పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ అష్ఫాఖుల్లా ఖాన్ సంప్రదాయ-ధార్మిక విద్యలో సుశి క్షుతుడ్నిచేసేందుకు తల్లి తండ్రులు ప్రత్యేకంగా ట్యూటర్‌ను ఏర్పాటు చేశారు. ట్యూటర్‌గా నిమమించబడిన మౌల్వి సాహెబ్‌ పాతతరం మనిషి. ఆయన తొలుత నుండి ఆంగ్లేయులకు, ఆంగ్లేయ సంసృతికి బద్ధవ్యతిరేకి. ఆంగ్లేయులతో స్నేహం చేసినట్టయితే నరకానికి పోతామన్న తీవ్ర భావలను కలిగిన ఆయన ప్రభావం అష్పాఖ్‌ మీద బాగా పడింది. మౌల్వి బ్రిీటిష్‌ ఉత్పత్తులను ఎన్నడూ అంగీకరించేవారు కాదు. స్వదేశీ ఉత్పత్తులను వాడల్సిందిగా ఆయన తనశిష్యులకు బోధించేవారు. ఈ పరిస్థితుల వలన అష్పాఖుల్లా మౌల్వివద్ద ధార్మిక విద్యను నేర్పటం కంటే బ్రిీటిష్‌ వ్యతిరేక భావాలను బాగా అలవర్చుకున్నారు.(Shaheed Ashfhaqulla Khan Aur Unka Yug (Political Biography), By Sudhir Vidyarthi, Sandhrabha Prakasan, Shajahanpur, 1988, Page.17) ఆ భావాల ప్రబావంతో, ఆంగ్లేయులను పరాజితుల్నిచేసేందుకు టర్కీ, ఆపనిస్థాన్‌ అధినేతలు ఇండియా మీద దాడిచేసి బ్రిీటిష్‌ ప్రభుత్వాన్ని కూలదోయాలని అష్పాఖ్‌ తొలి రోజులలో ఆశించారు. ఆ విధంగా టర్కీ, అఫ్ఘనిస్థాన్‌ దేశాధినేతలు యుద్ధం ప్రకటించి తరలి వచ్చినట్టయితే వారితో కలసి బ్రిీటిషర్లకు వ్యతిరేకంగా పోరాడలని ఆయన భావించారు. మతాభివేశంతో వ్యక్తమైన అష్పాఖ్‌లోని ఈ ఆకాంక్ష ఆ తరువాత త్వరితగతిన ఆవిరైపోయింది. ఆ తరువాతి కాలంలో, అటువంటిఅభిప్రాయాలు తనలో కలిగినందుకు తనను, ఆ అభిప్రాయాలు కలుగచేసిన వ్యక్తులను ఆయన స్వయంగా నిందించారు. (Shaheed Ashfhaqulla Khan Aur Unka Yug, Page.18)

విముక్తి పోరాట కార్యకలాపాల పరిచయం

అష్పాఖుల్లా ఖాన్‌ ఏడవ తరగతి చదువుతున్నప్పుడు, ఆ పాఠశాలలో జరిగిన ఒక సంఘటన ఆయనలోని ఉద్యామకారుడ్నిమేల్కొలిపింది. ఆయన జీవిత గమనానికి ఆ సంఘటన మార్గం చూపింది. ఒకరోజు అష్పాఖ్‌ పాఠశాలకు వెళ్ళేసరికి, పాఠశాల ఆవరణ అంతా పోలీసులతో నిండి ఉంది. పోలీసులు ఎవరికోసమో వెతుకుతున్నారు.ఈ హడవుడి ఆసక్తి కలిగించింది. విషయమేంటని విచారించగా పదవ తరగతి చదువు తున్న రాజారాం అనే విద్యార్థి కోసం పోలీసులు వచ్చారని, మైన్‌పూరి దోపిడి కేసులో అతడు నిందితుడని ఓ స్నేహితుడు చెప్పాడు. రాజారాంను పోలీసులు పట్టుకళ్ళడానికి కారణం ఆయన దొంగ కాదని అన్నాడు. ఈ పాఠశాలలో రాజారాం లాింటి విద్యార్థ్ధులు 12