేహపూర్వక ప్రవర్తనతో, మంచి వస్త్రధారణతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే రూపం ఆయనది. అష్పాఖుల్లా షాజహాన్‌పూర్‌లో గల అబ్బీ రిచ్‌ మిషన్‌ హైస్కూల్‌ లో (జులీలీరిలి ష్ట్రరిబీనీ ఖరిరీరీరిళిదీ కరివీనీ ఐబీనీళిళిజి) ఎనిమిదవ తరగతి వరకు చదివారు. ఆయన చదువు కంటే ఈత, గుర్రపు స్వారి, వేటలోనే ఎక్కువ అభిరు చి చూపేవారు. చిన్నప్పుడు కొంత తుంటరిగా ప్రవర్తించకపోలేదుా . కానీ అప్పటి నుండే దాయాదాకిణ్యాలు, సేవాభావం అతనిలో మూర్తీభ వించి ఉండేవి. (బిస్మిల్‌ ఆత్మకద, హిందీ మూలం శ్రీ రాం ప్రసాద్‌ బిస్మిల్‌, తెలుగుసేత: శ్రీ ఇంగువ మల్లికార్జున శర్మ, మార్క్సిస్టు అధ్యయన వేదిక, దారాబాదు,1989, పేజి.150) ఆష్పాఖుల్లా ఆటపాటలంటే మహాఇష్టం. ఆయన మంచి హాకీ ఆటగాడు.ప్రతిరోజు కసరత్తు చేసి మంచి దేహధారుఢ్యన్ని సంతరించుకున్న బలశాలి. అష్పాùఖుల్లా ఖాన్‌ తల్లి మహజరున్నీసా మంచి చదువరి. అమె పలు గ్రంథాలను అధ్యాయనం చేయటమే కాకుండ, పలు పత్రికలను కూడ తెప్పించుకుని పఠిస్తూ, ఆఇంట వార్తా విశేషాలు చర్చించటం అమె అలవాటు. ఆయా విశేషాలను కథాలుగా తన చిన్నకుమారుడు అష్పాఖుల్లాకు చెబుతూ రావటం వలన చిన్నతనం నుండి అష్పాఖ్‌ కూడ మంచి చదువరయ్యారు. తల్లి వద్ద ఉన్న ఉర్దూ గ్రంథాలను ఆమెసహాయంతో అధ్యాయనం చేశారు. ఆ అధ్యాయనం అష్పాఖ్‌లోస్వేచ్ఛాస్వాతంత్య్రభావనలకు పునాది వేసింది. ఆ కారణంగా ఆయన తన జమీందారి కుటుంబ సభ్యులప్రవర్తనకు, ఆ ప్రత్యేక వాతావరణానికి, ఆ సంస్కతికి దాూరంగానూ, తన సోదారుల వ్యవహారసరళికి చాలా భిన్నంగా ప్రవర్తించటం ఆరంభించారు. 11