పుట:శ్రీ సుందరకాండ.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాగర్థ ప్రియబంధమయిన కా
వ్యము 'రసాత్మకం'బయి, బ్రహ్మానం
దము నిచ్చును సహృదయులకు, రమ్యా
క్షర కామ్యోపాసకులు సత్కవులు.

కాళిదాసు శృంగారము, భవభూ
తి కరుణమును, జయదేవుని విరహము,
త్యాగరాజు నాద బ్రహ్మరతి, ర
స స్వరూప రోచనలని నమ్ముదు,

గురువులు పూర్వులకు నమించి, యవీ
యసులు నవీనుల నభినుతించి, వా
ల్మీకి గోమతల్లికను పితికెదను;
తెనుగుతోట చల్లని పందిళ్లను.

నన్నయ పద సుందర మృదు బంధము,
తిక్కన వాక్కుల త్రిప్పులు తీర్పులు,
కవిరాజు పలుకు గరువపు పోకలు,
పెద్దన నుడువుల ముద్దుమురిపెములు.

తల్లి పాలవలె తనివో త్రావిన
రాయప్రోలు గిరాభ్రమరిని వల
పించే, ధేనువును వేణుగీతివలె,
భగవత్పాదుల 'భజగోవిందము'.

6