పుట:శ్రీ సుందరకాండ.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వినసొంపయి పాడను వాచవియగు
భణితి చరణ చారణ శింజితములు
అనురణింపగా తెనుగు వీణియను
శ్రుతిచేసితి నీ శుచిరుచిమత్కృతి.

ఆదికావ్యము పయస్సుల తేలిన
సుందరకాండము జున్ను ముద్దలను,
తెచ్చి పెట్టితిని ముచ్చటగా నయ
గారి తెనుగు బంగారు పళ్లెముల .

కష్టనష్టములు, గండకత్తెరలు
ఆధివ్యాధులు, వ్యధలు, వేదనలు,
తీరును తప్పక దీనిని చదివిన
వారి కనుచు జనవాక్యము కల దిల.

7