పుట:శ్రీ సుందరకాండ.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం

నమోవాకము

ధ్యానింతును బ్రహ్మానందయతిని,
భావింతును గురుదేవు రవీంద్రుని,
స్మరియింతును శుచిమతి మా పిన్నిని,
త్రికరణశుద్ధికి దీక్షాసిద్ధికి

మావికొమ్మపయి కోవెలవలె, కవి
తాశాఖను కందళితుడైన వా
ల్మీకి మహాముని శోకశ్లోక స
రస్వతికి నమఃప్రాంజలి పట్టితి.

ధర్మార్థ నిరుక్తమయిన శబ్దము
నిష్టార్థ రసమయిని చేసిన ఋషి
వాచా గంగా వీచీమాలలు
నడికట్లగు నా నుడికారములకు.