సయ్యద్ నశీర్ అహమ్మద్ చర్యగా తిరగబడి స్టేషన్ తగులబెట్టడంతో పలువురు పోలీసులు మరణించారు. ఈసంఘటనతో గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యామాన్ని విరమించారు. గాంధీజీ తీసుకున్నఈ నిర్ణయం పట్ల దేశవ్యాపంగా నిరసన వ్యకమైంది. జాతీయ కాంగ్రెస్ నాయకులతోపాటు,యువకులకు, విప్లవకారులకు గాంధీజీ నిర్ణయం ఏ మాత్రం నచ్చలేదు. ఆ తరువాతకొంత కాలం వరకు భారత జాతీయ కాంగ్రెస్ ఎటువంటి పోరాటానికి పిలుపు ఇవ్వకపోవడం, జాతీయ కాంగ్రెస్ నాయకులలో తలెత్తిన అభిప్రాయభేదాల మూలంగాజాతీయోద్యమం స్థబ్దతకు గురైంది.
గాంధీజీ నిర్ణయం ప్రజోద్యామాన్ని నీరుకార్చిందని భావించిన యువకులు, విప్లవకారులు దాస్యవిముక్తికి సాయుధపోరాటం తప్ప మరో మార్గం లేదన్ననిర్ణయానికివచ్చారు. ఆవలపెట్టిన ఆయుధాలను తిరిగి అందుకున్నారు. ఈ మేరకు సాగిన విప్లవకార్యకలాపాలలో భాగంగా జరిగిన కాకోరీ రైలు దోపిడి సంఘటన ప్రభుత్వంలోప్రకంపనాలను సృష్టించింది. ఈ చర్య ద్వ్రారా బ్రిటిషుపోలీసు వ్యవస్థకు విప్లవకారులుసవాలు విసిరారు. శతృ వుకు కంటిమీద కునుకు లేకుండ చేసారు. అపూర్వ సాహసంతోవిప్లవ కారులు, సాfiతంత్య్ర స్పూర్తిని కాపాడుతూ, రాజకీయ స్థబ్దతను బద్దలు క్టొారు.
కాకోరి రైలు దోపిడి సంఘటనతో కంగారు పడిన పాలకవర్గం, ప్రజల మీదా, విప్లవకారుల మీదా దారుణంగా విరుచుకుపడింది. ఈ సంఘటన పురస్కరించుకునిన్యాయస్థానంలో జరిగిన విచారణ ప్రజలలో అమితాసక్తికికారణమెంది. విప్లవయోధులు కేసు విచారణ సందర్భంగా ప్రదర్శించిన నిర్భీతి, ఆ తరువాత నవ్వుతూ, తుళ్ళుతూ ఉరి శిక్షలను స్వీకరించిన విధానం జాతీయోద్యామానికి ప్రాణ ప్రతిష్ట చేసాయి. అగ్మియుగంగా చరిత్రకారులచేత కీర్తించబడిన విప్లవోద్యమ కాలంలో కాకోరీ రైలు సంఘటన కలికితురాయిగా నిలిచిపోయింది.
ఈ చారిత్రాత్మక యాక్షన్‌ను నిర్వహించిన హిందూస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ లో సభ్యునిగా అష్పాఖుల్లా ఖాన్ ప్రముఖ పాత్ర వహించారు. మాతృభూమి విముక్తి కోసం సాగిన సాయుధా పోరాటంలో ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిీటిష్ వలస పాలకులపై విప్లవించి అమరత్వం పొందిన యువ యోదులలో అష్పాఖుల్లా ఖాన్ ఒకరు. ఆ వీరకిశోరం తన అపూర్వమెన బలిదానంతో యువకుల్లో దేశాభిమానాన్ని ప్రజ్వరిల్లచేసి 27 సంవత్సరాల వయస్సులో అమరుడయ్యారు. 10